Urfi Javed Instagram Account: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి ఆమె సుపరిచితం. చిత్ర విచిత్ర వస్త్రధారణతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఎన్నోసార్లు గ్లామరస్ ఫోటో షూట్లు నిర్వహించి నెటిజన్లను అలరించింది. ఫ్రాంక్ వీడియోలతో నిత్యం వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంటుంది. పలుమార్లు పబ్లిక్ ప్లేసెస్ లో ఆమె న్యూసెన్స్ చేసిన సందర్భాలున్నాయి. ఆమె వస్త్రధారణ చూసి పలు రెస్టారెంట్లు  లోపలికి అనుమతించకపోవడం వివాదం అయ్యింది. రెస్టారెంట్ యజమానులతో ఉర్ఫీ గొడవ పడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమె వేసుకునే దుస్తుల కారణంగా నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.


ఉర్ఫీ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ సస్పెండ్


తాజాగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఇన్ స్టాగ్రామ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె పోస్టు చేసే వీడియోలు, ఫోటోలు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఉన్న కారణంగానే ఆమె అకౌంట్ ను తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, పలువురు నెటిజన్లు కూడా ఆమెకు సంబంధించి పోస్టుల విషయంలో పెద్ద సంఖ్యలో రిపోర్టులు కొట్టినట్లు సమాచారం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఇన్ స్టా యాజమాన్యం ఆమె అకౌంట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.   


అకౌంట్ ను మళ్లీ పునరుద్దరించిన ఇన్ స్టా


అకౌంట్ తొలగించిన కొద్ది సేపటికే మళ్లీ పునరుద్దరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్ స్టా నుంచి ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సదరు సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ను ఉర్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు చాలా మంది కళ్లు చల్లబడ్డాయి అంటూ ఆమె కామెంట్ చేసింది. కాసేపట్లోనే మళ్లీ ఉర్ఫీ అకౌంట్ ను పునరుద్దరించింది. ఇదే విషయంపై ఇన్ స్టా టీమ్ రియాక్ట్ అయ్యింది. పొరపాటున ఉర్ఫీ అకౌంట్ మిస్ అయినట్లు వెల్లడించింది. దీంతో ఆమె అకౌంట్ మళ్లీ వచ్చేసింది. ఇన్ స్టా టీమ్ మళ్లీ తన అకౌంట్ ను యాక్టివేట్ చేయడం పట్ల ఉర్పీ సంతోషం వ్యక్తం చేసింది. కొన్ని టెక్నికల్ కారణాలతో ఆమె అకౌంట్ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.


టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు


ఉర్ఫీ మొదట్లో టెలివిజన్‌లో చిన్న చిన్న పాత్రలకు సెలెక్ట్ అయ్యింది. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది.   


Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply