కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' రాబోతుంది.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది చిత్రబృందం. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. ఇప్పటివరకు 'ఆర్ఆర్ఆర్' మేనియా ఉండడంతో 'కేజీఎఫ్2' కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టే ఛాన్స్ రాలేదు.
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ప్రశాంత్ నీల్ అండ్ కో కేజీఎఫ్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేయబోతుంది. ముందుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో ట్రైలర్ ను లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఒక్క ట్రైలర్ తోనే అంచనాలను పెంచేశారు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది.
ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ఓ రేంజ్ లో ఉంది. ట్రైలర్ లో హీరో చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అలానే రవీనా టాండన్, సంజయ్ దత్ ల పాత్రలను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ట్రైలరే ఇలా ఉందంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మరి. రవి బసృర్ ఈ సినిమాకి సంగీతం అందించగా.. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తోంది..!
Also Read: పాపం, ఈసారి సరయుకి డేంజర్ తప్పేలా లేదు!