అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమంలో ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగం గత వారం విడుదల అయిన సంగతి తెలిసిందే. రెండో భాగం జనవరి 6వ తేదీన విడుదల కానుంది. దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌లో కొంచెం సీరియస్ విషయాలు కూడా డిస్కషన్‌కు వచ్చినట్లు కొత్త ప్రోమోలో కనిపిస్తుంది.


‘సాహో’ సినిమా ఫెయిల్యూర్, దాని వెనక ఉన్న కష్టం గురించి ప్రభాస్ మాట్లాడారు. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో ఫన్ ఎలిమెంట్స్‌తోనే ప్రారంభం అయింది. ‘ఏమైనా చెప్తే పూర్తిగా చెప్పేయ్... సగం సగం మాత్రం చెప్పకు.’ అని గోపిచంద్‌తో ప్రభాస్ అన్నప్పుడు వెంటనే బాలకృష్ణ అందుకుని ‘నిజాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడే బ్యాచ్ ఇది.’ అన్నారు. ఆ తర్వాత సాహో గురించి ప్రస్తావన వచ్చింది.


మొదటి ఎపిసోడ్‌లో ప్రభాస్ పాత సినిమాల డైలాగులను వినిపించి అది ఏ సినిమాలోదో చెబుతూనే దాని గురించి మాట్లాడాలని బాలకృష్ణ అడిగారు. అలా 'ఛత్రపతి' సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే డైలాగ్‌ను ప్లే చేశారు. ఆ డైలాగ్ విన్న ప్రభాస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.


రాజమౌళి నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు
రాజమౌళి అంటేనే పర్ఫెక్షన్ అని, తను అనుకునే ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ వచ్చే వరకూ టేక్‌ల మీద టేక్ లు తీసుకుంటూనే ఉంటాడని ఉన్న టాక్‌కు తను మాత్రమే మినహాయింపు అని ప్రభాస్ చెప్పారు. 'ఛత్రపతి'లో అంత మంది భారీ జనం ముందు గొంతు పెద్దగా చించుకుని అరవలేకపోయేవాడినని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.


సందర్భానికి తగ్గట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చిన్నగా డైలాగులు చెబుతానని అని రాజమౌళికి చెబితే 'నీకు నచ్చినట్లు ఫ్రీగా ఉండు! ఫ్రీగా చేయ్' అని ఆయన సపోర్ట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. అందుకని జాగ్రత్తగా గమనిస్తే ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ లో అటు ఇటూ తిరుగుతూ నోరు ఆడిస్తాను తప్ప డైలాగ్ లు చెప్పలేదని డబ్బింగ్ లో కవర్ చేశానన్నాడు. అప్పటి నుంచి అదే తనకు అలవాటుగా మారిపోయిందని అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే డైలాగులు గట్టిగా చెప్పలేనంటూ తన బలహీనతను సైతంగా ధైర్యంగా చెప్పేశాడు ప్రభాస్.