మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ సందర్భంగా సన్నీ ఇక్కడే మకాం వేసి షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే, షూటింగ్ మధ్యలో విష్ణుతో కలిసి చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ సన్నీ సందడి చేస్తోంది.
కొద్ది రోజుల కిందట సన్నీ లియోన్ షూటింగ్ బ్రేక్‌లో ముఖానికి మాస్క్ పెట్టుకుని విష్ణును భయపెట్టాలని చూసింది. అయితే, విష్ణు భయపడలేదు. సన్నీ మాస్క్ తీసిన వెంటనే భయపడి పరుగులు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా సన్నీ.. మంచు విష్ణు, శివ బాలాజీలకు మరో గేమ్ పరిచయం చేసింది. బాలాజీ, విష్ణుకు మధ్యలో కూర్చొని ఇద్దరినీ ఒట్టి చేతులతో కొట్టింది. ఇద్దరిలో ఏ ఒక్కరి బాటిల్ చేతికి తగిలినా మధ్యలో ఉన్నవారు ఔట్ అవుతారు. ఇలా సన్నీ, శివ, విష్ణు కాసేపు ఈ ఫన్నీ గేమ్ ఆడారు. ఈ వీడియో చూసి మరీ చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారే అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఎప్పటిలాగేనే విష్ణును టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. జోకులు కూడా బాగానే పేలుతున్నాయి.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
వీడియో: