టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోగా ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించారు. ఇప్పుడు 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు విజయ్ దేవరకొండ.
టాలీవుడ్ లో మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న హీరో విజయ్ అనే చెప్పాలి. ఇప్పటికే పలు బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా 'థమ్స్ అప్' యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు. అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించారు.
అలాంటి బ్రాండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని 'థమ్స్ అప్' కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. చేతిలో సాఫ్ట్ డ్రింక్ పట్టుకొని ఉన్న విజయ్ ఫొటోను షేర్ చేస్తూ.. 'థమ్స్ అప్.. సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ కూడా తన ట్విట్టర్ పేజ్ లో పేరు చివరన తుఫాన్ అని యాడ్ చేశారు. త్వరలోనే ఈ యాడ్ ను టీవీల్లో టెలికాస్ట్ చేయనున్నారు.