Trinayani October 13, ఈరోజు ఎపిసోడ్​లో పాప చేతిని లిక్విడ్ లో ముంచి ఇక తిలోత్తమా అమ్మ వాళ్ళు వచ్చి నిన్ను ముట్టుకున్న కూడా నిప్పురవ్వలు రావు. లేకపోతే నువ్వే మా అమ్మవని తెలిస్తే ఈ జన్మలో కూడా నిన్ను వదిలిపెట్టరు. తిలోత్తమ అమ్మ వాళ్ళు నిన్ను ఏం చేసినా ఆ పరిస్థితులలో నేను చూస్తూ ఉండిపోవచ్చు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోవాలి అని పాపతో చెప్తాడు విశాల్. ఇదంతా హాసినికి చెప్తాడు విశాల్. ఆ మాటలు విని హాసిని ఆశ్చర్యపోతుంది.


హాసిని: తల్లిని రక్షించుకోవడం కోసం మంచి పని చేశావు.


విశాల్: తల్లిని రక్షించుకోవడం కొడుకుగా నా బాధ్యత, నా చిన్నతనంలో ఆ పని చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అంటూ కూతురిని ముద్దు పెట్టుకుంటాడు.


హాసిని తండ్రి చెప్పినట్టు వింటున్నావో అంటూ గాయత్రీ ని మెచ్చుకుంటుంది. కానీ వీళ్ళిద్దరి మాటల్ని ఎవరో పక్కనుంచి వీడియో తీస్తారు. తర్వాత పాప చేతికి ఉన్న పొరని తీసి పడేస్తాడు విశాల్. నెక్స్ట్ సీన్​లో ఉలూచి ఉయ్యాల చుట్టూ పిండితో రక్షణ రేఖ వేస్తుంది సుమన అప్పుడే అక్కడికి వచ్చిన భర్త ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.


సుమన : ఇంకాసేపట్లో సూర్యాస్తమయం అవుతుంది కదా అప్పుడు పాప పాముగా మారిపోతుంది పెద్ద బొట్టమ్మ వచ్చి ఉలూచిని షికారుకి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లి పోతుంది.


అప్పుడే అక్కడికి వస్తుంది నయని.


నయని: పూలుచి నీ కూతురే కాదు పెద్ద బొట్టమ్మకి కూడా కూతురే.


సుమన : నా కూతురికి పెద్ద బుట్ట బొమ్మ మీద హక్కు ఉందంటే నేను ఒప్పుకోను.


సుమన భర్త : నువ్వు ఎన్ని చెప్పినా సరే గురువుగారు చెప్పినట్లే చేయాలి.


సుమన: ఆయనకేం పోయింది ఆయన అలాగే చెప్తారు.


నయని: సుమన పిచ్చిపిచ్చిగా మాట్లాడకు పిచ్చి పనులు చేయకు ఇలా చేస్తే పెద్ద గొట్టమని రాకుండా ఆపుతావేమో కానీ విలోజీని వెళ్లకుండా ఆపినట్లే అవుతుంది.


సుమన భర్త: దీంతో మాట్లాడే మీ టైం వేస్ట్ చేసుకోకండి వెళ్ళండి అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది నయని.


నెక్స్ట్ సీన్​లో వల్లభ ఇంట్లోకి వస్తుంటే పాప చేతి నుంచి తొలగించిన పొర ఒకటి వల్లభ కంట్లో పడుతుంది. ఇదేదో తేడాగా ఉంది ఏంటి అంటూ తల్లికి చూపించడానికి మెట్లు ఎక్కబోతుంటే కాలి మధ్యలో నుంచి పాము వెళ్ళిపోతుంది. ఆ సంఘటనకి కంగారుపడిన వల్లభ కాలుజారి మెట్లు మించి కిందికి పడిపోతాడు. ఆ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. తాగేసి పడిపోయి ఉంటాడు అంటాడు సుమన భర్త, అలాంటి వాసన ఏమీ రావటం లేదే అంటాడు విశాల్. వాళ్లు అలా మాటల్లో ఉండగా చేతిలో ఏంటి బావగారు అది అని అడుగుతుంది సుమన. వల్లభ చేతిలో ఉన్న పొరని చూపించడంతో హాసిని విశాల్ ఇద్దరు షాక్ అవుతారు. ఏదో బట్ట లాగా ఉంది.


