వీవీ వినాయక్. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతలు మోగించాయి. కానీ, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయారు. వినాయక్ తెరకెక్కించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
‘కృష్ణ’ కాంబో మళ్లీ రిపీట్!
వాస్తవానికి రవితేజ, వినాయక్ కాంబోలో వచ్చిన ‘కృష్ణ’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. రవితేజలోని పూర్తి స్థాయి మాస్ రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వినాయక్. ఈ సినిమాలో రవితేజ నటన, యాక్షన్ సన్నివేశాలు పాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. కానీ, కుదరడం లేదు. వినాయక్ గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవితో చేసిన ‘ఖైదీ నెం.150’ తర్వాత అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. వినాయక్ తాజాగా తెరకెక్కించిన హిందీ ‘ఛత్రపతి’ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా చెత్త అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.
రవితేజతో వినాయక్ సినిమా
నిజానికి వినాయక్ సినిమాలకు దూరం అవుతాడేమో అని చాలా మంది భావించారు. కానీ, ఆయనకు వరుస ఫ్లాఫులు వచ్చినా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కారణంగా ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తారు. అయితే, చక్కటి కథల కోసం వినాయక్ ప్రయత్నిస్తున్నారట. ఎట్టకేలకు ఓ సినిమా కథ ఓకే అయ్యిందట. ఈ కథ రవితేజకు చెప్పారట. ఆయనకు కూడా నచ్చడంతో ఓకే చెప్పారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
వచ్చే ఏడాది సెట్స్ మీదకు వచ్చే అవకాశం!
గత కొంత కాలంగా రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, రవితేజ ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాలు పూర్తి అయ్యాక వినాయక్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదంటే ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రవితేజ తాజాగా నటించిన ‘టైగర్ నాగేశర్వరరావు’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. స్టువర్టుపురం గజదొంగ నాగేశర్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరెక్కింది.
Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial