ర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వింత వింత డ్రెస్సులకు ఆమె పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఆమె చేసుకునే డ్రెస్సులు చూసి నెటిజన్స్ తలలు బాదుకుంటారు. ఎవరు ఏమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తనకు నచ్చిన డ్రెస్సింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.


టీ బ్యాగ్స్ డ్రెస్సుతో ఆకట్టుకున్న ఉర్ఫీ


తాజాగా ఉర్ఫీ వేసుకున్న డ్రెస్సు చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఈమె ఫ్యాషన్ కు ఓ దండం బాబూ అనేలా డ్రెస్సు ధరించింది. ఇంతకీ ఈమె వేసుకున్న డ్రెస్సు ప్రత్యేకత ఏంటంటే? టీ బ్యాగ్స్ తో ఆ డ్రెస్సు రెడీ అయ్యింది. టీ బ్యాగ్స్ డ్రెస్సు ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముందుగా, టీ బ్యాగ్స్ తో కుట్టిన డ్రెస్ మీద టీ పోసింది. ఆ తర్వాత దాన్ని డ్రెస్సుగా ధరించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ, 'హలో ఫ్రెండ్స్, చాయ్ పీలో' అని క్యాప్షన్ పెట్టింది. కొంత మంది ఆమె వింత డ్రెస్సును చూసి వారెవ్వా అనగా, మరికొంత మంది ఆను ట్రోల్ చేశారు. 






బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయిన ఉర్ఫీ


ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అటు బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది.


2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది. ఉర్ఫీ జావేద్ అక్టోబర్ 15, 1997న లక్నోలో జన్మించింది. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌ లో పట్టా అందుకుంది. ఉర్ఫీ జావేద్‌ వెరైటీ డ్రెస్సులతోనే బాగా పాపులర్ అయ్యింది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి.


Read Also: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!