తిలోత్తమ: కాదనుకుంటాను, రబ్బరు లాగా ఉంది.


ఏది ఇటివ్వండి అంటూ కావాలనే హాసిని, విశాల్ ఇద్దరూ ఆ పొరని లాక్కొని చింపేస్తారు.


సుమన భర్త: ఏది పడితే అది ఇంట్లోకి తీసుకువస్తావ్ ఏంటి..


వల్లభ : అది ఇంట్లోనే దొరికింది ఏదో మాట్లాడే లోపు టాపిక్ డైవర్ట్ చేసేస్తారు విశాల్, హాసిని.


వల్లభ: మమ్మీకి చూపిద్దామని తీసుకొస్తుంటే పాము అడ్డుపడింది.


తిలోత్తమ: పాము ఎక్కడుంది అసలు?


హాసిని భర్త: ఇంట్లోనే ఉంటుంది రాత్రి అయితే ఉలిచి అవతారం మారిపోతుంది కదా.


నయని : బావగారు అది చూపిద్దామని తీసుకొచ్చే సమయానికి పాప అలా చేసిందంటే దానికి దీనికి ఏదో సంబంధం ఉంది అని అనుమాన పడుతుంది.


హాసిని: అత్తయ్య మీరు ఆయన్ని పైకి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయండి అంటూ టాపిక్ మార్చేస్తుంది.


కోడల్ని తిట్టుకుంటూ కొడుకుని పైకి తీసుకెళ్లి కాపడం పెడుతుంది తిలోత్తమ. అప్పుడే అక్కడికి వచ్చిన హాసిని అన్నిటికీ ఈయనకి మాత్రమే అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నయని.. కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేస్తారు.


వల్లభ: నేనేం చేశాను అంటాడు


నయని: ఇది దొంగతనం చేసిన వేలిముద్రలు పడకుండా వాడుతారు. మీరు ఆస్తి పత్రాలు కొట్టేయడానికి ఇలాంటి ప్రయోగాలు చేశారని అర్థమైంది.


అబండాలు వెయ్యొద్దు అంటారు తల్లి కొడుకులు.


తిలోత్తమ: నాకు ఆస్తులు అంతస్తులు ఏమి అక్కరలేదు. మళ్లీ పుట్టిన గాయత్రి అక్కని ఒకసారి చూస్తే చాలు అనుకుంటున్నాను.


నయని: ఆ సంగతి తర్వాత ముందు ఇది తేల్చుకోవాలి అంటూ పొరని చూపిస్తుంది.


తిలోత్తమ: ఆ పని మీ చెల్లెలు చేసి ఉంటుంది.


నయని: దానికి మా ఆయన 10 కోట్లు ఇచ్చారు. ఇంకెందుకు ఆశపడుతుంది.


టాపిక్ ఇంకా పెరిగిపోతుందేమో అనుకొని నువ్వు రా చెల్లి మనకి ఇక్కడ ఏమీ నష్టం లేదు జరగలేదు కదా అని నయనీని తీసుకొని వెళ్ళిపోతుంది హాసిని.


తర్వాత పాప ఏడుస్తున్న పట్టించుకోకుండా యోగా చేస్తూ ఉంటుంది సుమన. అలా చేస్తున్నందుకు ఆమెని అందరూ మందులు ఇస్తారు ఈ లోపుగా అక్కడే దాక్కొని ఉన్న పెద్ద బొట్టమ్మని చూస్తుంది నయని. ఇక్కడ ఉందేంటి సుమన చూసిందంటే గొడవ చేస్తుంది అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.