Trinayani Serial Today Episode గాయత్రీ పాపకి పెద్దబొట్టమ్మ పాము కాటేస్తుంది. గాయత్రీ పాప చేతిలో భుజంగమణి అందరూ చూస్తారు. ఇక విక్రాంత్‌కి పాము కాటేయలేదు సంతోషంగా ఉందని సుమన అంటుంది. అందరూ అలా అన్నావ్ ఏంటి అని అంటే నా భర్తకి ఏం కాకపోతే నాకు చాలు ఈ పాప చనిపోతే నాకేంటి అంటుంది. దాంతో నయని సుమనను చంపేస్తా అని వారిస్తుంది. భుజంగమణి మనకు చూపించాలని పాప ప్రమాదానికి గురైందని తిలోత్తమ అంటుంది. 


నయని పాపని పట్టుకొని పరుగెడుతుంది. బయటకు వచ్చి పెరట్లో ఏవేవో ఆకులు తెంపి పసురు పెట్టాలని అనుకుంటున్నానని అంటుంది. హాసిని పాపని పట్టుకుంటుంది. ఇక విశాల్ ఇంటికి వస్తే దురంధర, సుమనలు విశాల్‌కు విషయం చెప్తారు. గాయత్రీ పాపకు పాము కాటేసిన చోట నయని పసరు వేస్తుంది. విశాల్ వచ్చి పాపని పట్టుకుంటాడు. పాము జోలికి పాప ఎందుకు వెళ్లిందని విశాల్ అడుగుతాడు. 


తిలోత్తమ: భుజంగమణి టేబుల్ కిందకి వెళ్లినట్లు ఉంది. చిన్నపిల్ల చూసి తీసుకోవాలి అనుకుంది. 
నయని: పాపం గాయత్రీ మణి అక్కడే ఉందని చెప్పింది కూడా కానీ ఎవరికీ అర్థం కాలేదు.
సుమన: అప్పటికీ మా ఆయన వంగి చూశారు కూడా. అక్కడే పాము రూపంలో పెద్దమ్మ ఉందని ఎవరికి తెలుసు.
విశాల్: పెద్దబొట్టమ్మ కుట్టిందా. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం నయని.
నయని: పర్వాలేదు బాబుగారు పాప మెలకువ గానే ఉంది కదా పైగా కాటేసిన చోట నొప్పిని కూడా ఓర్చుకుంది ఏం కాదు బాబుగారు. 
తిలోత్తమ: భుజంగమణిని విడవకుండా ఎలా పట్టుకుందో చూశారా. పట్టు వదలదు అనుకుంటా. 
విశాల్: మనసులో అమ్మ కాబట్టి ఇలా మొండిగా ఉండగలిగింది అదే వేరే ఎవరైనా అయితే ఘోరం జరిగిపోయేది.
దురంధర: ఏం మణో ఏంటో అమ్మా దీని కోసం అందరూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు ఆ పంచకమణిని సొంతం చేసుకొని రెండింటినీ కలిపి మానసాదేవి ఆలయంలో పెట్టు నయని.
నయని: అదే చేయాలి.
హాసిని: ముందు ఆ గజగండ అంతు చూసి పంచకమణి తీసుకురావాలి చెల్లి.
సుమన: అంత చీఫ్‌గా ఇచ్చేస్తాడా.
విశాల్: ఇవ్వకపోతే అమ్మవారే వాడి అంతు చూస్తుంది. 
తిలోత్తమ: గజగండ ఆ మణి ఇవ్వాలి అన్నా గాయత్రీ పాప ఈ విపత్తు నుంచి బయట పడాలి అన్నా అమ్మవారే దిక్కు.


ఉదయం సుమన, విక్రాంత్, హాసినిలు ఫైల్స్ చెక్ చేస్తుంటారు. విశాల్ గాయత్రీ పాపని నిద్రపుచ్చుతుంటాడు. తిలోత్తమ వాళ్లు కూడా హాల్‌లోకి వస్తారు. ఇంతలో లలితాదేవి అక్కడికి వస్తుంది. అందరూ లలితాదేవికి కుశల ప్రశ్నలు వేస్తారు. విశాల్ గాయత్రీ పాపని తన పెద్దమ్మకి చూపిస్తుంది. పాము కాటుని కూడా ఎలా భరించగలిగావ్ పాప అని లలితాదేవి అడిగితే భుజంగమణి ఉండటం వల్లే అని సుమన అంటుంది. భుజంగ మణిని పట్టుకోవడం వల్లే గాయత్రీ పాపకి ప్రాణాపాయం తప్పిందని లలితాదేవి అంటుంది. నమ్ముకున్న వారిని విశాలాక్షి అమ్మవారు కాపాడుతుందని లలితాదేవి అంటుంది. 


తిలోత్తమ: ఎవరికైనా ఆపద వస్తే నీకు ముందే తెలుస్తుంది కదా నయని మరి గాయత్రీ పాపకి ఆపద వస్తే గ్రహించలేదెందుకు.
సుమన: నిజమే కదా. 
విక్రాంత్: కరెక్టే కదా వదిన అందరినీ కాపాడే మీరు గాయత్రీ పాప విషయంలో ఎందుకు గ్రహించలేకపోయారు.
విశాల్: అనుకోకుండా జరిగిన సంఘటన ఇది.
లలితాదేవి: కాదు తనకైనా తన బిడ్డలకు అయినా ప్రమాదం వస్తే నయని గుర్తించలేదు.
సుమన: మీరు అన్నదాని ప్రకారం గాయత్రీ పాపని మా అక్క కన్నది అంతే కదా.
నయని: ఇది నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. గాయత్రీ పాప విషయంలో ఇంతకు ముందు ఇలాగే జరిగింది.


అందరి అనుమానాలకు తెర దించాలంటే ముందు మానసాదేవికి పూజ చేయాలని భుజంగమణి అమ్మవారి ముందు పెట్టి పూజించాలని ఈ విషయం కూడా అమ్మవారిని అడిగితే తెలుస్తుందని లలితాదేవి అంటుంది. అమ్మవారి పూజ త్వరగా చేయమని అంటుంది. నయని అరగంటలో పూర్తి చేస్తామని అంటుంది. అందరూ పనుల్లో నిమగ్న అయిపోతారు. ఇక లలితాదేవి నయని వాళ్లతో మాట్లాడుతుంది. ఇక వల్లభ కొత్త చీరలు పట్టుకొని వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ముందు బయటపడ్డ మనీషా బండారం.. జానుతో పెళ్లికి వివేక్ ఏం చేయనున్నాడు?