మీరు మీ చిన్నతనంలో విక్రమ్ బేతాళ్ కథలు విని ఉంటారు. దీనికి సంబంధించి టీవీలో కూడా ఒక సీరియల్ వచ్చింది. అందులో బేతాళ్ తరచుగా విక్రమ్‌ని ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. దాదాపు ప్రతి పిల్లవాడు విక్రమ్ బేతాళ్ కథలను చిన్నతనంలో వినే ఉంటాడు. విక్రమ్ బేతాళ్ టీవీ సీరియల్ బాగా ప్రాచుర్యం పొందింది. అయితే, అందులో పేర్కొన్న విక్రమ్ రాజు నిజంగా ఒకప్పుడు భారతదేశంలోని మాల్వాను పరిపాలించాడని మీకు తెలుసా? ఆ రాజు ఏ సమయంలో ఈ ప్రాంతాన్ని రూల్ చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం.


విక్రమ్ బేతాళ్ లో విక్రమ్ ఎవరు?


విక్రమ్ బేతాళ్‌లో పేర్కొన్న విక్రమ్ రాజు విక్రమాదిత్య. ఇతన్ని విక్రమ్‌సేన్ అని కూడా పిలుస్తారు. అతను రాజ్‌పుత్‌ల వంశమైన పరమారా రాజవంశానికి చెందినవాడు. వీళ్లు ఉజ్జయినిని తన సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకున్నారు. 


విక్రమాదిత్య రాజు మాల్వాను ఎప్పుడు పాలించాడు?


విక్రమాదిత్య 57 BC నుంచి 19 AD వరకు భారతదేశానికి చెందిన మాల్వాను పాలించాడు. అతను చరిత్రలో గొప్ప న్యాయమూర్తిగా ఖ్యాతి పొందాడు. ఎందుకంటే, అతను ఎల్లప్పుడూ తన ప్రజలకు సరైన న్యాయం అందివ్వాలని అనేక సంస్కరణలు చేపట్టాడు. దోషులు అతని దగ్గరకు రావడానికి భయపడేవారు. విక్రమాదిత్య రాజు ఇలాంటి ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టే ఈనాటికీ గుర్తుండిపోయాడు.


విక్రమాదిత్య మహారాజు గురించిన పూర్తి వివరాలు భవిష్య, స్కంద పురాణాలలో ఉన్నాయి. విక్రమాదిత్య గురించి ప్రాచీన అరబ్ సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో అతని పాలన అరేబియా వరకు విస్తరించింది. నవరత్నాల సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారని, ఆ తర్వాత అనేక మంది పాలకులు పాటించారు. అతను విక్రమ్ సంవత్ అనే క్యాలెండర్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించాడు. ఇది ఇప్పటికీ హిందూ క్యాలెండర్‌లో ఉపయోగిస్తున్నాం. ఇది కాకుండా, వాణిజ్యం కోసం అతను నిర్మించిన రహదారి ప్రపంచంలోనే పొడవైన రహదారిగా పరిగణిస్తారు. విక్రమ్ బేతాల్‌లోని  పిశాచ కథలో  రాజు విక్రమాదిత్య గురించి కూడా ప్రస్తావించింది.     


విక్రమ్ బేతాళ్‌లో బేతాళ పిశాచాన్ని విక్రమార్కుడు భుజం మీద మోసుకెళ్తుంటాడు. దారి చేరుకునే వరకు విక్రమార్కున్ని నోరు విప్పకూడదంటుంది బేతాళం. దారి పొడవునా కథ చెప్తుంది. చివరలో ఒక చిక్కు ప్రశ్న అడుగుతుంది. "రాజా! తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలగుగాక!" అంటుంది బేతాళం. రాజు చిక్కు ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాడు. మాట్లాడకూడదనే తిరకాసు కూడా ముందే పెట్టింది కాబట్టి, ఓడిపొయావు అంటూ మళ్ళీ వెనక్కి పారిపోయి చెట్టెక్కేస్తుంది బేతాళం. ఇలా రాజు తెలివైన సమాధానాలతో, బేతాళం విక్రమాదిత్యున్ని ఆట పట్టిస్తూ ఉండటం కథంతా సరదాగా సాగుతుంది. పిల్లలే కాదు పెద్దలూ ఈ కథలను బాగా ఎంజాయ్ చేస్తారు.


గుప్తుల కాలంలో అనేక మంది పరాక్రమవంతులైన రాజులు ఉండేవారు. విక్రమాదిత్య వంటి రాజులు పరాక్రమంతో పాటు, ప్రజల పట్ల ఔదార్యంతో మెలగటం, రాజ్య పరిరక్షణ కోసం ఎంతో తెలివితో ఉండటం వంటి వివిధ లక్షణాల వల్ల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. కాబట్టే ఇప్పటికీ కథల రూపలో వారిని గుర్తు చేసుకుంటున్నాం.