Balakrishna Adivi Sesh Sharwanand : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శేష్, శర్వాతో బాలయ్య దబిడి దిబిడే

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ మూడో ఎపిసోడ్‌లో శర్వానంద్, అడివి శేష్ సందడి చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో వాళ్ళ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Continues below advertisement

వెండితెరపై మాత్రమే కాదు... డిజిటల్ తెరపై కూడా నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వినోదం అందిస్తున్నారు. 'ఆహా' ఓటీటీ కోసం ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK S2). సెకండ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. త్వరలో మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. 

Continues below advertisement

బాలయ్య దగ్గరకు వచ్చిన శర్వా, అడివి శేష్
'అన్‌స్టాప‌బుల్‌ 2' (Unstoppable 2) ఫస్ట్ ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ సందడి చేశారు. వాళ్ళు బాలయ్య ఫ్యామిలీ. ఆ తర్వాత ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లోనూ యువ హీరోలు సందడి చేయనున్నారు. 

శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh)... ఇద్దరూ తమ టాలెంట్‌తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పైకి వచ్చిన యువ కథానాయకులు. ఇంకో కామన్ థింగ్ ఏంటంటే... ఇద్దరూ బ్యాచిలర్సే. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే వీళ్ళిద్దరి పేర్లు ఉంటాయి. వీళ్ళతో బాలకృష్ణ చేసిన సందడి త్వరలో స్ట్రీమింగ్ కానుంది.   

''టాలీవుడ్‌లోని ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌తో దబిడి దిబిడి కంటిన్యూ అవుతుంది. నవంబర్‌లో మూడో ఎపిసోడ్ ప్రీమియర్ అవుతుంది'' అని ఆహా ట్వీట్ చేసింది. బాలకృష్ణ, శర్వానంద్, అడివి శేష్ ఫోటోలు పోస్ట్ చేసింది.  

Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...

రికార్డుల వేటలో రెండో సీజన్!
'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' ఫస్ట్ సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో హయ్యస్ట్ రేటెడ్ టాక్ షోగా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్ (Unstoppable With NBK Season 2) కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

'అన్‌స్టాప‌బుల్‌ 2' ఫస్ట్ ఎపిసోడ్‌లో బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్‌తో బాలకృష్ణ ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాలను కూడా డిస్కస్ చేశారు. ఆ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్ అయిన 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. ఆ తర్వాత కూడా మంచి వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చిన ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌తో బాలయ్య రెడీ అయ్యారు. నవంబర్ తొలి వారంలో ఈ ఎపిసోడ్ ప్రీమియర్ కానుందని టాక్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన టీజర్, ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా... రోల్ రైడా పాడిన థీమ్ సాంగ్ కూడా హిట్ అయ్యింది. 

సినిమాలకు వస్తే... ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' చేస్తున్నారు బాలకృష్ణ. ఆ సినిమా కోసం భారీ ఫైట్ తీస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. శ్రుతీ హాసన్ కథానాయికగా... వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Continues below advertisement