విక్రమ్-కెన్నెడీ జాన్ విక్టర్
తమిళ టాప్ హీరో విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడిలో ఆయన జన్మించారు. చారు హాసన్, కమల్ హాజర్, సుహాసిని కూడా ఇక్కడే జన్మించారు. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘అక్కపెత్తనం చెల్లెలి కాపురం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘శివపుత్రుడు’ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సౌత్ లో అగ్రనటుడిగా కొనసాగుతున్నారు.
టబు- తబ్సుమ్ ఫాతిమా హష్మి
ప్రముఖ నటి టబు అసలు పేరు తబ్సుమ్ ఫాతిమా హష్మి. హైదరాబాదీ ముస్లీం కుటుంబంలో జన్మించారు. 1980లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 'బజార్' అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ‘కూలీ నెం.1’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. పలు భాషల్లో అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకుంది.
అక్షయ్ కుమార్- రాజీవ్ హరి ఓం భాటియా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా పౌరసత్వం కలిగిన ఈ నటుడు బాలీవుడ్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2015లో ఫోర్బ్స్ ప్రపంచ అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో 9వ స్థానంలో అక్షయ్ నిలిచారు.
అజయ్ దేవగన్ - విశాల్ వీరూ దేవగన్
అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ బాలీవుడ్ నటుడు. స్టంట్ మాస్టర్ కూడా. ‘పూల్ ఔర్ కాంటే’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
నయనతార- డయానా మరియం కురియన్
నయనతార 1984 నవంబరు 18 బెంగళూరులో జన్మించింది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్, కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ లో పాల్గొనేది. ఆమె ను ఓ మోడలింగ్ షోలో చూసి మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె నటనకు గాను ఎన్నో అవార్డులు అందుకుంది.
ధనుష్- వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా
తమిళ నటుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. సినిమా పరిశ్రమలోకి వచ్చాక ఆయన పేరు మార్చుకున్నారు. 2011 లో ఆయన పాడిన ‘వై దిస్ కొలవెరి’ అనే పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. యూట్యూబులో ఎక్కువ వ్యూస్ సాధించిన భారతీయ పాటగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈయన ఎన్నో హిట్ సినిమాలతో తమిళంలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు.
అనుష్క-స్వీటీ శెట్టి
బెంగళూరుకు చెందిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాథ్, నాగార్జున కాంబోలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలువురు అగ్ర నటులతో కలిసి నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
శ్రీదేవి- శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
తమిళనాడు శివకాశిలో జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్లోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయింది.
సూర్య- శరవణన్ శివ కుమార్
తమిళ స్టార్ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యను ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరు సార్లు చేర్చారు.
కార్తి- కార్తీక్ శివ కుమార్
ప్రముఖ తమిళన నటుడు సూర్య తమ్ముడే కార్తి. ఈయన అసలు పేరు కార్తీక్ శివ కుమార్. తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించారు. వరుస హిట్లతో అగ్ర నటుడిగా ఎదిగారు.
సన్నీ లియోన్- కరేన్ మల్హోత్రా
సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడు కాగా, తల్లి హిమాచల్ ప్రదేశ్ వాసి. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. సన్నీలియోన్ పుట్టకముందే తల్లిదండ్రులు కెనడాలో సెటిల్ అయ్యారు. 2005లో నీలి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో నటిగా కొనసాగుతోంది.
కియారా అద్వానీ- అలియా అద్వానీ
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని, జెనీవీ జాఫ్రే. తండ్రి వ్యాపారవేత్త. తాజాగా సిద్దార్థ్ మల్హోత్రాతో ఆమె వివాహం చేసుకుంది.
యష్- నవీన్ కుమార్ గౌడ
కన్నడ స్టార్ హీరో యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. కర్ణాటక హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు.తండ్రి బస్ డ్రైవర్. చదువు పూర్తి కాగానే డ్రామా బృందంలో చేరి స్టేజి షోలు, టీవీ సీరియల్స్ చేశారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు.
ఏఆర్ రెహమాన్- దిలీప్ కుమార్
ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పూర్తి పేరు అల్లా రఖా రెహమాన్. కానీ, ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తర్వాత ముస్లీం మతాన్ని స్వీకరించారు. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ సినిమాకు మ్యూజిక్ అందించి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.
Read Also: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ నుంచి కీలక అప్‌డేట్ - షూటింగ్‌కు సర్వం సిద్ధం