కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 'డాక్టర్'తో తెలుగులోనూ మంచి విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. 'అరబిక్ కుతు' సాంగ్ అయితే మిలియన్ల వ్యూస్ ను రాబడుతోంది. 


మూడు రోజుల క్రితం ఈ సినిమా తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. సినిమాలో విజయ్.. వీరరాఘవ అనే క్యారెక్టర్ లో కనిపించనున్నారు.


చెన్నైలో ఓ ఫేమస్ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. అయితే అదే మాల్ లో గవర్నమెంట్ కి చెందిన టాలెంటెడ్ స్పై కూడా ఉంటాడు. అతడే మన హీరో విజయ్. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ మాములుగా లేవు. స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది.


ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు