Trinayani Serial Today Episode త్రినేత్రి తన అత్తామామలతో కలిసి అడవిలోని అమ్మవారిని దర్శించుకుంటుంది. ముక్కోటి, వైకుంఠం అమ్మవారి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తారు. ఇక తాము విషం కలిపిన నైవేద్యం అమ్మవారికి పెడతారు. ఇక త్రినేత్రి విషం కలిసున్న నైవేద్యం తినేస్తుంది.  ముక్కోటి, వైకుంఠం చాలా సంతోషిస్తారు. మరోవైపు యమపాశం త్రినేత్రి ప్రాణం తీయడానికి ప్రయాణిస్తూ త్రినేత్రి వైపు వస్తుంటుంది.


ఇక ఇంట్లో త్రనేత్రి బామ్మ చేతిలో ఉన్న పసుపు కుంకుమలు కింద పడిపోతాయి. దాంతో త్రినేత్రికి తెలిస్తే తిడుతుందని కంగారు పడుతుంది. త్రినేత్రి ప్రసాదం బాగా చేశావ్ అత్త అని లొట్టలేసుకొని తింటుంది. ఇంతలో త్రినేత్రి విష ప్రభావంతో గొంతు పట్టుకొని విలవిల్లాడిపోతుంది. అమ్మవారి కాళ్ల దగ్గరే నేలకొరిగిపోతుంది. అత్తా అత్తా అని త్రినేత్రి అంటుంది. ఇంతలో యమపాశం వచ్చి త్రినేత్రి ఆత్మని అమ్మవారిలో ఐక్యం చేస్తుంది. త్రినేత్రి చనిపోయిందని ముక్కోటి ఊపిరి చూసి చనిపోయిందని దొంగ ఏడుపు మొదలు పెడతాడు.


ముక్కోటి: అమ్మా త్రినేత్రి ఇంత చిన్న వయసులోనే నీకు నీరేళ్లు నిండిపోయా ఇదిగో వైకుంఠం ఇలా గుండెలు బాదుకొని ఏడ్చే అవసరం కూడా మనకు రాకూడదు. అమ్మవారి కోసం కార్తీక్ మాసంలో ప్రత్యేకంగా పూసే ఎర్ర జిల్లేడు పూల కోసం కారడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని చెప్దాం సరేనా. అని త్రినేత్రి డెడ్ బాడీని తీసుకెళ్లి ఓ చోట పెట్టేసి వెళ్లిపోతారు. 


మరోవైపు విక్రాంత్ డాక్టర్‌తో నయని గురించి అడుగుతాడు. నయని వదిన కోమాలోకి వెళ్లిందని నిజం ఎవరికీ చెప్పను అని అంటాడు. మీరు వదిన కండీషన్ మా బ్రోకి చెప్తే తట్టుకోలేడని అసలు కళ్లు తెరుస్తుందో లేదో అనే బాధతో తన ప్రాణాలు తీసుకుంటాడని అందుకని తన అన్నకి అబద్ధం చెప్పమని విక్రాంత్ డాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తాడు.  



విక్రాంత్: నిజాన్నే కాదు డాక్టర్ మా వదినను కూడా మీరు దాచిపెట్టాలి. మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్దాం. ఇప్పుడున్న హాస్పిటల్‌లో వదినను ఉంచొద్దు నాకు మీకు తప్పు ఎవరికీ తెలీకూడదు. తను కోమా నుంచి వచ్చేవరకు ప్లీజ్ డాక్టర్ ఈ సాయం చేయండి.
డాక్టర్: చాలా రిస్క్ విక్రాంత్
విక్రాంత్: ప్లీజ్ డాక్టర్ కోమాలో ఉన్న వదినను అన్నయ్యకి చూపించి తన ప్రాణాలు తీయలేం
ముక్కోటి: వైకుంఠం మనం పేరంటాలకు వచ్చామా త్రినేత్రి అదృశ్యం అయిపోయింది కదా.
వైకుంఠం: అమ్మా అమ్మా ఘోరం జరిగిపోయిందే. అమ్మా ఎక్కడున్నావే. 
బామ్మ: అవును ముగ్గురు వెళ్లి ఇద్దరు వచ్చారు త్రినేత్రి ఎక్కడ.
వైకుంఠం: ఇంకెక్కడ అమ్మ పోయింది.
బామ్మ: పోయింది అంటే
వైకుంఠం: అమ్మవారికి అడవి పూలు తీసుకొస్తానని లోపలికి వెళ్లిపోయింది తిరిగి రాలేదమ్మా ఏ పులో తీసుకెళ్లిపోయిందనుకుంటా. అక్కడక్కడా పచ్చి నెత్తురు మరకలు కనిపించాయమ్మ


బామ్మ కళ్లు తిరిగి పడిపోతుంది. నీళ్లు వేసి వైకుంఠం లేపితే తల బాదుకొని బామ్మ ఏడుస్తుంది. అమ్మోరిని నమ్ముకున్న బిడ్డ అన్యాయం అయిపోయిందా అని ఏడుస్తుంది. మరోవైపు విశాల్ గాయత్రీ పాపని పడుకోపెడుతుంటారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. పాప ఏం తినడం లేదని విశాల్ చెప్తే గత జన్మలో తన కోడలు కదా అందుకే ఆ మాత్రం బాధగా ఉంటుందని తిలోత్తమ అంటుంది. ఇంతలో విక్రాంత్ వస్తాడు. నయనికి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్‌కి మార్చుతున్నారని అంటాడు. కళ్లు తెరవని అక్క కోసం మనం వెళ్లడం ఎందుకని సుమన అంటుంది. విశాల్ మాత్రం నేను వెళ్తాను అంటే విక్రాంత్ వద్దని అంటాడు. నేనే చూసుకుంటాను ఎవరూ రావొద్దని విక్రాంత్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!