అనుష్కా శర్మలో అందమైన నటి మాత్రమే కాదు... ఆమెలో మంచి వ్యాపారవేత్త కూడా ఉన్నారు. హిందీ సినిమాల్లో నటించడంతో పాటు క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్ స్టార్ట్ చేసి తమ్ముడు కర్నేష్ శర్మతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు భర్త విరాట్ కోహ్లీతో కలిసి మరో వ్యాపారం స్టార్ట్ చేశారు.
బ్లూ ట్రైబ్ ఫుడ్స్ స్టార్టప్‌లో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు పెట్టుబడులు పెట్టారు. ప్లాంట్ బేస్డ్ మీట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ప్లాంట్ బేస్డ్ మీట్ అంటే... మాంసం అస్సలు ముట్టుకోరు. మొక్కల ద్వారా తయారైన ఆహారాన్ని మాత్రమే ముట్టుకుంటారు.
"భావి తరాల కోసం ఈ భూమిని మనం ఎంత అందమైన ప్రపంచంగా మార్చగలం? ఈ భూమి మీద మానవాళి ప్రభావాన్ని ఎలా తగ్గించగలం? అని విరాట్, నేను డిస్కస్ మాట్లాడుకుంటూ ఉంటాం. దాని ఫలితమే ఇది" అని అనుష్కా శర్మ పేర్కొన్నారు. "నిజాయతీగా చెప్పాలంటే... కొన్నిసార్లు మాంసాన్ని మిస్ అవుతా. మేం ఫుడ్డీస్ కదా! అయితే... ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడం ద్వారా మేం మా జీవితాలను మార్చుకున్నాం" అని విరాట్ కోహ్లీ చెప్పారు. గత ఏడాది బాలీవుడ్ దంపతులు రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా దంపతులు కూడా ఓ ప్లాంట్ బేస్డ్ మీట్ బ్రాండ్ ను లాంచ్ చేశారు.
విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు బ్లూ ట్రైబ్ ఫుడ్స్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా మంది దీనివైపు చూసే అవకాశం ఉంది. క్రికెటర్‌గా విరాట్ కోహ్లీకి, కథానాయికగా అనుష్కా శర్మకు ఉన్న క్రేజ్ కంపెనీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.