jagadhatri Serial August 11th to 15th Weekly Episodes జగద్ధాత్రి సీరియల్ ఈ వారం మొత్తం చాలా ఆసక్తికరంగా మారింది. మేనేజర్ హత్య కేసు సాల్వ్ చేయడం.. ఆస్తి పంపకాల్లో కేథార్‌కి ఘోరంగా అవమానం జరగడం, కౌషికి మీద ఓ రౌడీ హత్యాయత్నం చేయడం వంటి ఇంట్రస్టింగ్ సీన్స్‌తో సీరియల్ ఆసక్తికరంగా జరిగింది. ఇంతకీ వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం...  

జేడీ, కేడీలు మ్యానేజర్‌ హత్య కేసుని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడతారు. హత్య కేసు వెనక ఒకరు కాదు ఏకంగా ఆఫీస్‌లో ఉన్న ఆడవాళ్లు అంతా ఉన్నారని డీఎన్‌ఏ రిపోర్ట్స్.. కొన్ని క్లూస్ ద్వారా కనిపెడతారు. అమ్మాయిలను బెదిరించి వాళ్ల దగ్గర నుంచి నిజం తెలుసుకుంటారు. మేనేజర్ మిస్ బిహేవ్ చేశాడని అమ్మాయిలతో అసహ్యంగా ప్రవర్తించాడని చంపేశామని అందరు అమ్మాయిలు చెప్తారు.  జేడీతో అమ్మాయిలు అందరూ వాడు నీచుడు అని మంచోడు కాదని ఈ విషయం బయటకు వస్తే కౌషికి గారి పరువు పోతుందని అందరం కలిసి చంపేశామని చెప్తారు. ఆ కిరాతకుడుని చంపడం వల్ల మేం తప్పు చేసినట్లు కాదు కాబట్టి మీరు ఏమైనా శిక్ష వేయాలి అనుకుంటే మా అందర్ని శిక్ష వేయండి అని అంటారు. జేడీ అయితే ఏ ఆడపిల్లని అయినా ఇబ్బంది పెట్టిన ఇలాంటి వాడికి ఇలాంటి శిక్ష పడాలి.. చట్టాన్ని మీరు  చేతిలోకి తీసుకోవద్దని చెప్తుంది. ఇక కేసు ఎలా సాల్వ్ చేస్తామని కేడీ అడిగితే ఒక్కరు చేస్తే హత్య ఇంత మంది చేస్తే మిస్టర్ ఈ కేసుని అలాగే వదిలేద్దాం అని అంటుంది. అందరూ జేడీకి సెల్యూట్ కొడతారు. కేడీ అక్క గురించి ఏం చేద్దాం అని అంటాడు. ఆలోచిద్దామని జేడీ అంటుంది. 

కౌషికిని పోలీసులు తీసుకెళ్లడానికి వస్తారు. నిషిక అత్తతో నేను మకుటం లేని మహారాణిని ఇక మనకే ఆస్తి అంతా అని సంబరం చేసుకుంటారు. కౌషికి పిల్లల్ని ముద్దాడి బాబుని కాచికి అప్పగించి నా బాబు జాగ్రత్త అని చెప్తుంది. మాటలు రాని తన కూతుర్ని పట్టుకొని కౌషికి ఏడుస్తుంది. కీర్తి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. పోలీసులతో కౌషికి వెళ్తుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్లు వస్తారు. పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చి మేనేజర్‌ని పది మందికి పైగా చంపారని.. మేనేజర్‌ చనిపోయే టైంకి మా వదిన ఇంట్లోనే ఉంది. హత్య చేయడానికి వాడిన వెపన్స్‌ కూడా దొరకలేదని సాక్ష్యాలు చూపిస్తారు. కౌషికి అరెస్ట్ కాకుండా చేస్తారు. కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లకు దండం పెట్టి ఏమిచ్చి మీ రుణం తీసుకోవాలి.. ప్రతీ కష్టంలో నాకు అండగా ఉంటున్నారు అని దండం పెడుతుంది. కేథార్ కౌషికితో నువ్వు నా అక్కవి అక్క నిన్ను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది అని అంటాడు.  

