Varshini Gowda: జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్న కన్నడ బ్యూటీ వర్షిణి గౌడ. తన అందం, ప్రతిభతో చిన్న వయసులోనే దక్షిణాది బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

Continues below advertisement

వర్షిణి పుట్టి పెరిగింది బెంగళూర్‌లో. అమ్మ, నాన్న, తమ్ముడు, ఇల్లు, స్కూల్‌, కాలేజీ ఇవే తన ప్రపంచమని ఆమె చెప్పింది. ఆమె ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ మోడలింగ్‌ షోలో ఛాన్స్ వచ్చింది. ఆ పోటీలో ఫస్ట్ బహుమతి గెలుచుకుంది. దాంతో టీచర్స్‌, ఫెండ్స్‌ అందరూ మోడలింగ్‌, యాక్టింగ్‌లో ట్రై చేయమని ప్రోత్సహించారు. దాంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కన్నడ సీరియల్స్‌, సినిమాలకి ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టంది. కలర్స్‌ కన్నడలో వచ్చిన ‘బృందావన’ సీరియల్లో తొలి అవకాశం దక్కింది. ఆ తర్వాత రవిచంద్రన్‌ సినిమాలోనూ నటించింది.

కెరీర్  

మోడలింగ్‌లో రాణించిన తర్వాత, వర్షిణి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.  కన్నడ బుల్లితెరపై 'బృందావన', 'అగ్నిసాక్షి' వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' సీరియల్‌తో తెలుగు బుల్లితెరపై హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు గంగా. తన అమాయకత్వంతో పాటు ఎమోషనల్ నటనతో తెలుగు ప్రేక్షకులను తక్కువ సమయంలోనే ఆకట్టుకుంది. Also Read: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు

Continues below advertisement

రెమ్యూనరేషన్  

కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన కథానాయిక అయినప్పటికీ, సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తున్నందుకు గాను రోజుకి దాదాపు రూ.10,000 నుండి రూ.18,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియా మోడలింగ్,  ప్రాజెక్టుల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందుతుంది.  Also Read: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

సోషల్ మీడియా  

వర్షిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.  మోడలింగ్ ఫోటోషూట్స్, 'జయం' సీరియల్ షూటింగ్ లొకేషన్ విశేషాలు, బిహైండ్ ద సీన్స్ వీడియోలు, రీల్స్‌ను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటుంది.

ఇతర ఆసక్తికర విషయాలు  

మోడల్, బ్యూటీ ప్యాజెంట్ విజేత, నటిగా తనదైన శైలిలో దూసుకుపోతుంది వర్షిణి. కన్నడ మాతృభాష అయినప్పటికీ, 'జయం' సీరియల్ కోసం తెలుగులో డైలాగ్స్ సులభంగా నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ ఇస్తుంది.  

Also Read:  కార్తీక దీపం 2 విలన్ 'మాలిని'.. తేజస్విని ప్రకాష్ రియల్ లైఫ్‌, కెరీర్ విశేషాలు