Trinayani Serial Today Episode నయని భర్త, కూతురిని తీసుకొని మణికాంత ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. విశాల్ తాము తిరిగి రాకపోతే గానవి పాపని, బిజినెస్‌లను చూసుకోమని హాసిని, విక్రాంత్‌లకు చెప్తాడు. దాంతో సుమన, వల్లభలు నిజంగానే వాళ్లు తిరిగి రారని ఫిక్స్ అయి వాటాలు గురించి మాట్లాడుకుంటారు. నయని తిరిగి వచ్చేస్తుందని తిలోత్తమ అంటుంది. దానికి నయని నేను వచ్చాను అంటే బాబుగారిని తీసుకొని వస్తానని అంటుంది.


హాసిని: మీరిద్దరూ వస్తారు అంటే గాయత్రీ అత్తయ్య కూడా వచ్చేస్తుంది.
సుమన: వెంట వెళ్లేది గాయత్రీ పాప కదా మరి గాయత్రీ అత్తయ్య అంటావేంటి. 
హాసిని: గాయత్రీ అత్తయ్యనే వస్తారు. మీరు దిగ్విజయంగా తిరిగి వచ్చేస్తే మిమల్ని చూడటానికి గాయత్రీ అత్తయ్య ఆత్మ తిరిగి వస్తుంది. అదే నేను అంటుంది.
దురంధర: అలా చెప్పవే గాయత్రీ పాపని వదిలేసి గాయత్రీ దేవి వదినను తీసుకొస్తారని అనుకున్నామ్.
హాసిని: మీరు తిరిగి వచ్చాక ఇక్కడ బలి ఉంటుంది. గాయత్రీ అత్తయ్యని చంపిన వారిని బలి తీసుకోవాలి కదా. 
 
నయని వాళ్లని ఇక అందరూ బయల్దేరమంటారు. ఇక తిలోత్తమ నయని, విశాల్, గాయత్రీ పాపలకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తుంది. బాబు గారు చేయి చాచలేనప్పడు నేను మాత్రమే చేయి కలపలేనని నయని అంటుంది. నయని, విశాల్‌లకు వద్దని పాపని షేక్ హ్యాండ్ ఇవ్వమని అంటుంది తిలోత్తమ. పాప ఆలోచిస్తుంది. ఇక ఎందుకు చేయి కలపడం లేదని తిలోత్తమ అంటే మంట వస్తుందని హాసిని  అంటుంది. అందరూ షాక్ అయి మంట వస్తుందని అంటుంది. ఇక తిలోత్తమ ఈ పాప గాయత్రీ అక్కయ్య అయితే కచ్చితంగా నా చేయి కాలిపోతుందని తిలోత్తమ అంటుంది.  ఇక పాప షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నయని, విశాల్‌ల చేతుల్ని తిలోత్తమ చేతిలో కలుపుతుంది. అందరూ పాప తెలివికి ఆశ్చర్యపోతారు. ఇక నయని గాయత్రీ దేవి ఫొటోకి వెళ్లొస్తానని చెప్పి బయల్దేరుతారు. 



నయని వాళ్లు ఓ వైపు అడవిలో వెళ్తుంటే మరోవైపు గజగండ గాయత్రీ దేవి చెప్పిన రూట్‌లో వెళ్తుంటాడు. ఇక నయని విశాల్‌తో ఆ రోజు అమ్మగారు చెప్పిన దారి ఎక్కడా లేదని కేవలం గజగండని దారి మళ్లించడానికే అలా చెప్పిందని అంటుంది. దాంతో ఇద్దరూ గజగండ దారి తప్పి ఉంటారని అనుకుంటారు. గజగండ మొత్తం తిరిగి మళ్లీ మొదటి స్థానానికే చేరుకుంటాడు. ఇక ఇదంతా గాయత్రీ దేవి ప్లానే అని అనుకుంటాడు. విశాల్ నడవడానికి ఇబ్బంది పడతాడు. నయని భర్తకి ధైర్యం చెప్తుంది. విశాల్ నడవ లేక తూలిపోతాడు. అడుగులు ముందుకు పడవు. కళ్లు తిరిగిపోతాయి. నయని భర్తని చూడకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఇక భర్త దగ్గరకు మళ్లీ వస్తుంది. ఇక విశాల్‌ నా వల్ల కాదని అనేస్తాడు. 


ఇంతలో అమ్మవారు ఓ ముసలావిడ రూపంలో నయని వాళ్ల దగ్గరకు వస్తుంది. విశాల్‌కి మాత్రం ఎవరూ కనిపించదు. ఎవరూ లేకపోతే నయని ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటాడు. ఇక నయని ఆమెకు దారి తెలుసా అని అడుగుతుంది. ఇక ఆ అవ్వ నయనికి దారి చెప్తుంది. విశాల్ మాత్రం నాకు ఎవరూ కనిపించడం లేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. నాకు మాత్రమే కనిపించి నీకు కనిపించలేదు అంటే ఆవిడ ఎవరూ అని విశాల్ అడుగుతాడు. ఇక నయని ఆమెను గుర్తు చేసుకొని ఆమె పేరు కామసాని అని గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవని కాపాడిన రాజు, రూప.. విరూపాక్షి సమస్యని పరిష్కరిస్తారా.. సూర్యప్రతాప్ భార్యని నమ్ముతాడా?