కౌషికి జైలుపాలవ్వలేని నిషిక రగిలిపోతుంది. మన చేతికి వజ్రపాటి సామ్రాజ్యం వస్తుంది అనే టైంకి మొత్తం చెడగొట్టేశారు అని అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు ప్రతీసారి సాక్ష్యాలు ఎలా తీసుకొస్తున్నారు అని అంటుంది. నాకూ అదే అర్థం కావడం లేదని యువరాజ్ అంటాడు. నాకు అయితే ఒంటి మీద కాకీలు లేని పోలీసులు లా కనిపిస్తున్నారని వైజయంతి అంటుంది. యువరాజ్ మనసులో వాడు నిజంగా పోలీసే అనుకుంటాడు. కేథార్ రాత్రి రిలాక్స్ అయి ఫోన్ చూస్తూ ఇన్‌స్టాలో మేఘన పెట్టిన ఫొటోని లైక్ కొడతాడు. కేథార్ మేఘన ఫొటోకి లైక్ కొట్టడం చూసి కేథార్ అని కోపంతో వేడి పాలు తీసుకెళ్లి కేథార్ కాళ్ల మీద పెట్టేస్తుంది. నువ్వు మేఘన ఫొటోకి లైక్ కొడితే నేను నీకు కొడతా అని తెలీదా అని కేథార్‌తో గిల్లిగజ్జాలు ఆడి అలిగి పడుకుంటుంది.  అయ్యో దేవుడా.. ప్రపంచంలో భార్యలు అంతా ఒకే ఫార్మాట్లో ఉంటారన్నమాట అని కేథార్ తల బాదు కుంటాడు.   కౌషికి లాయర్‌తో మాట్లాడుతుంది. కౌషికి తండ్రి మధుకర్ ఆస్తి పంపకం కోసం అప్పట్లో వీలునామా రాశారని ఆ అడ్రిమెంట్ మూడు నెలల్లో పూర్తయిపోతుందని లాయర్ చెప్తారు. నిషిక అది వింటుంది. మధుకర్ గారి వీలునామా ప్రకారం సగం ఆస్తి మీకు మిగతా సగం సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందుతుందని అగ్రిమెంట్ టైం అయిపోతే సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందాల్సిన ఆస్తి అనాథాశ్రమానికి చెందుతుందని అంటాడు. కౌషికి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయమని అంటుంది. ఇక మధుకర్ అగ్రిమెంట్కి సంబంధించి ఒరిజనల్ కాపీ మీ దగ్గరే ఉంది రిజిస్ట్రేషన్‌కి అది అవసరం అని అంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి అరుస్తుంది. ఏమైందని అందరూ అడిగితే కేథార్‌కి ఆస్తిలో సగం వాటా ఇస్తున్నావంట అని అడుగుతుంది. కౌషికి అందరితో వజ్రపాటి మధుకర్, సుధాకర్‌ల ఆస్తి వాళ్ల వారసులైన నాకు, యువరాజ్‌కి, కేథార్‌కే కదా దక్కుతుంది అని అంటుంది. తప్పమ్మి చానా తప్పు మాట్లాడుతున్నావ్. ఈ ఆస్తి మొత్తం వజ్రపాటి మధుకర్ గారి ఏకైక కూతురైన నీకు, వజ్రపాటి సుధాకర్ ఏకైక కొడుకు అని యువరాజ్‌కి మాత్రమే చెందుతుంది. అంతే కానీ ఎవడో దారినపోయిన అడ్డమైన వాడు వచ్చి మేం వజ్రపాటి వారసుడు అంటే ఆస్తి ఇస్తే మేం ఊరుకుంటామా అని ఫైర్ అవుతుంది. 

జగద్ధాత్రి వైజయంతితో కేథార్ కూడా ఈ ఇంటి వారసుడే కేథార్‌లో ప్రవహించేది కూడా ఈ ఇంటి రక్తమే అని అంటుంది. ఆధారం ఏది అని వైజయంతి అడుగుతుంది. ఆధారాలు చూపించి అప్పుడు మాట్లాడండి చూడమ్మా కౌషికి ఆనాడు ఈయన గారికి పెళ్లికి ముందే ఇంకో భార్య ఉంది అంటే అప్పుడు ఊరుకున్నా..ఈయనకు ఆవిడకు సంతానం ఉంది అంటే అప్పుడు ఊరుకున్నా.. ఆ సంతానం ఇంటికి వచ్చి ఈయన గారిని నాన్న నాన్న అంటే అప్పుడు చూస్తూ ఊరుకున్నా.. కానీ నా కొడుకుకి రావాల్సిన ఆస్తిని ఈ మధ్యలో వచ్చిన నడమంత్రపు వాళ్లకి ఇస్తాను అంటే అస్సలు ఊరుకునేది లేదు. ఈ వజ్రపాటి సుధాకర్‌కి ఉన్నది ఏకైక వారసుడు.. ఆస్తులు అయినా అవమానాలు అయినా ఏదైనా నా కొడుకు ఒక్కడికే దక్కాలి అంతే అని అంటుంది. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదు అందుకు సాక్ష్యాలు కావాలి. అవి లేకపోతే లేని పోని కిరీటాలు పెడతాం అంటే ఒప్పుకునేది లేదు అని సాక్ష్యాలు అడుగుతుంది.  

కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లతో నేను మీకు ఏం సాయం చేయలేను. మీరు అంటే నాకు ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి కానీ అందరికీ సాక్ష్యాలు కావాలి.. మీరు ఈ ఇంటికి వచ్చినప్పుడే నెలలో ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటా అన్నారు. అగ్రిమెంట్ కాలం పూర్తి అవ్వడానికి 3 నెలల టైం ఉంది. ఈ గడువులోపు మీరు నిరూపించుకుంటే ఎవరు అవును అన్నా కాదు అన్నా నేను వజ్రపాటి అన్న ఈ ఇంటి పేరుని కేథార్ ముందు పెట్టి సాధరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తా అని అంటుంది.  కేథార్ జగద్ధాత్రితో కనీసం ఆస్తి వస్తే అయినా నన్ను ఈ ఇంటి మనిషిగా గుర్తిస్తారు అనుకున్నా ఆ ఆశ కూడా పోయింది. నా చుట్టూ నా వాళ్లు ఉండి కూడా నేను అప్పటికీ ఇప్పటికీ అనాథగానే బతుకుతున్నా అని కేథార్ జగద్ధాత్రితో చెప్తే సుధాకర్ కన్నీరు పెట్టుకుంటాడు. ఏంటి ద్ధాత్రి ఇదంతా దీని కంటే  ఓ కత్తి తీసుకొచ్చి నన్ను చంపేస్తే బెటర్. ఎందుకు పదే పదే గుచ్చి గుచ్చి చంపేస్తున్నారు.. నేనేమైనా కోరరాని కోరికలు కోరానా.. నా కన్న తండ్రిని నోరారా నాన్న అని పిలవాలి అనుకున్నా.. మనసారా ఆయన్ను గుండెలకు హత్తుకోవాలని.. జీవితాంతం ఆయన చేయి పట్టుకొని నడవాలి అనుకున్నాను.. నా కోరిక ఏమైనా తప్పా.. అయినా నాకు అర్థమైపోయింది.. ఇక ఈ జన్మకి వజ్రపాటి సుధాకర్ కొడుకు యువరాజ్ ఒక్కడే.. ఈ కేథార్ ఎవరో అని కేథార్ చాలా బాధ పడతాడు. జగద్ధాత్రి కేథార్‌ని ఓదార్చుతుంది. మామయ్య పైకి నిన్ను కొడుకులా అంగీకరించకపోయిన మనసులో మాత్రం ఆయన పెద్ద కొడుకు  నువ్వే. మనకు 3 నెలల గడువు ఉంది.. ఈలోపు మనం సాక్ష్యాలు సంపాదించాలి అని అంటుంది. కేథార్ జగద్ధాత్రితో ఎన్నిసార్లు నేను సాక్ష్యాలు తీసుకొస్తే నా తమ్ముడే వాటిని నాశనం చేస్తే నేను వాడి తమ్ముడు అని ఎలా నిరూపించుకోవాలి అని బాధపడతాడు. అందుకు జగద్ధాత్రి మహాల్‌కి వెళ్లి మరోసారి వెతుకుదామని అంటుంది. గతంలో కేసు విషయంలో వెళ్తే మనకు మీ అమ్మ ఫొటో అక్కడ దొరికింది కదా అక్కడకు వెళ్దామని అంటుంది. 

