Yellandu constituency : ఇల్లెందు గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మరోసారి పట్టు నిలుపుకుంది. ప్రస్తుతం జరిగిన్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. గతంలో కనకయ్య కాంగ్రెస్‌ పక్షాన గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరగా, ఈసారి హరిప్రియ కాంగ్రెస్‌కి గుడ్‌ బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి కనకయ్య అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో హరిప్రియకు 70259 ఓట్లు రాగా, కోరం కనకయ్యకు 67352 ఓట్లు వచ్చాయి. నరసయ్య గతంలో ఐదుసార్లు ఇల్లెందులో గెలిచారు. 


2014లో ఇల్లందులో కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి అభ్యర్థి బాణోత్‌ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికే కనకయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో హరిప్రియ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. 1972 తర్వాత ఇల్లందులో కాంగ్రెస్ అప్పడు గెలిచింది.