మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేస్తున్నారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాలో తోడల్లుళ్లుగా కనిపించబోతున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతడి విషెస్ ను తెలుపుతూ.. 'ఎఫ్3' టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ సూట్ వేసుకొని స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తూ.. తన చేతిలో ఉన్న సూట్ కేసుని విసిరేసి.. పాకెట్ లో నుంచి రెండు వేల రూపాయల కట్ట తీసుకొని హడావిడి చేస్తూ కనిపించారు. ఈ వీడియో పాటలో ఒక సీన్ అని తెలుస్తోంది. 


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదివరకు ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరోజు ముందుకు జరిగింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా 'ఎఫ్2'కి మించి ఉంటుందని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 






Also Read: ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ఎంట్రీ.. వెల్కమ్ చెప్పిన రవితేజ..