విజయ్ దేవరకొండ తాజా సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. వీరిద్దరు కలిసి రూపొందించిన తొలి సినిమా సైతం ఇదే కావడంతో మంచి విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాతల నష్టాన్ని కొంతమేర తగ్గించేందుకు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.
భారీగా కలెక్షన్లను సాధిస్తుందని ఊహించినా..
లైగర్ సినిమా కోసం జరిగిన ప్రమోషన్స్ చూసి.. ఈ సినిమా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగింది. అయితే సినిమా విడుదలయ్యాయే అసలు కథ మొదలయ్యింది. భారీగా వసూళ్లు వస్తాయని భావించిన సినిమా నిర్మాతలకు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది. సౌత్ నుంచి నార్త్ వరకు.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తొలి షో నుంచే సినిమాకు సంబంధించి నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా రెండు రోజుల పాటు ఫర్వాలేదు అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు నుంచి ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేశారు. కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. దీంతో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూరి జగన్నాథ్ తన రెమ్యునరేషన్ తో పాటు కలెక్షన్లలో తన వాటాకు వచ్చిన 70 శాతం డబ్బులను వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.
రెమ్యునరేషన్ వదులుకున్న విజయ్
పూరి జగన్నాథ్ బాటలోనే విజయ్ దేవరకొండ నడిచినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ లో విజయ్ కిి వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను పూర్తిగా వదులుకున్నాడట. అటు తన పారితోషికంలో రూ.6 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
లైగర్ మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్నేపథ్యంలో రూపొందింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే పెద్ద ఎత్తున నెగెటివ్ టాక్ వచ్చింది. పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అటు విజయ్, పూరి కాంబోలో ‘జన గణ మన’ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్