Varun Tej- Lavanya : మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 6 ఏండ్ల పాటు ప్రేమలో కొనసాగిన వీరిద్దరు గత నవంబర్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు హ్యాపీగా టూర్లు వేసిన ఈ జంట, ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యింది.
ఇద్దరి సమాధానం ఒక్కటే, వావ్ అంటున్న నెటిజన్లు!
ఇక వరుణ్ తేజ్ తాజా చిత్రం ’ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే వరుణ్- లావణ్య దంపతులు ‘సూపర్ సింగర్ ప్రోగ్రాం’కు గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లావణ్య, వరుణ్ ను వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వరుణ్.. లావణ్యని మొదటిసారి చూసినప్పుడు ఏం డ్రెస్ వేసుకుంది? వరుణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇద్దరు మొదటిసారి కలిసి వెకేషన్ కి ఎక్కడికి వెళ్లారు? సహా పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఇద్దరు సేమ్ సమాధానం చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. లావణ్యను ఫస్ట్ చూసినప్పుడు బ్లూకలర్ డెనీమ్‌లో ఉన్నట్లుందని వరుణ్ అన్నాడు. లావణ్య కూడా అదే చెప్పింది. అలాగే ఇద్దరు కలిసి వెళ్లిన ఫస్ట్ వెకేషన్ థాయ్‌లాండ్ అని లావణ్య చెప్పాగా.. వరుణ్ కూడా అదే చెప్పాడు.
గత నవంబర్ లో వరుణ్-లావణ్య వివాహం
ఇక వరుణ్ తేజ్- లావణ్య వివాహం గత ఏడాది(2023) నవంబర్ 1న అట్టహాసంగా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు ఒకటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి జరిగింది. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయి. కాక్ టైల్ పార్టీతో మొదలై హాల్ది, సంగీత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికి ముందే హైదరాబాదులో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి.
'ఆపరేషన్ వాలెంటైన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్
అటు 'గాండీవ దారి అర్జున' వంటి ప్లాప్ తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకుని వైమానిక దాడి ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ కు హెడ్ గా కెప్టెన్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 16న పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి రీసెంట్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత ఆమె చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్ కీలక పాత్ర పోషించాడు. విశ్వక్ కే ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ‘పులి మేక’ తర్వాత తెలుగులో లావణ్య త్రిపాఠి నటించిన సెకండ్ వెబ్ సిరీస్ ఇది. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్