Trinayani October 9th Written Update: నేను నిన్ను మరదలుగా కాకుండా మాతృమూర్తిగా చూస్తాను. కానీ నీ మాతృత్వాన్ని నువ్వు కోల్పోయావు అని విశాల్ అంటాడు.
విశాలాక్షి: సరిగ్గా చెప్పారు నాన్న.
సుమన: ఏంటే ఏదో కష్టపడి బిడ్డను కన్నదాని లాగా నువ్వు వత్తాసు పలుకుతున్నావు? నా బిడ్డ నా ఇష్టం. కన్నది నేను అన్నీ నీకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు.
నయని: మనుషులకి ఎవరికైనా బాబు గారు చెప్పిన మాటలు అర్థం అవుతాయి. అల్పులకే అర్థం కావు
తిలోత్తమ: నువ్వు అల్పురాలివి అని నయని అంటుంది సుమన.
హాసిని: పెట్టారా ఫిట్టింగు? ఎప్పుడూ పక్క వాళ్లని ఇరికిద్దామని చూస్తారు.
తిలోత్తమ: నువ్వు పెట్టే ఫిట్టింగులు కన్నా కాదు అని అనగా హాసిని రెచ్చిపోయి తిలోత్తమ మీదకి గొడవకి దిగుతుంది. అప్పుడు అందరూ హాసినిని నానా ప్రయత్నాలు చేసి ఆపుతారు.
సుమన: నువ్వైనా.. నీ భర్త అయినా నన్ను ఇన్ని మాటలు అనకపోయి ఉంటే ఈ గొడవ వచ్చేదే కాదు.
డమ్మక్క: బిడ్డకి తల్లిపాలు కూడా ఇవ్వలేదు నిన్ను ఏ మాట అనకూడదంటే ఎలా అవుతాది?
సుమన: ఎందుకు పాలు ఇవ్వాలి? పాలు ఇచ్చి నా ముఖాన్ని అందవికారంగా చేసుకోవడానికా?
విశాలాక్షి: అందవికారమా? ప్రపంచంలో అన్నిటికన్నా స్వచ్ఛమైనవి తల్లిపాలు మాత్రమే. నువ్వు ఇవ్వకపోతే అవి నేను ఇస్తాను అని అనగా అందరూ విశాలాక్షిని చూసి గట్టిగా నవ్వుతారు.
తిలోత్తమ: ఇది మాయలు మంత్రాలు కాదు. బిడ్డని కనకుండా తల్లిపాలు ఇవ్వడం అసంభవం, పాలు రావు.
విశాలాక్షి: నేను ఇస్తానంటున్నాను కదా. అయినా అందవికారంగా అవడానికి అందం ఉండాలి కదా ఎక్కడా అందం? అని సుమనతో అనగా కోపంగా ఉన్న సుమన చేతిలో ఉన్న పాలను విశాలాక్షి ముఖాన్ని కొడుతుంది. ఒకేసారి అందరూ ఆశ్చర్యపోతారు.
వెంటనే పక్కనే ఉన్న నయని సుమన చెంప పగల కొడుతుంది.
విశాలాక్షి: సుమన కోపంతో నా మీద పాలు జల్లినా కూడా నేను వాటిని పాలాభిషేకమని అనుకుంటాను. కానీ ఇంటికి జరిగే ద్రోహం మాత్రం ఆగదు. ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు ఈ ఇంట్లో పిల్లలకి పట్టడానికి మీకు పాలు ఉండవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది విశాలాక్షి. దానికి అక్కడ ఉన్న వాళ్లందరూ బాధపడతారు.
ఆ తర్వాత సీన్లో సుమన తన గదిలో ఉండగా విక్రాంత్ అక్కడికి వస్తాడు.
విక్రాంత్: చీరలు నువ్వు కూడా కడుతున్నావా? అయినా పట్టుచీర కట్టినంత మాత్రాన వాటికున్న విలువ నీకు రాదు. పాపం శివ భక్తురాలు కనుక విశాలాక్షి ఊరుకున్నది. లేకపోతే నీ మీద శాపనార్థాలు పెట్టేసేది. పెట్టినా బాగున్ను ఇప్పుడు అనుకొని ఏం లాభం లే
సుమన: మళ్లీ నన్ను అనమనండి. ఈసారి వేడిగా మరగపెట్టిన పాలను ముఖాన్ని కొడతాను. అయినా నన్ను అంటుందా? ఇంక నేను వెళ్లి ఉలూచికి పాలు పట్టాలి జరగండి.
విక్రాంత్: ఏదో తల్లివైనట్టు మాట్లాడుతున్నావు పెట్టేది డబ్బా పాలే కదా? అయినా దానికి తల్లీ పెద్ద బొట్టమ్మ కూడా
సుమన: మొన్న గురువుగారు అంటే అన్నారు కానీ ఇంకొకసారి కూడా నా ముందు ఆ మాట అనొద్దు విని అలిసిపోయాను. ఇంకొకసారి పెద్ద బొట్టమ్మ నా పాప జోలికి వస్తే అక్కడికక్కడే చంపేస్తాను అని కోపంగా అంటుంది. అప్పుడు విక్రాంత్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత సీన్లో విశాలాక్షి పెట్టిన శాపానికి బాధపడుతూ ఉంటుంది నయని. అప్పుడు విశాల్ అక్కడికి పాలు పట్టుకుని వస్తాడు.
విశాల్: ఆ శాపం గురించి ఆలోచిస్తూ నువ్వు ఈ రోజంతా ఆకలితోనే ఉన్నావు. ఏమీ తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు అని పాలు పట్టిస్తాడు. అప్పుడు పాలు తాగిన నయని పెదాల మీద పాల నురగని తుడుస్తాడు. అప్పుడు ఇద్దరు హత్తుకుంటారు. టెన్షన్‌గా ఉన్న నయనిని కూల్ చేస్తాడు విశాల్.
ఆ తర్వాత హాల్ దగ్గర అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సుమన అక్కడికి వస్తుంది.
సుమన: అందరూ ఇక్కడే ఉన్నారా? అత్తయ్య గారు అందర్నీ కిందకి రమ్మన్నారట?
హాసిని: ముందు ఆ మహానుభావురాలు ఎక్కడున్నాదో అని అనగా తిలోత్తమను వల్లభ నానా తంతాలు పడి తీసుకొని వస్తాడు.
విశాల్: నడవడానికి అంత నొప్పిగా ఉంటే నేను ఎత్తుకొని సోఫా మీద కూర్చోబెడతానమ్మా..
తిలోత్తమ: లేదు విశాల్ పడుకుంటే కాని ఇంకేం చేసిన ఈ నొప్పి తగ్గదు
హాసిని: కొడుకంటే విషాక్లా ఉండాలి మీలా కాదు అని వల్లభతో అంటుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial