Trinayani Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కాలింది బొమ్మే కదా బాధపడొద్దు అని చెప్పి మనసులో గాయత్రి అక్క కూడా ఇలాగే కాలితే బాగుండు అని అనుకుంటుంది.


సుమన: ఛీ కంపు కంపు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


ఆ తర్వాత సీన్ లో గార్డెన్ లో నయని సోఫా మీద కూర్చుని మరొక బొమ్మకు స్ప్రే జల్లుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విశాల్ వస్తాడు. 


విశాల్: ఏం చేస్తున్నావ్ నయని?


నయని: గంధపు చెక్కని దంచి దాన్ని నీళ్లలో జల్లి స్ప్రే చేస్తున్నాను దీనివల్ల బొమ్మకు చెద పట్టదు. లేకపోతే దీన్ని కూడా కాల్చేస్తాది మా చెల్లి. అసలు బొమ్మ కాలిందని కాదు కాని ఏం చేయలేని స్థితిలో మిమ్మల్ని అలా చూసి చాలా బాధేసింది బాబు గారు. కొన్ని కొన్ని సార్లు అసలు వాళ్లకు మనం ఎందుకు ఆశ్రయం ఇచ్చామా? అని అనిపిస్తుంది.


విశాల్: కొన్ని మందిని చూసి జాలేసి ఆశ్రయించాం.


నయని: హాసిని అక్క దేని గురించో అందరితోని మాట్లాడుతాను అని చెప్పింది. ఒకవేళ గాయత్రమ్మ గారి గురించి అయితే అందరూ దీని గురించి చర్చించి ముందడుగు వేయాలి. అని అంటుంది నయని.


ఆ తర్వాత సీన్లో అగ్గిపెట్టి పట్టుకొని విక్రాంత్ తన గదిలో కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి సుమన వస్తుంది.


సుమన: అగ్గిపెట్టి ఎందుకు పట్టుకున్నారు బుల్లి బావగారు మీకు సిగరెట్ కాల్చే అలవాటు లేదు కదా?


విక్రాంత్: అక్కడ చూసావా ఏమున్నాయో? నీ ఖరీదైన నగలు చీరలు ఉన్నాయి. ఇందాక చెద పట్టింది అని ఆ బొమ్మని నువ్వు కాల్చేశావు ఇక్కడ నీ ఒళ్ళంతా చెద పట్టింది నిన్ను కూడా కాల్చేయాలి కదా


సుమన: వద్దు బావగారు ఆ నగలు చీరలు కలిపి కోట్లల్లో ఉంటాయి. వాటిని ఏం చేయొద్దు.


విక్రాంత్: ఇప్పుడు కూడా నువ్వు చస్తావు అని అంటుంటే నగల గురించి ఆలోచిస్తావు ఇంత అత్యాశతో ఉంటే ఏదో ఒక రోజు నిజంగానే చస్తావు.


సుమన: చావు అప్పుడు కూడా నన్ను నగలతోనే దహన సంస్కారాలు చేయండి అని అనగా కోపంతో చీకొడుతూ విక్రాంత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


ఆ తర్వాత సీన్లో హాసిని పిలిచిందని కుటుంబ సభ్యులందరూ రహస్యంగా ఒక దగ్గర మీటింగ్ పెడతారు


నయని: ఎందుకు అక్క పిలిచావు?


హాసిని: ఎందుకు పిలిచానో నేను మర్చిపోయాను చెల్లి. ఆ!!గుర్తొచ్చింది. ఇప్పుడు పెద్ద అత్తగారు ఎక్కడున్నారో మనం ఎవరికీ తెలీదు ఒకవేళ తెలిసే అవకాశం ఉందంటే అది కేవలం నీకు మాత్రమే తెలియాలి. నా దగ్గర ఐడియా అంటూ ఏం లేదు కానీ అందరం కలిసి చర్చిస్తే ఏవైనా ఐడియా వస్తుంది అని పిలిచాను


నయని: గాయత్రి అమ్మగారు ఎక్కడున్నారో నాకు తెలీదు కానీ ఎటువంటి సమస్య వస్తుందో తెలిసే అవకాశం ఉంటే అప్పుడు నేను గాయత్రి అమ్మ గారి గురించి ఆచూకీ తెలుసుకోవచ్చు అని అనగా అప్పుడే అక్కడికి విక్రాంత్ వస్తాడు.


విక్రాంత్: దీనికి ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు?


నయని: అదేంటి విక్రాంత్ బాబు అంతా తేలిగ్గా చెప్పేసారు


విక్రాంత్: ఎందుకంటే నా దగ్గర పరిష్కారం ఉంది గనుక. మన ఇంట్లో ఒక నాగ పెట్టి ఉంది కదా అందులో పెద్దమ్మ జాతకం ఉంది. దాన్ని చదివుపిస్తే తెలుస్తుంది కదా ఎలాంటి సమస్యలు వస్తాయో


నయని: అవి మానవులు చదవలేని జాతకాలు


హాసిని: అయితే మా అత్తయ్య చదవగలదు. తను మనిషి కాదు కదా నరరూప రాక్షసి అని అనగా అందరూ నవ్వుతారు


విక్రాంత్: దీనికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. పెద్దబొట్టమ్మ మనిషి కాదు పాము కూడా కదా తనని తీసుకొస్తే ఖచ్చితంగా చదువుతుంది


నయని: ఈ ఆలోచన మాకు రాలేదు విక్రాంత్ బాబు మంచి పని చేశారు ఇప్పుడు ఏం చేద్దాం. అసలకే  ఉలూచిని తీసుకువెళ్ళింది అని పెద్ద బొట్టమ్మ మీద ఇంకా సుమన కోపంగానే ఉంది. ఇలాంటి సమయంలో పెద్ద బొట్టమ్మని తీసుకురావడం మంచిదేనా?


విక్రాంత్: నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి వెంటనే సుమన దగ్గరకు వెళ్తాడు. సుమను నించొని ఉండగా వెనుక నుంచి సుమన కళ్ళు కప్పుతాడు.


విక్రాంత్: నేనెవర్నో చెప్పు చూద్దాం?


సుమన: రోజుకు మూడుసార్లు తిండి తిన్నా ఆరుసార్లు మీ తిట్లు తింటాను మీరు ఎవరో నాకు తెలీదా? బుల్లి బావగారు అయినా ఎందుకిలా వచ్చారు


విక్రాంత్: నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని మల్లెపూల దండను సుమనకిస్తాడు


సుమన: ఈరోజు ఏం పూజ లేదు కదా మరి ఎందుకు నాకు పూలుస్తున్నారు? అయినా మీరు ఏంటి ఇంత ప్రేమతో మాట్లాడుతున్నారు అని అనగా ఆ మల్లెపూల మాలను విక్రాంత్ సుమన తలకిపెట్టి అందంగా ఉన్నావు అని అంటాడు


సుమన: నిన్నే కదా రాక్షసిలా ఉన్నాను అన్నారు అప్పుడే మారిపోయారా? అయినా మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి ప్రతిరోజు ఇలాగే మాట్లాడితే ఎంత బాగుందో ఈ మార్పు కి కారణం ఏంటి?


విక్రాంత్: అది నిన్న ఇది ఈరోజు. తేదీ మారినట్టే మనుషులలో మార్పులు కూడా మారుతాయి. ఒక నిమిషం ఆగు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిందకు వస్తాడు విక్రాంత్.


సుమన: ఏంటి ఎప్పుడు లేనిది ఇలాగా ప్రేమగా మాట్లాడుతున్నారు ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలి. ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.


మరోవైపు విక్రాంత్ కిందకొచ్చి చూడగా అప్పటికే కారపు నీళ్లను హాసిని కలుపుతూ ఉంటుంది. నయని వాళ్లు అప్పుడు అక్కడికి వస్తారు


నయని: కారపు నీళ్లను కలుపుతున్నావేంటి అక్క ఇది సుమన మీద పడితే కళ్ళు మండుతాయి కదా


విక్రాంత్: పాపిష్టి కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతా? అయినా అంత నష్టమేం జరగదు లెండి


విశాల్: విక్రాంత్ చాలా ఘోరమైన ఐడియా ఇది


విక్రాంత్: ఇంక టైం లేదు సుమనకి అనుమానం వచ్చింది ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు ప్లాన్ని అమలు పరచాలి


డమ్మక్క: అయితే అరటి పండ్లు తినాలి అని అనగా అప్పుడే అక్కడికి వల్లభ తిలోత్తమలు వస్తారు.


వల్లభ: ఎవరు ఎక్కువ అరటి పళ్ళు తింటే వాళ్లే గెలిచినట్టా?


డమ్మక్క: సుమన వస్తుందనుకుంటే సుందరాంగుడు వచ్చాడు


హాసిని: మా ఆయన అంత అందంగా ఉంటాడా?


తిలోత్తమ: నీకే కనబడదు కానీ వల్లభలో ఏం తక్కువ?


హాసిని: నేను చెప్పనా ఏం తక్కువో?


విక్రాంత్: సుమన వచ్చేస్తుంది అని అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.