Mamathatone Maata Madhuram తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో అభిమానులకు మరింత చేరువైంది. ఈ ప్రేమతో.. జీ తెలుగులో భాగంగా ఓ బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. "మమతతోనే మాట మధురం" పేరుతో రిలీజ్ జీ తెలుగు రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంది. 

Continues below advertisement

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించారు. ఓ సైనికుడి కూతురికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి పెళ్లి పది రోజుల్లో ఉండగా ఆర్మీ ఆఫీసర్‌ విధులకు వెళ్లాల్సి వస్తుంది. కూతురు తండ్రికి వెడ్డింగ్ కార్డు ఇచ్చి కచ్చితంగా పెళ్లికి రా నాన్న అని చెప్పే సీన్ కన్నీరు తెప్పిస్తుంది. పదిరోజుల్లో పెళ్లి ఒక్కదాన్నే ఎలా పెళ్లి పనులు చేసేదని పెళ్లి కూతురి తల్లి బాధ పడుతుంటే ఓ ఆవిడ వచ్చి దేశం కోసం అన్నయ్య వెళ్తే మీ కోసం ఊరు మొత్తం ఉందని మొత్తం మేం చూసుకుంటాం అని భరోసా ఇస్తుంది. 

Continues below advertisement

జీ తెలుగులో ప్రసారం అయ్యే కొన్ని సీరియల్‌ల నటులు వచ్చి పెళ్లి ఇంట్లో సందడి చేస్తారు. తలో పని చేసి పెళ్లి ఇంట సందడి చేస్తారు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం.. పెళ్లి కూతుర్ని బుట్టలో పెళ్లి మండపానికి తీసుకెళ్లడం మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను దోచుకుంది. కూతురి పెళ్లి వేడుకుకు తండ్రి దూరంగా ఉన్నాడనే లోటు తెలియకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అంతా ఒక్కటై ఆ వివాహ వేడుకను వైభవంగా జరిపించారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సైనికుడికి ‘ఇంత పెద్ద కుటుంబం కారణంగానే పెళ్లి ఘనంగా జరిగింది’ అని భార్య గర్వంగా చెబుతుంది. పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద నుంచి తండ్రి దగ్గరకు పరుగులు తీసి తండ్రిని హగ్ చేసుకొని డ్యాన్స్ చేసి సంతోషంగా తాళి కట్టించుకోవడం అందరూ కలిసి సంతోషంగా వేడుక చేయడంతో చూస్తే ‘మమతతోనే మాట మధురం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. 

ఈ బ్రాండ్ ఫిల్మ్‌ ప్రచారం సందర్భంగా జీ తెలుగు ఛీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనూరాధ గూడూరు మాట్లాడారు. "ప్రేమతో జీ.. తెలుగు" క్యాంపైన్ తెలుగు సంసృతి సంప్రదాయాలే ప్రధానంగా ముందుకు సాగుతుందని చెప్పారు. మన వివాహా పద్ధతుల్లోని గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ బ్రాండ్ ఫ్మిల్మ్ రూపొందించామని చెప్తారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు జీ తెలుగుతో అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. 

ఈ వేడుకలో జీ తెలుగు సీరియల్స్ నటీనటులైన జగద్ధాత్రి- కేదార్, అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్, ఆద్య- శ్రీను, రామలక్ష్మి-శౌర్య, భూమితోపాటు మరికొందరు సందడి చేశారు. ఈ బ్రాండ్ ఫిల్మ్ దేశంలోనే మొదటిసారిగా ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో రూపొందించిన బహుభాషా సిరీస్‌. 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జీ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి ఈ బ్రాండ్ ప్రసారమైంది. ప్రముఖ గాయకులు రేవంత్, జయశ్రీ ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు ఒరిజినల్ ట్రాక్‌ని ఆలపించారు. ఈ పాట తెలుగువారి అనుబంధాలు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను ప్రతిబింబిస్తుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!