విష్ణు ప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్‌తో సందడి చేస్తూ ఉంటారు. అటువంటి విష్ణు ప్రియ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ స్టోరీలో మంగళవారం రాత్రి చాలా అంటే చాలా అసభ్యకరమైన ఫోటోలు పోస్ట్ అయ్యాయి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్న మహిళల ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఫేస్‌బుక్‌ పేజీలో ఏవేవో వీడియోస్ పోస్ట్ అయ్యాయి. ఇదేమిటి? అని ఆరా తీస్తే... అసలు విషయం బయటపడింది. 


Vishnupriya Bhimeneni Facebook Hacked : విష్ణు ప్రియ భీమినేని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా నీలి చిత్రాలను పోస్ట్ చేశారు. విషయం తెలియడంతో విష్ణు ప్రియ జాగ్రత్త పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లకు మెసేజ్ అందించారు. 


''విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి. ఆ పేజిని అన్ ఫాలో అవ్వండి'' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టొరీలో ఆవిడ పోస్ట్ చేశారు. అదీ సంగతి!


విష్ణు ప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. సుమారు 11 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. అటు ఫేస్‌బుక్‌లో ఆమెకు నాలుగు మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు. హ్యాక్ అవ్వడంతో ఫేస్‌బుక్‌ టీమ్‌కు విష్ణు ప్రియ కంప్లైంట్ చేశారు. మళ్ళీ ఆమె చేతికి అకౌంట్ రావడానికి కొంత టైమ్ పట్టవచ్చు. 


'జరీ జరీ పంచెకట్టి'...
ప్రేక్షకులు క్లాప్స్ కొట్టి!
విష్ణు ప్రియ భీమినేని ప్రయాణం షార్ట్ ఫిలిమ్స్‌తో స్టార్ట్ అయ్యింది. యూట్యూబ్ ఫిలిమ్స్ చేశాక... టీవీలో అడుగు పెట్టారు. 'పోరా పోవే' కార్యక్రమంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో కొన్ని ఎపిసోడ్స్‌లో, 'జబర్దస్త్'లో కొన్ని స్కిట్స్‌లో కనిపించారు. ఇటీవల 'జరీ జరీ పంచెకట్టి' అని మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ లభించింది. అందులో 'బిగ్ బాస్' మానస్, విష్ణు ప్రియ జంటగా స్టెప్పులు వేయగా... ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. 


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?






సినిమాలకు వస్తే... కొన్నాళ్ల క్రితం 'చెక్ మేట్' సినిమాతో విష్ణు ప్రియ సందడి చేశారు. 'ఆహా' ఓటీటీలో అందుబాటులో ఉన్న 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' వెబ్ సిరీస్ లో కీలక పాత్ర చేశారు. 


ఇప్పుడు సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు విష్ణు ప్రియ తలుపు తడుతున్నాయని టాక్. మంచి అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తున్నారట. తన కెరీర్ కు ఉపయోగపడే విధమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నారట. గ్లామర్ రోల్స్ చేయడానికి తాను రెడీ అని అప్పుడప్పుడూ బోల్డ్ ఫోటో షూట్స్ ద్వారా దర్శక నిర్మాతలకు విష్ణు ప్రియ చెబుతున్నారు. ఒకప్పుడు టీవీ కార్యక్రమాలతో పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. రష్మీ గౌతమ్ కూడా సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై కీలక పాత్రలతో శ్రీముఖి బిజీ బిజీగా ఉంటున్నారు. అందువల్ల, విష్ణు ప్రియకు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.