Trinayani Serial November 17th Episode: తిలోత్తమ అఖండ దీపం తీసుకొని వస్తుంది. దేవుడు దగ్గర పెడుతుంది. వల్లభ: లక్ష్మీ దేవి దగ్గర దీపారాధన చేశాక పెద్ద మరదలు నయని భక్తికి మెచ్చి దీపాలు వాటంటత అవే అతుక్కుంటే ఎంత బాగుంటుందో కదా తిలోత్తమ: అలా ఎలా జరుగుతాయిరా అద్భుతాలు అడగగానే జరగాలి అంటే కుదరదువిక్రాంత్: బ్రో లేనిపోని కోరికలు కోరుకోవద్దుసుమన: అలా ఎందుకు అనుకుంటారు మా అక్క పరమశివుడి భక్తురాలు కాబట్టి జరిగినా జరగొచ్చునయని: మీమాటలకు ఏం కానీ దీపారాధన చేసి టపాసులు కాల్చుదాం పిల్లలు సరదా పడతారు

ఇక సుమనకు అందరూ ఉలూచీని తీసుకురమ్మాంటారు. తాను భయం అని తీసుకురాను అని చెప్తుంది. ఇక పూజ అయ్యాక నయని అందరికీ హారతి ఇస్తుంది. మరోవైపు తిలోత్తమ, సుమన, వల్లభ వాళ్లు దీపాలు వాటంతట అవే వెలిగే వరకు వేచి చూద్దాం అంటారు. దీంతో డమ్మక్క నయనికి కాకరపువ్వును అమ్మవారి దేవుడి దగ్గర వెలిగించి పట్టుకోమంటుంది. ఎవరు వచ్చినా కాకరపువ్వు ఇవ్వు అని చెప్తుంది. మరోవైపు అందరూ ఏ దేవుడు వచ్చి దీపాలు వెలిగిస్తారో చూద్దాం అని అంటారు. సుమన: ఎవరు వస్తారో తెలీదు. మనిషి కాదు అంటారు. దీపాలు వాటంతట అవే వెలుగుతాయి అంటున్నారు. అసలు ఏం జరగబోతుందిహాసిని: అద్భుతం చిట్టీ అలా చూడు వస్తున్నారు నాగయ్య అని పామును చూపిస్తుంది. ఇక పాము వచ్చి దీపాలను వెలిగిస్తుంది. అందరూ షాక్ అవుతారు. హాసిని: డమ్మో డమ్మ ఎలా ఉంది అమ్మ బొమ్మపావనామూర్తి: నేను ఈ అద్భుతాన్ని పై నుంచి చూడాలి నన్ను ఎత్తుకో విశాల్ బాబు అంటే విశాల్ పావనామూర్తిని ఎత్తుకుంటే పాము దీపాలు వెలిగించడాన్ని చూస్తారు. బతికుండగానే భగవంతుని దర్శనం అయిందని పావనా మూర్తి సంతోషిస్తాడు. అదేంటి అమ్మ నాగయ్య ప్రమిదలు అన్నీ వెలిగించాడు కానీ అక్కయ్య తెచ్చిన అఖండ దీపం వెలిగించలేదుసుమన: భయమేస్తుందేమో చిన్న చిన్న దీపాలు వెలిగించింది కానీ పెద్ద దీపం వెలిగిస్తే మూతి కాలుతుందని ఆగిపోయింటుందినయని: లేదు లేదు నాగయ్య వెలిగించకపోవడానికి కారణం ఉంటుంది విశాల్: మరి నాగయ్య వెలిగించకుండా ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడుతిలోత్తమ: అందరూ నాకు అడుగుతున్నారు ఎందుకుహాసిని: మూకుడు తెచ్చిందే మీరు కనుకసుమన: అక్క ఇందాకైతే సరదాగా దీపాలు వాటికవే వెలుగుతాయేమో చూద్దాం అనుకున్నాం. ఇంతలో నాగయ్య వచ్చి దీపాలు వెలిగించాడు. కానీ ఇప్పుడు అత్తయ్య తెచ్చిన దీపాలు వెలిగించలేదు అంటే దాని అర్ధం అత్తయ్య ఏమైనా చేసింది అనా. నయని: నేనేం అనలేదేతిలోత్తమ: నువ్వు అనవు నయని అందరూ అన్నా కూడా చూస్తూ ఉంటావువల్లభ: అమ్మా నువ్వే ఆ దీపం వెలిగించు నయని: ఆగండి అత్తయ్య ఆ అఖండ దీపం తెచ్చింది మీరైనా వెలిగించాల్సింది మా చెల్లి. (తిలోత్తమ దీపం సిద్ధం చేయడం చాటుగా చూసిన సుమన ఆ దీపంలో  నువ్వుల నూనె బదులు విస్పోటనం అయ్యే నూనె పెడుతుంది. దీపాల దగ్గర ఉండే నయనికి ప్రమాదం జరగాలని అలా చేస్తుంది )

అది గుర్తొచ్చి సుమనను ఎందరు పిలిచినా వెళ్లడానికి వెనకడుగు వేస్తుంది. ఇక హాసిని నేను వెలిగిస్తా అని చెప్తే నయని వద్దు అంటుంది. ఇంతలతో నాగయ్య ఆ దీపాన్ని విసిరి ఆ విస్పోటనం నూనెను సుమన మీదకు విసిరేస్తుంది. దీంతో నయని నాగయ్య మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. పాము వెళ్లిపోతుంది. 

తిలోత్తమ: అఖండ దీపం వెలిగించకుండా చేసింది ఆ పాము. దానికి అంత చనువు ఇస్తే ఇలానే చేస్తుందిసుమన: ముందు మా అక్కను అనాలి అని అంటే నయని సుమనను చెంప దెబ్బ కొట్టి జుట్టు పట్టుకొని నయని: సుమనతో మెల్లగా ఎప్పుడైతే అత్తయ్య అఖండ దీపం పట్టుకొని ముందుకు వచ్చిందో అప్పుడు తనకి మంటలు అంటుకున్నట్లు నాకు కనిపించింది. అప్పుడు నీలో భయం చూశా నువ్వు ఏదో చేశావ్ అని అర్థమైంది. అందుకే నువ్వు ముందుకు రాలేక పోయావ్. ఇక సమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ ఏదో జరిగింది అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.