థాంక్స్ టు ఆహా... నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లో కొత్త కోణం చూసే అవకాశాన్ని తెలుగు ప్రజలకు కల్పించింది. బాలకృష్ణ అంటే సీరియస్‌గా ఉంటారనే ఇమేజ్‌ను 'అన్‌స్టాపబుల్' షో పూర్తిగా మార్చేసింది. బాలయ్య చమత్కారం, సరదా సంభాషణలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో వ్యూస్ విపరీతంగా వస్తున్నాయి.
రెండు రోజుల్లో 30 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
'అన్‌స్టాపబుల్ 2' ఐదో ఎపిసోడ్‌కు ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు (D Suresh Babu), అల్లు అరవింద్ (Allu Aravind)తో పాటు దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చారు. 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన కొన్ని సినిమాల గురించి చర్చించారు.
అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దీనికి ఆదరణ కూడా బావుందని ఆహా పేర్కొంది. రెండు రోజుల్లో 30 మిలియన్ మినిట్స్ పాటు ఈ ఎపిసోడ్‌ను వీక్షకులు చూశారని ఆహా పేర్కొంది. ఇదొక రికార్డు అని చెప్పాలి.
'అన్‌స్టాపబుల్' సీజన్ 2 కంటే ముందు ఫస్ట్ సీజన్ కూడా పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఐఎంబీడీలో టాప్ రేటెడ్ తెలుగు షోగా చరిత్రకు ఎక్కింది.
Also Read : 'ఆర్ఆర్ఆర్'కు ఎదురు లేదు, ఇంకో అవార్డు - ఎక్కడ వచ్చిందో అడగాలంతే
డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... అన్నట్టు 'అన్‌స్టాపబుల్' (Unstoppable) సెకండ్ సీజన్ సాగుతోంది. 'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్‌లో నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలతో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్‌లను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఐదో ఎపిసోడ్ గురించి తెలిసిందే. త్వరలో జయప్రద, జయసుధతో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. వాళ్ళతో పాటు మరో యంగ్ హీరోయిన్ కూడా ఉంటారట. ప్రభాస్ కూడా ఈ షోకి రానున్నారు.
బాలయ్యతో ప్రభాస్ & గోపీచంద్
ఇప్పటి వరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క... ఇప్పుడు వచ్చే గెస్టులు ఓ లెక్క... అనే విధంగా 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ను తీసుకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్, గోపీచంద్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. బాలకృష్ణ షో కోసం వాళ్ళిద్దర్నీ ఒప్పించారు. ఈ 11న ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలిసింది.
ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ పొలిటికల్ పరంగానూ డిస్కషన్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్ కూడా! ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు.