Ali Reza Emotional About Ban On Him: అలీరెజా.. బుల్లితెర కండలవీరుడు. అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న నటుడు. అటు సీరియల్లు, ఇటు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. మంచి మంచి క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌లో అయితే, మంచి ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు అలీ. అయితే, అలీ రెజాని ఒక ఛానెల్‌ బ్యాన్‌ చేసింది. దాదాపు రెండేళ్ల పాటు ఆయనతో ఎలాంటి షోలు, సీరియల్స్‌ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై క్లారిటీ ఇచ్చారు అలీ. అసలు ఏం జరిగిందో ఒక ఇంటరవ్యూలో చెప్పారు ఆయన. ఆ టైంలో చాలా బాధపడ్డానని, కానీ.. జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అనుకున్నానని చెప్పారు ఆయన. 


ఎంత చెప్పినా వినలేదు.. చాలా బాధపడ్డాను.. 


తను ఎంత చెప్పినా వినకుండా తనపై బ్యాన్‌ విధించారని చెప్పాడు అలీ. బ్యాన్‌కి గల కారణాలను వివరించారు ఆయన."నేను బిగ్‌బాస్‌కి వెళ్లినందుకు బ్యాన్‌ చేశారు. ముందు వెళ్లేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. బయటికి వచ్చాక తిరిగి సీరియల్‌లో జాయిన్‌ అవ్వాలి అనుకున్నాను. సీరియల్‌ క్లోజ్ చేయాలి అనుకుంటున్నారని వేరేవాళ్లు చెప్పారు. ఇక బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీద ఉన్నప్పుడే నాగార్జున గారు 'వైల్డ్‌డాగ్‌ 'గురించి చెప్పారు. రేపు వెళ్లి సాల్మన్‌ డైరెక్టర్‌ని కలవాలి అన్నారు. వెళ్లి కలిశాను. వెంటనే ఓకే అయిపోయింది. ఫైటింగ్‌ సీన్స్‌ కోసం స్పెషల్‌గా థాయిలాండ్‌ నుంచి ఫైట్‌ మాస్టర్స్‌ వచ్చారు. చాలా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో ఉంది సినిమా. కానీ, కరోనా వల్ల చాలా మార్చారు. ఇక రోజూ పొద్దున్నే ప్రాక్టిస్‌ ఉండేది. రెండు రోజులు రాకపోతే.. సినిమాలో నుంచి వెళ్లిపోవాలి అని ముందే చెప్పారు. అప్పుడే సీరియల్‌ వాళ్లు కూడా పిలిచి సీరియల్‌ క్లోజ్‌ చేసేస్తున్నాం.. నువ్వు రావాలి అన్నారు. నేను వస్తాను అని చెప్పాను. కానీ, టైమింగ్స్‌ని బట్టి వస్తానని చెప్పాను. దీనిపై చర్చలు జరుగుతుండగానే.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కి పిలిచారు. అక్కడ వాళ్లకు అన్నీ వివరించాను. ఆ తర్వాత ఒకరోజు 'వైల్డ్‌డాగ్‌' షూట్‌లో ఉన్నాను. నేను నాగార్జున గారు షూట్‌ చేస్తున్నాం. అప్పుడు ఫోన్‌ వచ్చింది కౌన్సిల్‌లో మీటింగ్‌ ఉంది రావాలి అని అన్నారు. నేను రాలేను.. సాయంత్రం ఒక గంట పర్మిషన్‌ తీసుకుని డైరెక్ట్‌గా మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. "మేం పిలిచినా వాడు రావట్లేదు, బలుపు" అనుకున్నారు. రెండు రోజులు తర్వాత అకస్మాత్తుగా ఒక స్క్రీన్‌షాట్‌ వచ్చింది. దాంట్లో నన్ను బ్యాన్‌ చేసినట్లు ఉంది. రెండేళ్లు ఎవ్వరూ షూటింగ్‌కి పిలవొద్దు అని ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారు? అని అనుకున్నాను. కానీ, ప్రతీది మన మంచికే జరుగుతుంది అనుకోవాలి" అని అన్నారు అలీరెజ. 


సీరియల్స్‌తో తన కెరీర్‌ మొదలుపెట్టారు అలీరెజ. ఆ తర్వాత బిగ్‌బాస్‌కి వెళ్లారు. బిగ్‌బాస్‌ తర్వాత సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి అతనికి. వెబ్‌సిరీస్‌, సినిమాలతో బిజీ అయిపోయారు అలీ. అప్పట్లో ఒక సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. అయితే, అలీ రెజాతో పాటు ‘పసుపు కుంకుమ’ సీరియల్‌లో నటించిన పల్లవి గౌడపైన కూడా గతంలో బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. ఆ బ్యాన్‌ అయిపోవడంతో ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. 


Also Read: 'చారి 111' ఓటీటీ మూవీనా? అసలు విషయం చెప్పిన వెన్నెల కిశోర్