Nindu Noorella Savasam, October 13, ఈరోజు ఎపిసోడ్లో
మిస్సమ్మ : తల్లి లేని పిల్లలు సర్, ఇది కావాలి అని అడగలేరు. ఇదే తినాలి అంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు. మనం చెప్పినట్లుగా వాళ్ళు వినాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం నడుచుకోవాలి. ఇంతవరకు ఏం తిన్నారో నాకు తెలియదు కానీ ఈరోజు వాళ్ళ అమ్మగారి దశదినకర్మ కనీసం ఈ రోజైనా వాళ్ళని కడుపునిండా తిని.. కంటి నిండా నిద్రపోనివ్వండి సార్, దయచేసి ఈ ఒక్క పూటకి పర్మిషన్ ఇవ్వండి అంటూ ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అమర్ : రాథోడ్.. మనోహరి ఎక్కడ?
రాథోడ్: లోపల ఉన్నారు సార్.
ఈ మాటలు అన్నీ వింటున్న అరుంధతి ఇప్పుడు మనోహరి తో ఈయనకి ఏం పని అంటూ వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినటానికి వెళ్తుంది. అదే సమయంలో అరుంధతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి.
మనోహరి: ఇంట్లో పెళ్లి ఘడియలు సమీపించాయి అని చెప్పారు పంతులుగారు. కరెక్ట్ గా అదే టైంకి మిస్సమ్మ ఇక్కడికి వచ్చింది. అంటే ఆమెతో పెళ్లి అవుతుందా.. మళ్లీ అలా ఎప్పటికీ జరగనివ్వను. అమర్ ఎప్పటికైనా నా వాడే, తనని సొంతం చేసుకోవడం కోసం ప్రాణ స్నేహితురాలిని పైకి పంపించేశాను. ఇంక ఈ మిస్సమ్మ ఒక లెక్కా అనుకుంటుంది.
ఇంతలో రాథోడ్ వెనకనుంచి పిలవడంతో అంతా వినేసాడేమో అని కంగారుపడుతుంది.
అమర్: ఇక్కడ ఏం చేస్తున్నావ్.
మనోహరి: అరుంధతి గుర్తొస్తుంది. ఆమె గురించే ఆలోచిస్తున్నాను.
అమర్: మరిచిపోతేనే మనుషులు గుర్తొస్తారు, నిత్యం మనసులో ఉంటే వాళ్ళ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు.
మనోహరి : దొరికిపోయాను అనుకుంటూ ఇంతకీ నువ్వేంటి ఇలా వచ్చావ్ అంటుంది.
అమర్: నీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను. నువ్వు అరుంధతి చనిపోయిన దగ్గర నుంచి నాకు, నా కుటుంబానికి చాలా సపోర్ట్ ఇచ్చావు. నీ స్నేహితురాల కోసం ఈ భవిష్యత్తు ఆగిపోవడానికి వీలు లేదు, నీకంటూ ఓ కుటుంబం ఉండాలి. రేపు పొద్దున్నే బయలుదేరు.
మనోహరి : ఇది కూడా నా కుటుంబమే!
అమర్: కాదు, ఇది అరుంధతి కుటుంబం. ఎప్పటికైనా నీకంటూ ఒక తోడు ఉండాలి. ఈ మాట నేను ముందే చెబుదాం అనుకున్నాను కానీ దశదినకర్మ అయిపోయాక చెబుదామని ఊరుకున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమర్.
ఈ మాటలు అన్నీ వింటున్న అరుంధతి నీకు మా ఆయన లాంటివాడే కరెక్టు, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయన కాలి గోరు కూడా తాకలేరు అనుకుంటుంది.
మనోహరి : తనని నా వాడిని చేసుకోవాలి అనుకుంటే ఇదేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనుకుంటుంది.
ఇదే విషయం గురించి తన గదిలో కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా అమర్ ని సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తున్న మనోహరి ని చూస్తూ ఒకవైపు కోప్పడుతుంది, మరొకవైపు జాలిపడుతుంది అరుంధతి.
అరుంధతి: చాలా కోపంగా ఉంది నా ఫోటో పడేసినందుకు కాదు, నా పిల్లల్ని హాస్టల్ లో పడేస్తాను అన్నందుకు, నా భర్తని నీ వాడు నేను చేసుకుంటాను అన్నందుకు. అలాగే జాలిగా కూడా ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళ్తావు, నేను కూడా లేను. ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నావు మంచి దానిలాగా మారిపోవచ్చు కదా అంటూ గట్టిగా అంటుంది.
మనోహరికి ఆ ఫీలింగ్ తెలుస్తుంది కంగారు పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు పొద్దున్నే..
అరుంధతి: ఈరోజు మిస్సమ్మ కి మొదటి రోజు, సక్సెస్ఫుల్గా ఈరోజు ని కంప్లీట్ చేయాలి కానీ పోయి, పోయి ఈ పిల్ల సార్ ఎదురుగానే తప్పులు చేస్తూ ఉంటుంది అనుకుంటుంది.
ఇంతలో నీల పెద్ద పెద్ద కేకలు వేస్తూ అందర్నీ పిలుస్తుంది. అందరూ అక్కడ గేదర్ అవుతారు. ఏం జరిగింది అని అడుగుతారు. అరుంధతి కూడా లోపలికి వద్దాం అనుకుంటుంది కానీ మిస్సమ్మ తనతో మాట్లాడటం మొదలుపెడితే మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తుందని గుమ్మంలోనే ఉండిపోతుంది. వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయిందేమో అని కంగారు పడుతుంది.
నీల: నేను నోటితో చెప్పలేను మీరే చూడండి సార్ అని అమర్ వాళ్లని మనోహరి రూమ్‌కి తీసుకువెళ్తుంది.
అక్కడ సూసైడ్ చేసుకున్న మనోహరి అచేతనంగా పడి ఉంటుంది. ఆమెని తీసుకొని హాస్పిటల్ కి పరిగెడతారు అమర్, రాథోడ్ .
అమర్ పేరెంట్స్ : ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది. అయినా నేటి కాలం అమ్మాయిలు మనసులో ఏముంటుందో ఎవరిమీ చెప్పలేకపోతున్నాం అంటూ లోపలికి వెళ్ళిపోతారు. మనోహరి ఎందుకలా చేసింది అని అరుంధతి కూడా అనుకుంటుంది.