మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఆయన వీరాభిమానుల్లో ఒకరైన బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.
జనవరి 13న 'వాల్తేరు వీరయ్య'
Waltair Veerayya Release Date : సంక్రాంతి కానుకగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. ముందు నుంచి ఈ తేదీ గురించి తెలిసిందే. అయితే, ఈ రోజు విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. చిరంజీవి 154వ చిత్రమిది. అందుకని, ఇన్ని రోజులు Mega 154 అనేది వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరించారు.
వీరయ్యకు ఒక్క రోజు ముందు సింహా రెడ్డి, వారసుడు!
Pongal Release Telugu Movies 2023 : 'వాల్తేరు వీరయ్య' కంటే ఒక్క రోజు ముందు నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'వీర సింహా రెడ్డి', తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా 'దిల్' రాజు నిర్మిస్తున్న 'వారసుడు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ రెండు సినిమాలు జనవరి 12న విడుదల కానున్నాయి. అజిత్ హీరోగా నటించిన తమిళ సినిమా 'తునివు' జనవరి 11న విడుదల కానుంది. ఆ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. తెలుగు రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడైనట్టు టాక్.
బాస్ పార్టీకి భలే రెస్పాన్స్!
విడుదల తేదీ కంటే ముందు 'బాస్ పార్టీ' పాటను మెగా అభిమానులకు కానుకగా దేవి శ్రీ ప్రసాద్ అందించారు. అందులో చిరంజీవితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్టెప్పులు వేశారు. యూట్యూబ్‌లో ఆ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆల్రెడీ 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
Waltair Veerayya digital rights bagged by Netflix : 'వాల్తేరు వీరయ్య' డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి సొంతం చేసుకుందని వినికిడి. థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా మంచి అమౌంట్ వస్తోందట. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా... ఏపీలో మంచి రేటు పలుకుతోందట.
చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
Also Read : షారుఖ్ ఖాన్ వారసుడు వస్తున్నాడు - స్క్రిప్ట్ రెడీ