Jagadhatri Serial July 28 to Aug 1st Weekly Recap జగద్ధాత్రి సీరియల్ ఈ వారం మొత్తం మంచి ఎమోషన్స్, కొత్త కొత్త కేసులు, ట్విస్ట్‌లు, పరిష్కారాలతో ఆసక్తికరంగా సాగింది. ఈ వారం మొత్తం జరిగిన హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

జేడీ, కేడీలు రాజు హత్య కేసుని ఛేదిస్తేనే బాబు కౌషికి కొడుకని నిరూపించడంతో పాటు రాజు హత్య కేసులో కౌషికి భర్తకి ఏం సంబంధం లేదని నిరూపించే వీలుంటుందని అనుకుంటారు. రాజు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ రాజు ఇంటికి వెళ్తారు. అక్కడ జేడీ, కేడీలకు ఓ డైరీ దొరుకుతుంది.  అందులో రాజు ఫేక్ డీఎన్‌ఏ ఇప్పించింది యువరాజే అని డైరీలో ఉన్న పేరు చూసి జేడీ, కేడీలు తెలుసుంటారు. ఆ డైరీలోనే గిరిధర్ రాజు అనే ఇన్‌స్పెక్టర్ కూడా ఫేక్ డీఎన్‌ఏ రిపోర్ట్ చేయించారని అతన్ని ఎంక్వైరీ చేసి ఇన్‌స్పెక్టర్ ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆవిడ కొడుకు కోసం ఫేక్ డీఎన్ఏ చేయించి ఆ మహిళను చంపేసి డబ్బు కోసం బెదిరించిన రాజుని కూడా ఇన్‌స్పెక్టర్ చంపేశాడని నిరూపిస్తారు. 

ఇక జగద్ధాత్రి, కేథార్ ఆ డైరీ తీసుకెళ్లి ఇంటి దగ్గర అందరితో బాబు కౌషికి కొడుకే యువరాజ్ ఫేక్ డీఎన్‌ఏ రిపోర్ట్ చేయించాడని చెప్తారు. బాబు విషయంలో అప్పటి వరకు అనాథాశ్రమంలో పడేస్తానని ఎగిరిన ఆదిలక్ష్మీ తలెత్తుకోలేక ఊరెళ్లిపోతుంది. ఇక యువరాజ్ తనకు ఏం సంబంధం లేదని బుకాయిస్తాడు. ఇంత దారుణానికి ఒడికట్టవని వదిలేస్తున్నా కానీ ఇంకొక్క తప్పు చేసినా నీకు నాకు మధ్య బంధం తెగిపోతుందని కౌషికి యువరాజ్‌ని బెదిరిస్తుంది. ఇక కౌషికి ఇంట్లో అందరికీ సుధాకర్, వైజయంతిలు పెళ్లి రోజు సందర్భంగా అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్తుంది. జగద్ధాత్రి, కేథార్ కూడా వస్తారని అంటుంది. 

వజ్రపాటి కుటుంబం ఆ గుడికి పాతికేళ్లగా వెళ్తూ ఉంటారు. ఈ సారి కేథార్, జగద్ధాత్రిని కూడా కౌషికి తీసుకెళ్తానని చెప్తుంది. యువరాజ్ వాళ్లని వద్దని చెప్తాడు. నాన్నకి నేను ఒక్కడినే కొడుకుని అడ్రస్ లేని వాళ్లు వజ్రపాటి గుడికి రావడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. తమ్ముడు, మరదలు ఎంత గోల చేసినా కౌషికి మాత్రం వాళ్లు వస్తారు నా మాటే ఫైనల్ అని తేల్చేస్తుంది. 

యువరాజు దగ్గరకు కౌషికి వెళ్లి ఫ్రెండ్స్ పార్టీలు అని తిరిగితే చిన్న పిల్లాడివనుకున్నా.. పెళ్లి తర్వాత కంపెనీ కోసం తప్పులు చేస్తుంటే మారుతావు అనుకున్నా. మీనన్‌తో చేతులు కలిపి ఇల్లీగల్ పనులు చేస్తే దారితప్పావు దారిలో పెడితే సరిపోతుంది అనుకున్నా. ఆస్తి కోసం నన్ను మెంటల్ హాస్పిటల్‌కి పంపాలని చూస్తే తమ్ముడే కదా అని ఊరుకున్నా.. ఎన్ని తప్పులు చేసినా ఇన్ని అవకాశాలు ఇచ్చింది ఒక అక్కగా ఆలోచించి యువరాజ్. కానీ ఒక అమ్మగా నా కొడుకు విషయంలో ఊరుకోను. ఆ డైరీలో నీ పేరు చూసినా సరే నువ్వు అలా చేయవు అన్న నమ్మకంతో వదిలేశా.. యువరాజ్ నువ్వు మాత్రం తప్పు చేసుంటే ఇప్పటి వరకు నాలో అక్కని చూశావ్ వజ్రపాటి కౌషికి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో చూస్తావ్. నీ ఆలోచనలో తప్పు ఉందా ఆచరణలో తప్పు ఉందో నాకు తెలీదు.. కానీ నువ్వు మారాలి యువరాజ్ మారి తీరాలి.. నీకు నాకు మధ్య ఒక తప్పు దూరం ఉంది.. అది దాటితే నీకు నాకు సంబంధం ఉండదు.. నా మొండితనం గురించి తెలుసుకదా క్షమాపణ కూడా ఉండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో యువరాజ్ మారుతా అక్క మారుతా అక్క అని అంటాడు.

మరో ఎపిసోడ్‌లో వైజయంతి, నిషిక, యువరాజ్‌లు జగద్ధాత్రి, కేథార్ గుడికి రాకుండా ఆపాలని అనుకుంటారు. ఏం చేయాలా అని తెగ ఆలోచించి నిషిక వాళ్లు తినే ఫుడ్‌లో మత్తు మందు కలిపేస్తా అని అంటుంది. కేథార్ జగద్ధాత్రి కోసం పాయసం చేయడం చూసి అందులో జగద్ధాత్రికి తెలీకుండా మత్తు మందు కలిపేస్తుంది. జగద్ధాత్రి స్వీట్స్ గదిలోకి తీసుకెళ్లి తాను కేథార్ ఒకరికి ఒకరు తినిపించుకొని మొత్తం తినేస్తారు. తర్వాత ఇద్దరూ మత్తుతో పడుకుండిపోతారు. అత్తాకోడళ్లు అది చూసి సంబర పడిపోతారు. ఉదయం అందరూ గుడికి బయల్దేరుతారు.  జగద్ధాత్రి వాళ్ల కోసం కౌషికి అడిగితే వాళ్లు ఉదయమే హడావుడిగా బయటకు వెళ్లిపోయారని నిషిక చెప్తుంది. నేనూ చూశానని యువరాజ్ అనేస్తాడు. ఇక సుధాకర్ కౌషికితో గుడికి వస్తారులే వెళ్లిపోదాం అని అంటాడు.  గుడికి వెళ్లిన నిషిక బ్యాచ్‌కి పెద్ద షాక్ తగిలింది. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ జగద్ధాత్రి, కేథార్‌ ఎంట్రీ ఇవ్వడంతో బిత్తరపోయారు. మత్తు మందు ఇచ్చాం కదా ఇలా ఎలా వచ్చేశారని నిషిక, వైజయంతి అనుకుంటారు. మీరు ఎప్పుడు వచ్చారు అని సుధాకర్ కేథార్‌ని అడిగితే మీది పిన్నిది పెళ్లి రోజుని మీరు సంతోషంగా ఉండాలని పొర్లు దండాలు పెట్టాలని వచ్చామని చెప్తారు. వైజయంతి కేథార్ మీద కేకలేస్తుంది. దానికి కేథార్ కోపం ఎందుకు పిన్ని మీరు నాన్న సంతోషంగా ఉండాలి అనే కదా మొక్కుకున్నా అంటాడు.  దానికి యువరాజ్ కోపంగా వచ్చి కేథార్ కాలర్ పట్టుకొని ఎవర్రా నీకు నాన్న. మా నాన్నని నాన్న అంటే నిన్ను చంపేస్తా అని చెప్పాను కదా అంటాడు.  కౌషికి తమ్ముడి ఆపి అందర్నీ తీసుకెళ్తుంది. 

నిషిక వెళ్తుంటే జగద్ధాత్రి ఆపి మత్తుతో పడుకుండాల్సిన మేం నీ కంటే ముందు ఎలా గుడికి వచ్చామా అని ఆలోచిస్తున్నావా అని నిషిక మత్తు మందు కలపడం చూడటం.. ఆ స్వీట్ మార్చేసి మత్తు వచ్చినట్లు నటించడం మొత్తం చెప్తుంది. నిషికకు ఇది పెద్ద షాకే. ఇక కేథార్, జగద్ధాత్రి ముందే అన్ని పూజలు చేయించేశారని పంతులు చెప్పడంతో యువరాజు రగిలిపోతాడు. కేథార్ చేతిలో దేవుడి బుట్ట పడేస్తాడు. మా నాన్నని నాన్న అంటే చంపేస్తా.. మా నాన్న కోసం నువ్వు పూజలు చేయడం ఏంటి అని ఓ రేంజ్‌లో కోప్పడతాడు. కేథార్ మెల్లగా నీ బాగోతం చెప్పేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో యువరాజ్ చక్కగా కింద పడిన బుట్ట తీసి పంతులు చేతిలో పెడతాడు. వైజయంతి, నిషికలు షాక్ అయిపోతారు.  

నిషిక, వైజయంతిల కళ్లలో కారం కొట్టి బంగారం మొత్తం ఓ మహిళ కొట్టేస్తుంది. వెంటనే జగద్ధాత్రి, కేథార్‌లు జేడీ,కేడీల్లా ఆ మహిళను పట్టి బంగారం దక్కించుకుంటారు. తర్వాత ఆఫీస్‌కి వెళ్లి కౌషికి బాబాయ్, పిన్నిలతో కేక్ కట్ చేయిస్తుంది. ఇక కేథార్ తండ్రి కోసం గోల్డ్ చైన్ తీసుకొస్తాడు. కేథార్ గోల్డ్ చైన్ తీసుకొచ్చి నా కష్టార్జీతం నాన్న.. నా సంపాదనతో కొన్నాను.. మీ దగ్గర ఉన్నవాటి కంటే చాలా తక్కువది కానీ ప్రేమతో తీసుకొచ్చానని అంటాడు. సుధాకర్ ప్రేమని విలువ కట్టకూడదని చెప్పి తన మెడలో వేయమని కేథార్‌కి చెప్తాడు. కేథార్ చాలా సంబర పడిపోతాడు. ఇక జగద్ధాత్రి వైజయంతి కోసం పెద్ద నెక్లెస్ తీసుకొస్తుంది. నిషిక తీసుకోవద్దని చెప్తుంది. కానీ వైజయంతి నక్లెస్ నచ్చి తీసుకుంటుంది. కేథార్, జగద్ధాత్రిలు చాలా సంతోషపడతారు. 

నిషిక కోపంతో వెళ్లిపోతుంటే యువరాజ్ ఆపి వాళ్లని నాన్న, అక్కలకు శాశ్వతంగా దూరం చేస్తున్నా ఒక సారి బయట ఉన్న ఫ్లెక్సీ చూసి రా అంటాడు. నిషిక  వెళ్లి చూసి షాక్ అయిపోతుంది. సుధాకర్, వైజయంతిల పెద్ద ఫొటోలతో పెళ్లి రోజు శుభాకాంక్షలు జగద్ధాత్రి, కేథార్ చెప్పినట్లు వజ్రపాటి పెద్ద కొడుకు కేథార్, వజ్రపాటి పెద్ద కోడలు జగద్ధాత్రి అని రాసుంటుంది. నిషిక వెంటనే అందర్ని పిలుస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. జగద్ధాత్రి కేథార్ ఏంటి ఇది అనుకుంటారు. ఇక కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లను ఇలా చేస్తారని అనుకోలేదని అంటుంది. వైజయంతి కేథార్‌ని కొడుతుంది. నిషిక తిడుతుంది. జగద్ధాత్రి తప్పు చేయలేదని ప్రమాణం  చేసినా కౌషికి నమ్మదు. 

