Trinayani Serial Today Episode విశాలాక్షి తన వెంట తీసుకొచ్చిన బంగారంలో రెండు గాజులను తీసుకోమని నయనికి చెప్తుంది. నయని తీసుకుంటుంది. గజగండ వచ్చాడని అనుమానం వస్తే ఆ గాజులు ధరించమని అప్పుడు నువ్వు మాయం అవుతావని విశాలాక్షి చెప్తుంది. గాజులు తీసే వరకు ఎవరికీ కనపడవని విశాలాక్షి చెప్తుంది మంత్రగాలు ఏ రూపంలో వచ్చినా కనిపెట్టగలవని అంటుంది. విశా నయనితో ఆ గాజులు భద్రంగా దాచుకో అని అంటాడు. నయని ఆ బంగారు గాజులతో పాటు మిగతా బంగారం కూడా తీసుకొని వెళ్తుంది. దురంధర విశాలాక్షి ఒంటి మీద ఉన్న నగలు చూస్తూ ఉంటుంది. హాసిని వచ్చి ఏంటి పిన్ని అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. 


విక్రాంత్: విశాలాక్షి నువ్వు అన్నీ చెప్తున్నావ్ కానీ బ్రో చేయి తగ్గడం గురించి చెప్పడం లేదు.
విశాలాక్షి: గురువు గారు చెప్పారు. గాయత్రీ దేవమ్మ కూడా చెప్పారు కదా చిన్నాన్న. అమ్మ పంచకమణి కూడా తీసుకొచ్చింది కదా మళ్లీ అడుగుతారు. పౌర్ణమికి భుజంగమణి కోసం వెళ్తావ్ కదా అమ్మ.
విశాల్: గజగండ ఏ రూపంలో వస్తాడా అని భయంగా ఉంది.
హాసిని: ఇప్పుడు గాజులు ఉన్నాయి కదా ఏం పర్లేదు.
విశాలాక్షి: ఆ గాజులు మీ అత్తయ్య వేసుకోవాలి అని తీసుకురమ్మని మీ ఆయనకు చెప్పింది పెద్దమ్మ. ఈ అమ్మ దాచి పెట్టిన గాజులు మీ ఆయన తీసుకొని వాళ్ల అమ్మకి ఇచ్చారు. 
విక్రాంత్: బంగారు గాజులు ఎత్తేసిన వాళ్లు మాయమై విశాలాక్షి తెచ్చిన బంగారం కూడా ఎత్తేయాలి అనుకుంటున్నారేమో.
విశాలాక్షి: అచ్చుగుద్దినట్లు చెప్పావు చిన్నాన్న. ఆ గాజులు వేసుకున్నా సరే మాయం అవ్వరు. అలా చెప్తే ఎవరి మనసులో ఏముందో బయట పడుతుందని అలా చెప్పాను. 
నయని: విశాలాక్షి పరీక్షించింది.
హాసిని: ఆ గాజులు వేసుకొని ఇక్కడికి అత్తయ్య వస్తుంది. 
విశాల్: కనిపిస్తారు అనే విషయం తిలోత్తమ అమ్మకు తెలీదు కదా. 


తిలోత్తమ వస్తే అందరూ అత్తయ్య కనిపించినా కనిపించనట్లు నటిద్దామని హాసిని అంటుంది. అందరూ సరే అంటారు. ఎందుకు ఇలా పరీక్ష పెట్టావని విశాలాక్షిని విశాల్ అడుగుతాడు. నిజం బయటకు రావడానికి అని విశాలాక్షి చెప్తుంది. మరోవైపు తిలోత్తమ గాజులు వేసుకుంటుంది. ఇంకా మాయం కాలేదేంటి అని అనుకుంటుంది. ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. ఈపాపని తక్కువంచనా వేయొద్దని సుమన, వల్లభ అంటారు. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది.  తిలోత్తమ ఎదురుగా ఉన్నా కనిపించనట్లు నటిస్తుంది. కేవలం వల్లభ, సుమనలతో మాత్రమే మాట్లాడుతుంది. దాంతో ముగ్గురు తిలోత్తమ కనిపించడం లేదని అనుకుంటారు. గాజులు మనం కూడా పట్టుకోవడం వల్లే అత్తయ్య మనకు కనిపిస్తుందని సుమన అంటుంది. హాసిని గాయత్రీ పాపని ఎత్తుకొని వెళ్లిపోతుంది. 



హాసిని హాల్‌లోకి వచ్చి తిలోత్తమ ఎవరికీ కనిపించడం లేదు అని అనుకుంటుందని కేవలం సుమన, వల్లభలకే కనిపిస్తుందని అనుకుంటుందని అంటుంది. హాల్‌లోకి తిలోత్తమ వాళ్లు వచ్చినా విశాల్ అమ్మ ఎక్కడుంది అని అడిగితే పని మీద బయటకు వెళ్లిందని అంటారు. సుమన, వల్లభ, తిలోత్తమలు చాలా సందడి పడతారు. ఎవరికీ కనిపించడం లేదని అనుకొని నగలు తీసుకోవాలని అనుకుంటుంది. నగల మూట దగ్గరకు వెళ్తుంది. అందరూ సినిమా చూసినట్లు చూసి లోలోపల నవ్వుకుంటారు. గాయత్రీ పాప  మాత్రం తిలోత్తమ దగ్గరకు వెళ్లి చూస్తుంది. దాంతో తిలోత్తమ ఈ పాపకి నేను కనిపిస్తున్నానా అని అంటుంది. దాంతో అందరూ మాకు కూడా కనిపిస్తున్నావ్ అని అంటారు. తిలోత్తమతో పాటు సుమన, వల్లభలు కూడా షాక్ అయిపోతారు. 


దొంగతనం చేయాలని అనుకున్న తిలోత్తమను అందరూ చీవాట్లు పెడతారు. తిలోత్తమ కోపంతో ఆ గాజులు నయనికి ఇచ్చేసి వెళ్లిపోతుంది. తిలోత్తమని అవమానించిన విశాలాక్షి అంతు చూడాలని తిలోత్తమ, సుమన ప్లాన్ చేస్తారు. నీటిలో కెమికల్ కలిపిన వాటిని విశాలాక్షి మీద వేసి తాను దురదతో గోక్కునేలా చేసి చీర ఊడిపోయి గెంతులేసేలా చేసి అవమానించాలని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఇళ్లు దాటితే చచ్చినంత ఒట్టుని లక్ష్మీతో చెప్పిన యమున