Illu Illalu Pillalu Serial July 21 to 26h Weekly Episode చిన్న చిన్న సంతోషాలు.. అంతలోనే గొడవలు.. అలకలు.. బుజ్జగింపులు.. ఇలా వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రేమ ఇంట్లో ఎవరికీ తెలీకుండా డ్యాన్సు‌ క్లాస్‌లు చెప్పడం రామరాజు ఇంట్లో పెను తుఫానునే తీసుకొచ్చింది. ప్రేమ తండ్రి వల్లిని డ్యాన్స్ నేర్పడం చూసి రామరాజు చెక్కా పట్టుకొని మరీ నడి వీధిలో నిలదీస్తాడు. తన కూతురు తీసుకొచ్చే డబ్బుతో తింటున్నావని నానా మాటలు అని చొక్కా చింపిమరీ ప్రేమ, వేదవతిల పుట్టింటి వాళ్లు రామరాజుని అవమానిస్తారు. ఈ గొడవని అలుసుగా తీసుకున్న శ్రీవల్లి.. మామయ్యగారికి ఇంత అవమానం జరిగితే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను అని నాటకం మొదలు పెట్టి మామయ్య నాకు దేవుడు.. నా రెండో తండ్రి.. ఎదురింటి వాళ్లు చొక్కా చింపి మరీ అవమానించారు.. నేను తట్టుకోలేను.. ఇక్కడ ఉండలేను.. పుట్టింటికి వెళ్లిపోతా అని నానా హంగామా చేసి మామయ్య దగ్గర మార్కులు కొట్టేస్తుంది.

రామరాజు వల్లీ నటనకు కరిగిపోతాడు. కట్టుకున్న భార్య కూడా తన దగ్గర నిజాలు దాచి మోసం చేసింది.. మిగతా ఇద్దరు కోడళ్లు తన మాటకు విలువ ఇవ్వలేదని కేవలం వల్లినే తన ఉమ్మడి కుటుంబాన్ని చెక్కు చెదరకుండా రెండో రామరాజులా తీర్చిదిద్దగలదని భావించి వల్లి గయ్యాల గంపని తెలీక వల్లికి ఇంటి బాధ్యతలు.. తాళాలు ఇచ్చి సర్వ హక్కులు వల్లీకే ఇచ్చేస్తాడు. చివరకు ఇంట్లో ఎవరు తనతో ఏం చెప్పాలన్నా సరే వల్లీ మేడంకే చెప్పాలని ఆర్డర్లు వేస్తాడు.

పెత్తనం వచ్చేసిందని వల్లీ ఎగిరి గంతులేస్తూ ఇక నుంచి ఇంట్లో తాను ఆడిండే ఆట పాడిందే పాట అని బులెట్ మీద తల్లిదండ్రుల దగ్గరకు పరుగులు తీస్తుంది. కూతురి వైభగం చూసి ఇడ్లీ బండి వాళ్లు తెగ మురిసిపోతారు. ఇలాగే నటించేస్తూ ఏ అనుమానం రాకుండా ఆస్తి మొత్తం కొట్టేయాలని భాగ్యం కూతురికి ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. ఇక వేదవతి అయితే తనతో భర్త మాట్లాడకపోవడానికి.. తన పెత్తనం పెద్ద కోడలికి దక్కడానికి.. తనేం చెప్పినా నమ్మలేను అని భర్త అనడానికి కారణం నడిపి, చిన్న కోడళ్లు నర్మద, ప్రేమ అని వాళ్లతో మాట్లాడటం మానేస్తుంది. నర్మద, ప్రేమ వచ్చి మాట్లాడాలని ప్రయత్నించినా.. ఇంటి పనులు చేయాలని చూసినా వాళ్లని దరిదాపునకు కూడా రానివ్వదు.. తిట్టి పంపేస్తుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న నర్మద, సాగర్‌ల సంసారంలో కూడా కలతలు వస్తాయి. ఏ చిన్న పని చేసినా నీకు చెప్పే ప్రేమ చేస్తుంది. సీక్రెట్‌గా డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లిన విషయం కూడా నీకు ప్రేమ చెప్పే ఉంటుంది. మా నాన్నకి ఇంత అవమానం జరగడంలో నీ పాత్ర కూడా ఉందని సాగర్ నర్మదని దూరం పెడతాడు. మాట్లాడటం మానేస్తాడు. నాకు డ్యాన్స్ క్లాస్‌లకు ఏం సంబంధం లేదని నర్మద చెప్పినా సాగర్ వినడు. నర్మదని అసహ్యించుకుంటాడు. ఇక ధీరజ్‌ అయితే తన తండ్రి గొడవకు కారణమైన ప్రేమను తన మాటలతో దారుణంగా అవమానిస్తాడు. ఇంట్లో టేబుల్, కుర్చీ, వస్తువులు ఎలాగో నువ్వు అలాగే తాళి కట్టా కాబట్టి నీకు తిండి పెట్టడం నీ అవసరాలు తీర్చడం నా బాధ్యత అంతే కానీ నీ మీద ప్రేమ లేదు దోమ లేదు అని ప్రేమ మనసు ముక్కలు చేస్తాడు. ఇప్పుడిప్పుడే ప్రేమ ధీరజ్‌ని ప్రేమించడం మొదలు పెట్టింది... తన ప్రేమను చెప్పాలని తెగ ఆరాటపడుతూ ఉంది.. ఈ టైంలో ధీరజ్ తనని వస్తువు అనేసరికి ఈ ముద్దు గుమ్మ చాలా హర్ట్ అయిపోతుంది.

ఇక పెత్తనం దక్కించుకున్న వల్లీ టార్చర్‌ అయితే ఘోరంగా ఉంటుంది. ఇద్దరు తోటికోడళ్లని ఓ ఆట ఆడుకుంటుంది. ప్రేమ పడుకొని ఉంటే ముఖం మీద నీళ్లు విసిరేస్తుంది. ఇళ్లు, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టమని ప్రేమకి రాని పనులు చెప్తుంది. నర్మదకి అయితే చల్లని నీటి స్నానం చేయమని చెప్తుంది. ఇద్దరి తోటికోడళ్లు అత్తకు దగ్గర కాకుండా ఎప్పటికప్పుడు అత్త మనసు విరిచేస్తుంది. నర్మద, ప్రేమలు తమకు ఈ పరిస్థితి రావడానికి గయ్యాల గంప శ్రీవల్లీనే కారణం అని తన పుట్టింటి గుట్టు రట్టు చేయాలని ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ టైంలోనే శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనంద్‌రావు.. తాము పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాదని అంతా అబద్ధం అని రామరాజు కుటుంబానికి తెలిసినట్లు అతను.. ఆనంద్‌రావుని కొట్టి ఇద్దరి తప్పులకు నానా తిట్లు తిట్టి శ్రీవల్లిని చందుతోనే మెడపట్టుకొని గెంటేసినట్లు కల కంటారు.

నర్మద తలచుకుంటే ఇదే ఎప్పటికైనా జరుగుతుందని భాగ్యం నర్మదని కలిసి నిన్ను మొగుడు అర్థం చేసుకోవడం లేదు.. నడి రోడ్డు మీద వదిలేసి ఎవరో తెలీనట్లు పట్టించుకోకుండా పోతున్నాడు.. నువ్వే వేస్ట్.. చచ్చిపో ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి నర్మద ఏడ్చేలా చేస్తుంది. ఇక వల్లీ మేడం అయితే కొత్త కొత్త రూల్స్ పెట్టి ఇంట్లో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా అంతా తన ఇష్ట ప్రకారం నడిచేలా చేస్తుంది. రాత్రి పది గంటలు దాటితే ఇంటి తలుపు వేసేయడం ఎవరైనా తర్వాత వచ్చినా తలుపు తీయకుండా బయట చలి, దోమల్లో ఉంచేస్తుంది. ప్రేమ, ధీరజ్ కూడా టార్చర్కి బలైపోతారు. ధీరజ్ రాత్రి పది అయినా రాకపోవడం ప్రేమ ధీరజ్కోసం ఎదురు చూస్తూ తలుపు వేయొద్దని వల్లితో చెప్పడం వల్లీ ప్రేమని గెంటేసి డోర్ వేసేస్తుంది. ధీరజ్ విషయం తెలుసుకొని ఇదో కొత్త తలనొప్పి అని తల పట్టుకుంటాడు. ఆకలి ఏమైనా చేసి ఇంట్లోకి వెళ్లేలా చేయవే అని భార్యని బతిమాలుతాడు. దాంతో ప్రేమ రూపాయి బిల్లతో కిటికీ తీసే ప్రయత్నం చేస్తుంది. ఇదీ వారం జరిగింది.