Tejaswini Prakash: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'కార్తీక దీపం 2 (ఇది నవ వసంతం)' సీరియల్‌లో మాలిని క్యారెక్టర్‌లో పరిచయమైన నటి తేజస్విని ప్రకాష్.  ఈమె జులై 12, 1987లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. బెంగళూరులోనే తన చదువు పూర్తి చేసింది. 2022లో తెలుగు బిజినెస్ మెన్ ఫణి వర్మను వివాహం చేసుకుంది. 

Continues below advertisement

కెరీర్, సీరియల్స్ 

తేజస్విని తన నటనా కెరీర్‌ను కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ప్రారంభించింది. 2007లో 'మాతాడ్ మాతాడు మల్లిగే' అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ వెండి తెరపై మెరిసింది.  గజ, అరమనే, బంధు బలగా వంటి కన్నడ హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించింది. టాలీవుడ్‌లో ఈమె తన పేరును తనీష్కగా మార్చుకుని మూవీస్ చేసింది. ‘ప్రతిక్షణం’, ‘కట్ చేస్తే’, ‘సినిమా మహల్ – రోజుకి 4 ఆటలు’ వంటి సినిమాల్లో నటించింది. కన్నడ 'బిగ్ బాస్ 5' లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.  కన్నడ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు టాప్ సీరియల్ 'కార్తీక దీపం 2' లో మాలిని పాత్రలో అలరిస్తుంది. 

రెమ్యూనరేషన్ 

కార్తీక దీపం 2 సీరియల్‌లో తేజస్విని క్యారెక్టర్‌కు  మంచి ప్రాధాన్యత ఉన్నందున, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు బుల్లితెర వర్గాల టాక్. కన్నడ, తెలుగు టీవీ ఈవెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ద్వారా కూడా ఆమె సంపాదిస్తున్నారు.

Continues below advertisement

సోషల్ మీడియా 

 తేజస్విని ఇన్‌స్టా్గ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన షూటింగ్ లొకేషన్ పిక్స్, పర్సనల్ లైఫ్, కార్తీక దీపం 2 సీరియల్ సెట్స్ నుంచి రీల్స్ ఫ్యాన్స్‌తో నిరంతరం పంచుకుంటుంది. 

Also Read: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

ఇతర ముఖ్య విషయాలు  

కన్నడ, తెలుగు భాషలతో పాటు ఇతర దక్షిణాది భాషలపై తేజస్వినికి మంచి పట్టు ఉంది.  కన్నడ సినిమాల్లో ఆమె నటనకు గాను కొన్ని రీజినల్ అవార్డులు, నామినేషన్లు అందుకుంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్ రెండింటినీ చక్కగా క్యారీ చేయగల నటిగా గుర్తింపు పొందింది.  Also Read: బెంగాలీ భామ, తెలుగు బుల్లితెర 'వేద'.. దేబ్జానీ మోదక్ రియల్ లైఫ్ విశేషాలు