2022 నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థకు కఠిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థకు చెందిన  స్టాక్‌లు క్షీణించడం, చందాదారుల సంఖ్య తగ్గడం లాంటి ఇబ్బందులతో సతమతం అయ్యింది. అయితే, తాజాగా నీల్సన్ సంస్థ ఇచ్చిన 2022 స్ట్రీమింగ్ చార్ట్ లో నెట్ ఫ్లిక్స్ అగ్ర స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. 


నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ‘రన్నింగ్ అప్ దట్ హిల్’ సిరీస్ నాలుగో సీజన్ మొదలయ్యింది. ఈ సీజన్ ఏకంగా 52 బిలియన్ వ్యూ మినిట్స్ సాధించింది. ‘ఓజార్క్’ చివరి సీజన్ 31.3 బిలియన్ నిమిషాలు వ్యూస్ సంపాదించింది. ‘వెన్నెస్ డే’ తొలి సీజన్‌లో 18.6 బిలియన్ నిమిషాలను అందుకుంది. టాప్ 10లో  నెట్‌ఫ్లిక్స్ టైటిల్స్ లో ‘బ్రిడ్జర్టన్’, ‘ది క్రౌన్’, ‘కోబ్రా కై’, ‘వర్జిన్ రివర్’, ‘లవ్ ఈజ్ బ్లైండ్’, ‘మాన్‌స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ’ స్థానం సంపాదించాయి. 


2022లో అత్యధికంగా చూసిన సిరీస్ ‘NCIS'. దీని 356 ఎపిసోడ్‌లు నెట్‌ ఫ్లిక్స్‌ లో 38.1 బిలియన్ నిమిషాల వ్యూస్ సాధించాయి. మూన్‌బగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పాపులర్ కిడ్స్ ప్రోగ్రామ్ ‘కోకోమెలన్’ 37.8 బిలియన్ నిమిషాల వ్యూస్ సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. 26.8 బిలియన్లతో ‘గ్రేస్ అనాటమీ’, 24.9 బిలియన్లతో ‘క్రిమినల్ మైండ్స్’, 21.1 బిలియన్లతో ‘బ్లూయ్’, ‘గిల్మోర్ గర్ల్స్’, ‘ఫ్రెండ్స్’, ‘సీన్‌ఫెల్డ్’ టాప్ ప్లేస్ లో నిలిచాయి. 


నీల్సన్ సంస్థ అనేది అమెరికాలోని టీవీ సెట్‌లలో వ్యూస్ ను మాత్రమే కవర్ చేస్తుంది.  ల్యాప్‌ టాప్‌లు, మొబైల్ ఫోన్లను పరిగణలోకి తీసుకోదు. అమెరికన్లు 2022లో 19.4 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ కంటెంట్‌ను ప్రసారం చేశారు.  ఇది 2021తో పోల్చితే 2022లో 27% పెరుగుదల కనిపించింది. డిసెంబర్ 27, 2021 నుంచి డిసెంబర్ 25, 2022 మధ్య క్యాప్చర్ చేసిన డేటా ఆధారంగా 2022లో అత్యధికంగా ప్రసారం చేయబడిన టైటిల్స్ జాబితాను నీల్సన్ సంస్థ విడుదల చేసింది. వాటిలో టాప్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.


1. స్ట్రేంజర్ థింగ్స్ (నెట్‌ఫ్లిక్స్), 52 బిలియన్ నిమిషాల వ్యూస్


2. NCIS (నెట్‌ఫ్లిక్స్), 38.1 బిలియన్


3. కోకోమెలన్ (నెట్‌ఫ్లిక్స్), 37.8 బిలియన్


4. ఓజార్క్ (నెట్‌ఫ్లిక్స్), 31.3 బిలియన్


5. ఎన్కాంటో (డిస్నీ+), 27.4 బిలియన్లు


6. గ్రేస్ అనాటమీ (నెట్‌ఫ్లిక్స్), 26.8 బిలియన్లు


7. క్రిమినల్ మైండ్స్ (నెట్‌ఫ్లిక్స్/హులు/పారామౌంట్+), 24.9 బిలియన్లు


8. బ్లూయ్ (డిస్నీ+), 21.1 బిలియన్


9. గిల్మోర్ గర్ల్స్ (నెట్‌ఫ్లిక్స్), 20.8 బిలియన్లు


10. సీన్‌ఫెల్డ్ (నెట్‌ఫ్లిక్స్), 19.3 బిలియన్


11. సూపర్ నేచురల్ (నెట్‌ఫ్లిక్స్), 18.8 బిలియన్


12. వెన్నెస్ డే (నెట్‌ఫ్లిక్స్), 18.6 బిలియన్లు


13. హార్ట్‌ ల్యాండ్ (నెట్‌ఫ్లిక్స్), 18 బిలియన్లు


14. కోబ్రా కై (నెట్‌ఫ్లిక్స్), 16.7 బిలియన్


15. ది సింప్సన్స్ (డిస్నీ+), 15.9 బిలియన్లు


ఒరిజినల్ సిరీస్ లు


1. స్ట్రేంజర్ థింగ్స్, 52 బిలియన్ నిమిషాలు


2. ఓజార్క్, 31.3 బిలియన్


3. వెన్నెస్ డే, 18.6 బిలియన్లు


4. కోబ్రా కై, 16.7 బిలియన్


5. బ్రిడ్జర్టన్ (నెట్‌ఫ్లిక్స్), 14 బిలియన్లు


6. వర్జిన్ రివర్ (నెట్‌ఫ్లిక్స్), 13.6 బిలియన్


7. మాన్స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ (నెట్‌ఫ్లిక్స్), 13.4 బిలియన్లు


8. లవ్ ఈజ్ బ్లైండ్ (నెట్‌ఫ్లిక్స్), 13.1 బిలియన్


9. ఇన్వెంటింగ్ అన్నా (నెట్‌ఫ్లిక్స్), 12.9 బిలియన్లు


10. ది క్రౌన్ (నెట్‌ఫ్లిక్స్), 12.7 బిలియన్లు


11. ది బాయ్స్ (ప్రైమ్ వీడియో), 10.6 బిలియన్లు


12. ది గ్రేట్ బ్రిటిష్ బేకింగ్ షో (నెట్‌ఫ్లిక్స్), 10.6 బిలియన్


13. ది అంబ్రెల్లా అకాడమీ (నెట్‌ఫ్లిక్స్), 10.5 బిలియన్లు


14. ది లాస్ట్ కింగ్‌డమ్ (నెట్‌ఫ్లిక్స్), 10.4 బిలియన్లు


15. లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ (ప్రైమ్ వీడియో), 9.4 బిలియన్లు


అక్వైర్డ్ సిరీస్ లు


1. NCIS, 38.1 బిలియన్ నిమిషాలు


2. కోకోమెలన్, 37.8 బిలియన్


3. గ్రేస్ అనాటమీ, 26.8 బిలియన్


4. క్రిమినల్ మైండ్స్, 24.9 బిలియన్లు


5. బ్లూయ్, 21.1 బిలియన్


6. గిల్మోర్ గర్ల్స్, 20.8 బిలియన్లు


7. సీన్‌ఫెల్డ్, 19.3 బిలియన్


8. సూపర్ నేచురల్, 18.8 బిలియన్


9. హార్ట్‌ ల్యాండ్, 18 బిలియన్


10. ది సింప్సన్స్, 15.9 బిలియన్లు


11. ఫ్రెండ్స్(HBO మాక్స్), 14.5 బిలియన్లు


12. బ్లాక్‌లిస్ట్ (నెట్‌ఫ్లిక్స్), 14 బిలియన్లు


13. న్యూ గర్ల్ (నెట్‌ఫ్లిక్స్), 14 బిలియన్లు


14. స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్ (ప్రైమ్ వీడియో), 13.9 బిలియన్


15. షేమ్ లెస్(నెట్‌ఫ్లిక్స్), 13.6 బిలియన్


సినిమాలు


1. ఎన్కాంటో, 27.4 బిలియన్


2. టర్నింగ్ రెడ్ (డిస్నీ+), 11.4 బిలియన్లు


3. సింగ్ 2 (నెట్‌ఫ్లిక్స్), 11.3 బిలియన్లు


4. మోనా (డిస్నీ+), 8.6 బిలియన్లు


5. ఆడమ్ ప్రాజెక్ట్ (నెట్‌ఫ్లిక్స్), 6.1 బిలియన్


6. హోకస్ పోకస్ 2 (డిస్నీ+), 5.7 బిలియన్


7. డోంట్ లూక్ అప్ (నెట్‌ఫ్లిక్స్), 5.1 బిలియన్


8. ఫ్రోజెన్ (డిస్నీ+), 5.1 బిలియన్


9. లూకా (డిస్నీ+), 5 బిలియన్లు


10. ది గ్రే మ్యాన్ (నెట్‌ఫ్లిక్స్), 5 బిలియన్లు


11. జూటోపియా (డిస్నీ+), 4.4 బిలియన్లు


12. కోకో (డిస్నీ+), 4.3 బిలియన్లు


13. ఎటర్నల్స్ (డిస్నీ+), 4.24 బిలియన్లు


14. ఫ్రీజెన్ II (డిస్నీ+), 4.2 బిలియన్


15. అన్ చార్టెడ్(నెట్‌ఫ్లిక్స్), 4.18 బిలియన్


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్