'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విశ్వక్ సేన్. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క 'ముఖచిత్రం' సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్. అలానే కాసేపటి క్రితం విశ్వక్ సేన్ క్యారెక్టర్ కి సంబంధించి చిన్న గ్లింప్స్ ని వదిలారు. 


ఇందులో విశ్వక్ సేన్ ని పవర్ ఫుల్ లాయర్ గా చూపించారు. అందరినీ తన వాదనలతో ఏడిపించే సీనియర్ లాయర్ నే ఎదుర్కొని నిలబడే యంగ్ లాయర్ క్యారెక్టర్ లో కనిపించారు విశ్వక్ సేన్. ఒకట్రెండు డైలాగ్స్ కూడా చెప్పారు. ఈ వీడియో అయితే ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమాలో విశ్వక్ సేన్.. విశ్వామిత్రగా కనిపించబోతున్నారు. కథలో ఆయన రోల్ 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం.  


'కలర్ ఫొటో'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్ 'ముఖచిత్రం' సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.


Also Read: రష్మీ ఎందుకు ఏడ్చింది? ఆమె ప్రేమించింది ఎవర్ని?


Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?