యాక్షన్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో ఎ. వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లాఠీ'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సునయన హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.

 

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ ని వదిలారు. కోలీవుడ్ లో స్టార్ హీరోలంతా నటించిన పోలీస్ స్టోరీస్ లో నుంచి చిన్న సీన్స్ ను తీసుకొని ఈ టీజర్ గ్లింప్స్ ని కట్ చేశారు. అందరు స్టార్ హీరోలను పోలీస్ గెటప్స్ లో చూపించి ఫైనల్ గా విశాల్ ని రివీల్ చేశారు. ఒక్క సీన్ తోనే సినిమాలో విశాల్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూపించేశారు. త్వరలోనే పూర్తి టీజర్ అండ్ ట్రైలర్ లను విడుదల చేయనున్నారు. 

 

అన్ని భాషల్లో ఈ సినిమాను ఒకే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రమణ, నంద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విశాల్ చివరిగా 'సామాన్యుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం 'లాఠీ' సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!