Trinayani Today Episode : విశాలాక్షి చెప్పినట్లు హాసిని ఉసిరి దీపాల పూజకు ఏర్పాట్లు చేస్తుంది. తిలోత్తమ, సుమన అందరూ అక్కడే ఉంటారు. నయనికి తల స్నానం చేసి రమ్మని విశాలాక్షి చెప్తుంది. తిలోత్తమ, సుమన నయని తలపెట్టిన ఆ పూజకు ఆటంకం తలపెట్టాలని అనుకుంటారు. 


వల్లభ: చిన్న మరదలా.. కాసేపట్లో వాళ్లు వెలిగించబోయే ఆ ఉసిరి దీపాలను నేలపాలు చేశావంటే మీ అక్క దీక్షకు భంగం కలుగుతుంది.


సుమన: అందరి నన్ను కొట్టి చంపేయాలి అని అలా చెప్తున్నారు కదా బావగారు.


తిలోత్తమ: నిజంగా నీకు అంత తెలివి ఉంటే నువ్వే ఆ పని చేశావు అని తెలియకుండా సాధించుకోగలవు సుమన. 


సుమన: నా తెలివితేటలకు పరీక్షనా అత్తయ్య. సరే అయితే మీరే చూస్తారు కదా..


విశాల్: విశాలాక్షి ఏదో పూజ అన్నారు దేవుడే లేడు.


ఎద్దులయ్య: ఎందుకు లేదు బాబు దేవతే ఉంటే..


సుమన: నన్నేనా అంటుంది.


విక్రాంత్: నువ్వు దిష్టి బొమ్మకు కూడా పనికి రావే..


విశాల్: ఊరుకోరా తనేదో సరదాగా అంటే నువ్వు సీరియస్ చేయకు.


సుమన: మా అక్క కనపడటం లేదు.


దురంధర: కనపడకుండా ఎక్కడికి పోతుందే..


డమ్మక్క: అలా జరగాలి అనే చూస్తున్నారు.


తిలోత్తమ: డమ్మక్క తెలీకుండా అన్న జరగబోయేది అదేరా..


వల్లభ: పెద్దమరదలు స్నానం చేసిన నీటిలో రసాయనం కలిపిన నీ తెలివి తేటలు సూపర్ మమ్మీ. దీపాలే మన పాపాలు నయని అంటుకుంటాయి.


విశాలాక్షి: నాన్న అమ్మ ఆశయానికి నువ్వే వెలుగునివ్వాలి దీపాలు వెలిగించు..


విశాల్: అమ్మని ఇక్కడే పెట్టుకొని నయని బయట వెతకడానికి సాయం చేయడం ఏంటో..


విశాలాక్షి: అంతా మంచే జరుగుతుంది నాన్న.. 


ఇంతలో నయని కాషాయి రంగు చీర కట్టుకొని విశాలాక్షి చెప్పినట్లు తడి బట్టలతోనే వస్తుంది. విశాల్ దీపాలు వెలిగిస్తాడు. 


ఎద్దులయ్య: అమ్మ చేతికి ఉసిరి దీపాలు ఇస్తే నయని మాతకు హారతి ఇచ్చి గుడికి సాగనంపుతారు.


విక్రాంత్: వదినా మీరే హారతి ఇవ్వండి మీ చేయి మంచిది.


విశాలాక్షి: వద్దు పెద్దమ్మ. మంచి జరిగినంత కాలం జనం మెచ్చుకుంటారు. వాళ్ల పొరపాట్ల వల్ల చెడు జరిగిన నింద ఎదుటి వారి మీదే వేస్తారు ఇటు ఇవ్వు..


ఎద్దులయ్య: నయని తొమ్మిది అడుగుల దూరంలో ఉండు. మనం హారతి దగ్గరకు రాకూడదు. మన దగ్గరకే హారతి రావాలి.


సుమన: శుక్రవారం తడి బట్టలతో గుడికి వెళ్తే నీ తొలి కూతురు ఎక్కడ ఉందో తెలిసిపోతుంది అంట కదా అక్క.


నయని: స్వామి వారి మాటలతో పాటు విశాలాక్షి మాటలు కూడా నాలో ఇంకా నమ్మకాన్ని పెంచాయి చెల్లి. అందుకే అమ్మవారికి ఇష్టమైన కాషాయి రంగు చీర కట్టుకొని గుడికి బయల్దేరాను.


విశాలాక్షి: భక్తురాలికి అమ్మవారే ఉసిరి దీపాల హారతి ఇచ్చి నీ కార్య దిగ్విజయం అవుగాక అని ఆశీర్వదిస్తుంది. 


వల్లభ: ఏంటి పాప అంటే ఇప్పుడు నువ్వు అమ్మవారివి అని చెప్తావా.. నిరూపించు..


ఎద్దులయ్య: నిరూపించమ్మా బాలుడు ఉబలాటపడుతున్నాడు.


విశాలాక్షి: ఎద్దులయ్య గాయత్రీని నాకు ఇవ్వు.  


డమ్మక్క: పసిపిల్లలు దేవుడితో సమానం కదా అమ్మ ఇప్పుడు దేవత అనిపించుకున్న గాయత్రీ దేవితో హారతి ఇప్పిస్తుంది. 


వల్లభ: దేవత అంటే మా పెద్దమ్మ ఈ పిల్ల కాదు..


ఇక గాయత్రీ పాపని తీసుకొని నయనికి హారతి ఇవ్వడానికి విశాలాక్షి పాపని తీసుకొని నయని దగ్గరకు వస్తుంది. ఇంతలో సుమన అమ్మవారు పూనినట్లు నటించి హారతి ఇవ్వొద్దని హారతి పళ్లెం విసిరేస్తుంది. దీంతో బియ్యం నేలపాలై ఉసిరి దీపాలు మాత్రం గాలిలో అలాగే ఎగురుతూ ఉంటాయి. అందరూ చూసి షాక్ అయిపోతారు. సుమన కూడా షాక్ అయి తనకి అమ్మవారు పూనిందన్న విషయమే మర్చిపోయి కంగుతింటుంది. ఇక వల్లభ దీపాలు నయని మీద పడవా అని అంటాడు. దీంతో విశాలాక్షి పడవు అని చెప్తుంది. అంతా అమ్మవారి దయ అని అంటుంది. 


విశాలాక్షి: నయని అమ్మ గుడికి వెళ్లడానికి బయటకి వెళ్లాక గాయత్రీ అమ్మ ఆచూకి తెలుసుకునేంత వరకు ఆ ఉసిరి దీపాలు గాలిలోనే వెలుగుతూ ఉంటాయి. 


తిలోత్తమ: నువ్వు గారడి చేశావా..


విశాలాక్షి: లేదు లేదు మీ చిన్న కోడలికి వచ్చిన చిత్తారమ్మ ప్రభావమే ఇది..


సుమన: నేను నటించానా లేక నిజంగానే అమ్మవారు వచ్చారా.. అయోమయంగా ఉందే..


విశాల్: హారతి ఇవ్వలేదు కదా నయని వెళ్లొద్దులే..


విశాలాక్షి: ఆ దీపాలను దాటుకొని నయని వస్తే సరిపోతుంది.


నయని: కళ్లకు హత్తుకొని గుడికి వెళ్లొస్తా..


ఇక విక్రాంత్ సుమన దగ్గరకు వచ్చి సుమన నటించినట్లు నటిస్తాడు. సుమన షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.