Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరును ఎలాగైనా ఆ ఇంట్లోంచి తరిమి కొట్టాలని అందుకోసం తాను చేయని ప్రయత్నం అంటూ లేదని వాపోతుంది మనోహరి. అయితే ఘోరాను మించిన శక్తిని తీసుకొస్తానని రణవీర్ చెప్తాడు. మనోహరి ఉత్సుకతతో ఎవరు ఆ శక్తి అని అడుగుతుంది. రణవీర్ చంభా అని చెప్తాడు.
మను: చంబానా ఎవరు..? ఎక్కడ ఉంటుంది…?
రణవీర్: అదుపు తప్పిన ఆత్మలను అదుపులో పెట్టి ఆనంత శూన్యాలకు విసిరేసే అతీతమైన తాంత్రిక శక్తి గల వ్యక్తి. ఒక ఆడదాన్ని కొట్టాలంటే ఇంకో ఆడదానికే సాధ్యం
మను: ఇంతకీ ఆ చంభా ఎక్కడ ఉంటుంది..?
రణవీర్: కోల్‌కతాలో అక్కడ అందరూ చంబాను కోల్‌కతా కాళీ అంటారు. ఇప్పటి వరకు చంభా ఎప్పుడు ఇలాంటి కేసులు ఫెయిల్ అవ్వలేదు. లాయరు వెంటనే చంభాని కాంటాక్ట్ చేయ్.. హైదరాబాద్ కు టికెట్ వేయ్.. ఈ సాయంత్రానికల్లా చంభా ఇక్కడ ఉండాలి
లాయరు: ఒకే రణవీర్ ఇప్పుడే చేస్తాను..
అని వెళ్లిపోతాడు. రణవీర్ ఇంట్లో జరిగిన విషయం గుప్తకు అర్థం అవుతుంది. గార్డెన్‌లో కూర్చుని ఉంటాడు గుస్త. ఆరు అటూ ఇటూ తిరుగుతుంది.
గుప్త: బాలిక నీకు సమస్య ఉన్నచో నేను అటూ ఇటూ తిరుగవలెను నువ్వు కూర్చోవలెను కానీ నువ్వేంటి అటూ ఇటూ తిరుగుతున్నావు. నీ సమస్య ఏంటో చెప్పుము మేము పరిష్కరించెదము
ఆరు: అది కాదు గుప్త గారు అసలు ఆ మనోహరి ఏంటి నోరు తెలిస్తే అబద్దాలు మనోహరి ఫైట్ చేసిందట.. నా పిల్లలను కాపాడిందట.. అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా అంతే ప్రతి దానికి అబద్దాలు అడుతూనే ఉండేది. చివరికి దాని బతుకే అబద్దం బతుకు అయిపోయింది. అరే అంజు తన కూతురే తనను కాపాడుతుందన్న విషయం తనకు తెలియడం లేదు
గుప్త: అనినా.. నీ పిల్ల పిచ్చుకే తన సుపుత్రిక అని తనకు తెలియలేదని నువ్వు నిరాశ చెందుతుంటివా..?
ఆరు: ఏహేయ్ అలా అనుకోవడం లేదు గుప్త గారు. మనోహరి చెప్పిన దానికి కోపం వస్తుంది నాకు
గుప్త: ఆ అయినచో ఇప్పుడు నీ స్నేహితురాలి పతిదేవుడిని నువ్వు చెయ్యి చేసుకున్న విషయం నీ స్నేహితురాలు నీ పతిదేవునకు చెప్పలేదని నువ్వు చింతించుచుంటివా..? ఒక విధంగా చెప్పవలెను అన్నా నీ స్నేహితురాలు ఆ నలుగురు దుండగులను మట్టి కరిపించింది. ఆ సమయమున తమరు ఇచ్చట ఉండి గానములు ఆలపించుచూ.. కుప్పి గంతులు వేయుచూ.. నీ పతి దేవుడు అప్పగించిన బాధ్యతను ఆ మనోహరి నిలబెట్టునని నమ్మకముగా ఉంటివి.. అటు పిమ్మట నీ పతి దేవుడిని పొందుటకు తన పతి దేవుడినే ఎదురించినది చివరకు అతగాడు ఆయుధం చూపించినచో కాస్త జంకినది కానీ లేచినో అతగాడిని కూడా మట్టి కరిపించినను ఆశ్చర్యము లేకుండును ఇచ్చట నువ్వు నీ గురించి నీ స్నేహితురాలు చెప్పలేదని ఊగిపోవుతుంటివి
ఆరు: ఏహెయ్ మనోహరి నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గుప్త గారు
గుప్త: మరి ఎందులకు నీకు ఆవేదన మాకు ఈ వేదన
ఆరు: ఆవేదన లేదు.. నివేదన లేదు కానీ అసలు మను నిజం ఎందుకు చెప్పలేదు. అయినా మను అబద్దం చెప్తే నాకేంటి..? నా పిల్లలు బాగుంటే చాలు
గుప్త: మా సోదరి సమానురాలివైన నువ్వు బాగున్నచో అదియే మాకు చాలు
ఆరు: నాకేమైంది బాగానే ఉన్నాను కదా గుప్త గారు.. పైగా ఏ కష్టం వచ్చినా కాపాడుకోవడానికి శక్తులు కూడా ఉన్నాయి కదా..?
గుప్త: ఆ శక్తులను మించిన శక్తి వచ్చి నిన్ను శక్తి హీనురాలిని చేయునేమోనని మా మనసు కీడును శంకించుచున్నది
ఆరు: అర్థం కాలేదు గుప్త గారు ఇప్పుడు నా శత్రువు ఆ మనోహరే కదా..? ఇంకెవరు ఉన్నారు..?
గుప్త: ఇప్పటి వరకు నీ శత్రువు నీ స్నేహితురాలే బాలిక. ఇప్పుడు తన పతిదేవుడు కూడా తోడయ్యాడు. నిన్ను నీ కున్న శక్తలను కళ్లారా చూశాడు. ఇప్పుడు నీకున్న శక్తులను ఎటుల నిర్వీర్యం చేయవలెనో అని తాంత్రికులతో మాంత్రికులతో సంప్రదించాడు. నీకున్న గడువు కాలము సమీపించుచున్నది..నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా అగుపించుచున్నది
ఆరు: ఆ రణవీర్ నన్నేం చేయడు. మీరు ఉండగా నాకేం కాదు
అంటుండగానే చంభా గేటు ఓపెన్ చేసుకుని వస్తుంది. గార్డెన్‌లో నిలబడిన ఆరు చూసి దగ్గరకు వెళ్తుంది.
చంభా: నువ్వేనా అది
ఆరు: నువ్వెవరు
చంభా: నా పేరు చంభా నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను
ఆరు: అది నీ వల్ల కాదు
చంభా: నా శక్తి ఏంటో నీకు తెలియదు.. నా శక్తి చూస్తావా..?
అని చంభా తన శక్తులను ఆరు మీదకు వదులుతుంది. ఆరు చూస్తూ నిలబడుతుంది. అంతా దూరం నుంచి గమనిస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!