గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 16 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 16th Episode)

బాలుకి ఈ రోజు చాలా కీలకమైన రోజు..జాగ్రత్తగా ఉండకపోతే పెద్దగండం పొంచిఉందని చెబుతాడు జ్యోతిష్యుడు. అయినప్పటికీ అవేం తాను పట్టించుకోను అంటాడు బాలు. ఇంతలో పొలిటికల్ లీడర్ నుంచి కాల్ వస్తుంది పని ఉంది రమ్మని. ఈ రోజు నీకు అంత బాలేదు అన్నారు కదా ఎందుకు వెళ్లడం అని స్నేహితులు చెబుతున్నా ఏం జరగదని చెప్పేసి వెళతాడు బాలు. 

గతంలో పూలమాలల ఆర్డర్ ఇచ్చిన పొలిటికల్ లీడర్ తను.. నా స్నేహితుడు ఇక్కడకు వచ్చాడు క్వారీ బిజినెస్ చేస్తాడట. కొన్ని రోజులు ఉంటాడు..సెకెండ్ హ్యాండ్ లో కారు ఏదైనా కావాలని అడుగుతాడు. ఆ తర్వాత అంతా మందు సిట్టింగ్ లో కూర్చుంటారు. తాను తాగను అని భార్యకు మాటిచ్చానని చెబుతాడు బాలు. నువ్వు తాగకపోతేనేం..నాకు పెగ్గుపోయి అంటాడు ఆ లీడర్. బాలుకి ఇష్టంలేకుండా బార్ కి వెళతాడు, మెహమాటం కొద్దీ అక్కడ కూర్చుంటాడు..కానీ ఆ లీడర్ బలవంతం చేసేసరికి పెగ్గు పోస్తాడు. అదే సమయానికి అక్కడే ఉంటాడు గుణ. వీడికి ఇక్కడేం పని అని ఆలోచిస్తాడు. వీడి చేతిలో మందుబాటిల్ ఉందికదా వీడియో తీసి వైరల్ చేస్తే చాలు వీడి పరువుపోతుందని ఆలోచిస్తాడు. బాలు మందుబాటిల్ చేత్తో పట్టుకుని  గ్లాసులో పోస్తుండగా వీడియో తీస్తాడు..ఆ తర్వాత బయటకు వచ్చి రోడ్డు దాటుతూ ఎవరి బండికో అడ్డం వెళ్లడం కూడా యాడ్ చేసి ...ఇలా తాగి తూగుతున్నాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తాడు. 

క్యాబ్ డ్రైవర్ కావడంతో బాలు చాలామందికి పరిచయం ఉంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ప్రయాణికులు కూడా చూస్తారు. తాగితూగే వ్యక్తి డ్రైవింగ్ చేసినప్పుడు కారెక్కితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ బాలు కారు దిగిపోతారు. పైగా నానా మాటలు అని అవమానిస్తారు. ఆ వీడియో బాగా వైరల్ అవడంతో మీనా కూడా చూస్తుంది. ఇదే అదనుగా శివ ఆ వీడియోను తీసుకెళ్లి మీనాకు చూపించి పరువుపోయింది, అంతా వీడియో చూశారు..ఇలాంటోడైన బావని నువ్వు ఇంకా వెనకేసుకుని వస్తున్నావంటూ నోరుపారేసుకుంటాడు. ఆ వీడియో చూడగానే మీనా కూడా షాక్ అవుతుంది. తనకు తాగను అని చెప్పిన బాలు ఇలా చేశాడేంటని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

జ్యోతిష్యుడు చెప్పినట్టు బాలుకి పెద్ద గండమే వచ్చిపడింది..ఎప్పుడెప్పుడు బాలు దొరుకుతాడా ఆడేసుకుందామా అని ఎదురుచూస్తున్న రోహిణి, మనోజ్ , ప్రభావతి ఇక నోటికి పనిచెప్తారు. మా విషయాలు మీకు అనవసరం అన్న రోహిణి బాలు గురించి ఏమైనా మాట్లాడుతుందో లేదో చూడాలి. మరోవైపు రోహిణి..దినేష్ కి డబ్బులిస్తుండగా బాలు చూసే అవకాశం ఉంది. ఆ విషయం బయటపడినప్పుడు రోహిణి ఈ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తుందేమో చూడాలి.  మరోవైపు మేక మామ అంటూ రోహిణి చెప్పిన అబద్ధం కూడా బయటపడేలా ఉంది.  మరి ఎప్పటిలా మీనా నిజం తెలుసుకుని ఆపని చేసి గుణకి బుద్ధి చెబుతుందో లేదంటే బాలుని   అపార్థం చేసుకుంటుందో చూడాలి.  

మొత్తానికి చూస్తుంటే గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈ వారం కీలక ములుపు తిరిగేలా ఉంది. ఎందుకంటే.. మనోజ్ కి డబ్బులు రిటర్న్ ఇచ్చిన మాజీ ప్రేయసి కల్పన శాపం పెడుతుంది. ఈ డబ్బులు మీ ఇంట్లో గందరగోళం సృష్టిస్తాయి, మీకు మనశ్సాంతి లేకుండా చేస్తాయని అంటుంది. కల్పన అన్నట్టుగానే రోహిణి మనోజ్ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బాలు, శ్రుతి వదిలేలా లేరు. ఆ మోసం సంగతి బయటపడితే అప్పుడుంటుంది.  మరోవైపు తనకు తెలియకుండానే బాలు కల్పనకు ష్యూరిటీ సంతకం చేసేశాడు. ల్యాండ్ డీల్ అని చెప్పి అబద్ధం చెప్పి సంతకం పెట్టించుకుంది కల్పన. ఈ సంతకం విషయం బయటపడితే అప్పుడు కల్పన డబ్బులు రిటర్న్ చేసిన సంగతి కూడా బయటపడే అవకాశం ఉంది.