Gruhalakshmi Serial November 17th Episode: దీపక్ తన తల్లిని కాపాడుకోవాలని డాక్టర్‌ను చాలా బతిమాలుతాడు. డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ చేయడం కుదరదు అని డాక్టర్ చెప్పేస్తుంది. ఆపరేషన్ చేయండి డబ్బు కట్టాకే పేషెంట్‌ను తీసుకెళ్తామని దీపక్, శ్రావణి వేడుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లమని డాక్టర్ చెప్తుంది. ఇక దీపక్ అంబులెన్స్ అయినా ఏర్పాటు చేయమని డాక్టర్‌ను వేడుకుంటారు.
ఇక శ్రీనివాస్ ఇంటికి ఆర్కే, తులసి, నందూ వస్తారు. శ్రీనివాస్ గారు తులసిని పొగుడుతారు. ఇక శ్రీనివాస్ గారు ఆర్కేతో డీల్ క్యాన్సిల్ చేసుకుంటాడు. తులసి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలు దేరుతుంది.
మరోవైపు తులసి తల్లి చనిపోయిందని బ్యాడ్ న్యూస్ డాక్టర్ శ్రావణితో చెప్తారు. అది తెలీక దీపక్ వచ్చి అంబులెన్స్ రెడీగా ఉంది అమ్మని బతికించుకుందాం అని అంటాడు. దాంతో శ్రావణి ఏడుస్తూ మనకంటే ముందు అత్తయ్య చనిపోయారని ఏడుస్తుంది. దీపక్‌కు డాక్టర్ సారీ చెప్పి వెళ్లిపోతుంది. దీపక్ అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తాడు. మరో వైపు ఈ విషయం తెలీక తులసి చాలా సంతోషంగా ఉంటుంది.
తులసి: సీఈవో అయ్యాక నేను సాధించిన మొదటి విజయం ఇది. కంపెనీ వేరే వాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడగలిగాను. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజు
నందూ: మనసులో.. నీకే కాదు తులసి నాకు కూడా ఇది మరచిపోలేని రోజుగా ఉండాలని అనుకుంటున్నాను. మనం ఇక ముందు కలిసిపోయి మళ్లీ జీవితం సంతోషంగా గడిపేందుకు నిన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాను.
తులసి: నా ఫోన్ ఒకసారి ఇవ్వండి. నేను ఏం సాధించినా వెంటనే మా అమ్మకు చెప్పుకోవడం నా అలవాటు వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను.
నందూ: మనసులో.. ఇలాంటి టైంలో తులసి వాళ్ల అమ్మతో మాట్లాడితే తాను నా గురించి అడుగుతుంది. దూరంగా ఉండమని సలహా ఇస్తుంది. సో ఫోన్ తులసికి ఇవ్వకూడదు. తులసి నాదో చిన్న రిక్వెస్ట్.. ఈ హ్యాపీ అకేషన్‌ను మనం సెలబ్రేట్ చేసుకుందాం. పార్టీ అయ్యే వరకు మన ఫొన్‌లను స్విఛ్ ఆఫ్ చేసుకుందాం
తులసి: సరే.. మా అమ్మతో అక్కడికి వెళ్లాక మాట్లాడుతా.. రెండు రోజులు మా అమ్మతో కలిసి ఉంటాను. దిగులుగా ఉంది.
నందూ: అప్పుడు రెండు శుభవార్తలు మీ అమ్మకు చెప్పొచ్చు
తులసి: ఒక శుభవార్త నాకు తెలుసు ఇంకోటి ఏంటి.. నెమ్మదిగా నీకే తెలుస్తుంది అని తులసిని తీసుకొని బయటకు వెళ్తాడు.
మరోవైపు గుండెలు పగిలేలా దీపక్ ఏడుస్తాడు. తులసి అత్తామామలు అక్కడికి వస్తారు.
దీపక్: వెళ్లిపోయింది మామయ్య మా అమ్మ నన్ను వదిలి వెళ్లి పోయింది. ఈ అసమర్ధుడైన కొడుకును వదిలేసి వెళ్లిపోయింది. అక్క దగ్గర ఉండిఉంటే అమ్మని బతికించుకునేది
శ్రావణి: ఎప్పుడూ ఊరు వదిలి వెళ్లిని వదిన అత్తయ్య చావుకోసం అన్నట్లు వెళ్లింది
దీపక్: కనీనం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయింది
పరందామయ్య: తులసి ఎప్పుడూ సెల్ స్విఛ్ ఆఫ్ చేయదు. ఎందుకిలా జరిగిందో
అనసూయ: ఇది మీ అమ్మ దురదృష్టమో లేక తులసి దురదృష్టమో.. చావు రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ తప్పించలేరు అది కళ్ల ముందు కనపడుతుంది.
ఇక పరందామయ్య దివ్యకు ఫోన్ చేస్తాడు. మీ అమ్మమ్మ చనిపోయింది అని చెప్తాడు. దివ్య షాక్ అవుతుంది. వెంటనే బయలు దేరివస్తామని చెప్పి బయలు దేరుతారు. తన తల్లిని తానే చంపేసుకున్నానని దీపక్ గట్టిగా ఏడుస్తాడు. పరందామయ్య తనని సర్దిచెప్తాడు.
శ్రావణి: చివరి నిమిషం వరకు వదిననే తలచుకున్నారు. కానీ ఇప్పుడు వదిన పక్కన లేకుండాపోయింది అదే నా బాధ అండి
అనసూయ: కన్నపిల్లలు పక్కన ఉండాలి అని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఆ అదృష్టం అందరికీ దక్కదమ్మ. ఎవరికి వారే యమునా తీరే. విషయం తెలిసి అందరూ దీపక్ ఇంటి దగ్గరకు వస్తారు.
మరోవైపు నందూ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి తులసికి తన మనసులో మాట చెప్పాలి అనుకుంటాడు. ఇక తులసి వచ్చి ఆ ఏర్పాట్లకు ఫిదా అయిపోతుంది. ఇక భవిష్యత్‌లో మనం ఇలాగే ఫ్రెండ్స్‌గా ఉందామని తులసి నందూతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
తరువాయి భాగంలో: తులసికి వాళ్ల అమ్మ చనిపోయింది అన్న విషయం తెలుస్తుంది. దీంతో పరుగు పెట్టుకుంటూ స్మశానానికి వెళ్లి కాలుతున్న తన తల్లి శవం వద్ద పెద్దగా ఏడుస్తుంది.