యువరాజ్, నిషిక, వైజయంతిలు వీలునామా కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. అందుకు యువరాజ్ ఓ రౌడీని పిలిచి తన ఇంట్లో కౌషికి గదిలో ఉన్న వీలునామా కొట్టేయాలని చెప్తాడు. సుధాకర్‌కి బాగా నిద్ర పట్టేలా మందులు ఎక్కువ ఇచేస్తారు. జగద్ధాత్రి, కేథార్‌లకు మెడికల్ షాపుకి పంపేస్తారు. యువరాజ్ పార్టీ అని అబద్ధం చెప్పి బయటకు వెళ్లి మందు తాగుతూ ఉంటాడు. జగద్ధాత్రి బయట రౌడీ మీద అనుమానం వచ్చి మాట్లాడుతుంది కానీ రౌడీ ఏవేవో చెప్పి తప్పించుకుంటాడు. వైజయంతి, నిషికలు రౌడీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. రౌడీ వచ్చి కేథార్ చెప్పిన గుర్తుల ప్రకారం కౌషికి గదికి వెళ్తాడు. కౌషికి ఎవర్రా నువ్వు అని భయంతో ఇంట్లో అందరిని పిలుస్తాడు. వైజయంతి వాళ్లు జగద్ధాత్రి, కేథార్లు వచ్చే లోపు ఆ రౌడీ వీలునామా తీసుకెళ్లి పోవాలని అనుకుంటారు. కౌషికి రౌడీతో గొడవ పడుతూ వాడి తల మీద కొడుతుంది.  రౌడీ గన్ తీసి మర్యాదగా నేను చెప్పినట్లు చేయ్ లేదంటే నీతో పాటు నీ పిల్లల్ని చంపేస్తా అంటాడు. నీకేం కావాలో చెప్పు ఇస్తాను అని కౌషికి అడిగితే ఇప్పుడు దారిలోకి వచ్చావని రౌడీ అని కీర్తి దగ్గరకు వెళ్లి నీ అమ్మకి నాకు ఢీల్ కురిదిపోయింది నువ్వు బయటకు వెళ్లిపో అని పాపని గెంటేస్తాడు.  రౌడీ కౌషికితో నీ డబ్బు ఎవరికి కావాలే నాకు కావాల్సింది నువ్వు నేను చెప్పినట్లు చేయ్ లేదంటే నీ బాబుని కూడా బయట విసిరేస్తా అంటాడు. కౌషికి షాక్ అయిపోతుంది. రౌడీ కౌషికి మీద మీద పడుతూ తప్పుగా ప్రవర్తిస్తాడు. కౌషికి పిన్ని పిన్ని అని అరుస్తుంది. కీర్తి పాప సుధాకర్‌ని నిద్ర లేపుతుంది కానీ సుధాకర్ మత్తు వల్ల లేవడు. తర్వాత పాప వైజయంతి, నిషికల దగ్గరకు వెళ్తుంది. కౌషికి గొంతు పట్టి రౌడీ నలిపేస్తుంటాడు.  కీర్తి పాప వైజయంతి, నిషికల దగ్గరకు వచ్చి కొడుతున్నాడని వైజయంతికి సైగ చేసి ఇద్దరినీ తీసుకెళ్తుంది. వైజయంతి కోడలితో మొత్తం మన మెడకు చుట్టుకునేలా ఉంది వెంటనే యువరాజ్‌కి కాల్ చేయ్ అని అంటుంది. నిషిక యువరాజ్‌కి కాల్ చేస్తుంది కానీ యువరాజ్ తాగుతూ ఫోన్ పట్టించుకోడు.  కౌషికి రౌడీ కట్టేసి కౌషికి చున్నీ లాగేసి వాడి కౌషికితో తప్పుగా ప్రవర్తిస్తాడు. ఇంతలో జగద్ధాత్రి, కేథార్ వస్తారు. వైజయంతి, నిషికలు జరిగింది ఇద్దరికీ చెప్తారు. కేథార్ తలుపు పగలగొడతాడు. జగద్ధాత్రి, నిషికలు కౌషికిని చున్నీతో కప్పుతారు. జగద్ధాత్రిని హత్తుకొని కౌషికి ఏడుస్తుంది. కౌషికిని రౌడీ కొట్టాడని కేథార్ గుర్తించి రౌడీని చితక్కొడతాడు. కాళ్లు చేతులు విరగ్గొడతాడు. రౌడీ పారిపోతాడు. కౌషికి రౌడీ చేసిన వీరంగానికి కింద పడి ఏడుస్తుంది. జగద్ధాత్రి వాళ్లు ఓదార్చుతారు. పిల్లల్ని పట్టుకొని కౌషికి చాలా ఏడుస్తుంది.   