కేథార్ ఇది నా ఫ్యామిలీ నా కుటుంబం పరువు తీయాలని మేం చూడమని అంటే ఇది నీ కుటుంబం కాదు.. సరిగ్గా విను ఇది నీ కుటుంబం ఎప్పటికీ అవ్వదు కూడా.. ఆదుకొని ఆదరించినందుకు నలుగురిలో మా పరువు తీస్తారా అని సుధాకర్ కోప్పడతాడు.  ఇక కౌషికి  అయితే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు జగద్ధాత్రి మా మంచితనాన్ని చేతకానితనం అనుకున్నారా.. మీ మీద చూపించిన అభిమానానికి మీరు ఇచ్చిన బహుమతి ఇదా.. ఇన్నాళ్లు చేసిన మంచి ఈ ఒక్క తప్పుతో చెరిపేశారని అంటుంది.  ఏం చేసి మేం తప్పు చేయలేదని నిరూపించుకోవాలని కేథార్ అడిగితే మీడియా ముందు ఈ కుటుంబానికి నీకు సంబంధం లేదని చెప్పు అంటాడు. మీడియా ముందు చెప్తానని కేథార్ అంటాడు. జగద్దాత్రి వద్దని అలా చెప్తే ఇక ఎప్పటికీ నువ్వు మామయ్య కొడుకు అని నిరూపించుకోలేవు అంటుంది. అయినా కేథార్ వినడు. 

జగద్ధాత్రి కౌషికితో గంట టైం ఇవ్వండి అని బతిమాలుతుంది. దాంతో కౌషికి ఒక్క గంట టైం అని అంటుంది. జగద్ధాత్రి ఆ ఫ్లెక్సీ మీద ఉన్న అడ్రస్‌కి వెళ్లి వాడిని నాలుగు పీకి ఇందంతా యువరాజ్ పని ని తెలుసుకొని సీసీ టీవీ ఫుటేజ్ తీసుకొని బయల్దేరుతుంది. మరోవైపు కేథార్ మీడియా ముందుకి వెళ్తాడు.  చేసిన తప్పుని సరిదిద్దుకో అని కౌషికి కేథార్‌కి చెప్తే చేయని తప్పుని ఎలా సరిదిద్దు కోవాలో తెలీడం లేదని కేథార్ అంటాడు. కేథార్ మీడియా ముందుకు వెళ్లి నేను ఒక అనాథని నా భార్య జగద్ధాత్రి. వజ్రపాటి నిషిక వాళ్ల అక్క. అదే బంధంతో కొన్నాళ్లుగా వాళ్ల ఇంట్లో ఉన్నాం. అంతకు మించి ఆ కుటుంబానికి నాకు ఏం లేదు అని కేథార్ చెప్పే టైంకి జగద్ధాత్రి ఎంట్రీ ఇస్తుంది. ఈ లెక్కన జగద్ధాత్రి టైంకి వచ్చి ఫ్లెక్సీ విషయంలో తనది కేథార్‌ది ఏ తప్పు లేదని నిరూపించుకుంటుంది. అయితే దీనంతటికి యువరాజే కారణం అని చెప్తుందో లేదో చూడాలి. ఒక వేళ జగద్ధాత్రి యువరాజ్ తప్పు చేసినట్లు సాక్ష్యాలు చూపిస్తే కౌషికి తమ్ముడి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.