కేథార్ అక్కతో ఇక నుంచి ఒక్క క్షణం నిన్ను వవిడిచి ఉండను. వాడిని మాత్రం వదలను అక్క వాడి చావు వాడే వెతుక్కుంటూ వచ్చాడు. వాడి అంతు చూసేవరకు నిద్రపోను. నీ మీద చేయి వేసిన వాడి చేతులు విరిచేస్తా అని కేథార్ రౌడీని తిడతాడు. నిషిక, వైజయంతిలు భయపడతారు. కౌషికి ఏడుస్తూ వాడు నాకు చావు భయం చూపించాడు. నేను అంత ఈజీగా మర్చిపోలేను అని ఏడుస్తుంది.  

వైజయంతి నిషికతో పాపం అమ్మీ కౌషికి చాల భయపడిపోయింది.. ఏ ఆడపిల్లకి అలాంటి కష్టం రాకూడదు అని జాలి చూపిస్తుంది. నిషిక అత్తతో వదిన ఇప్పుడు సేఫ్ కానీ మనం కాదు మన పరిస్థితి ఆలోచించండి అత్తయ్యా.. ఇదంతా చేసింది మనమే అని జగద్ధాత్రి, కేథార్‌లకు తెలిస్తే మనల్ని చంపేస్తారు అని అంటుంది. వైజయంతి కూడా చాలా భయపడుతుంది ఈ టెన్షన్‌తో పోయే కంటే హార్ట్అటాక్ వచ్చి చనిపోతే బెటర్ రేపు ఆయనకు ఈ విషయం తెలిస్తే అది కూడా మనమే చేశామని తెలిస్తే చంపేస్తారని అంటుంది. 

కేథార్ బయట కారులో వెతికితే విజిటింగ్ కార్డు పట్టుకొని అయిపోయావురా అని అనుకుంటాడు. జగద్ధాత్రి బాబుని ఒడిలో పడుకోపెట్టుకొని కౌషికిని మరోవైపు పడుకోపెట్టుకొని వదినకు చావు భయం చూపించిన వాడిని చంపేయాలని గన్ తీస్తుంది. ఉదయం సుధాకర్‌కి విషయం తెలిసి నీ జీవితం పాడు చేయాలి అనుకున్నవాడిని వాడి వెనక ఉన్నవారిని వదలను అని అంటాడు. వైజయంతి చాలా భయపడుతుంది. ఎప్పుడూ నిద్ర పట్టని నాకు రాత్రి విపరీతంగా నిద్ర పట్టేసిందని సుధాకర్ అంటాడు. జగద్ధాత్రి ఆ మాటతో ఆలోచనలో పడుతుంది. మన పని గోవింద అత్తయ్యా అని నిషిక వైజయంతితో చెప్తుంది.  కౌషికి ఏడుస్తూ ఒక్క క్షణం కేథార్ లేటుగా వచ్చుంటే నా జీవితం ఏమైపోయేది.. నా పిల్లలతో నేను కన్న నూరేళ్ల జీవితం ఏమైపోయేది. నా జీవితం అయిపోయింది అని నేను అనుకున్న టైంలో వచ్చాడు బాబాయ్ కేథార్.. నా తమ్ముడు.. నా కోసమే పుట్టాడు బాబాయ్.. నాకు ఏ కష్టం వచ్చినా అది నా కంటే ముందు వాడికే తెలిసిపోతున్నట్లు ఉంది.. వాడిని నాకోసమే ఆ దేవుడు ఇక్కడికి పంపించుంటాడు బాబాయ్.. వాడిని చూడగానే ఒక్క సారి ఊపిరి పీల్చుకున్నాను బాబాయ్ వాడు రావడం లేటు అయింటే మీకు మీ కూతురు దక్కేది కాదు అని ఏడుస్తుంది.  

యువరాజ్ అంతా తనకు అనుకూలంగా జరుగుంటుందని ఇంటికి వస్తాడు.  కొడుకు రాగానే వైజయంతి యువరాజ్ మీద కోప్పడుతుంది. రాత్రి ఎందుకు రాలేదు.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని తిడుతుంది. ఏమైందని యువరాజ్ అడిగితే నిషిక జరిగింది అంతా చెప్తుంది. రౌడీ వచ్చి కౌషికి జీవితం నాశనం చేయాలి అనుకున్నాడని తెలియగానే ఆవేశంగా బయటకు వెళ్తాడు. నా అక్క మీదే చేయి వేస్తాడా ఆ నా కొడుకుని వదలను అని యువరాజ్ ఆవేశంగా వెళ్తాడు. జగద్ధాత్రికి యువరాజ్ ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. ఇవీ ఈ వారం హైలెట్స్.