Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్యకి అనసూయ డ్రెస్ వేసి స్కూల్‌కి జడలు వేస్తుంటుంది. ఇక కాంచన బ్యాగ్‌లో పుస్తకాలు సర్దుతుంది. ఇక గదిలో దీప బెడ్ మీద పడుకోవడం లేదని కింద పడుకుంటుందని చెప్తుంది. ఇక అనసూయ దీప రావడంతో నడుం నొప్పిగా ఉంది నాకు చాప కావాలని అంటుంది. దాంతో దీప శౌర్యని కోపంగా చూస్తుంది.


కాంచన: శౌర్య నీకు స్కూల్‌కి టైం అయింది వెళ్లి కార్తీక్‌కి పిలువు స్కూల్‌కి తీసుకెళ్తాడు.
 పారిజాతం: పోనీ నువ్వు తీసుకెళ్లు. 
కాంచన: నువ్వు ఎందుకు వచ్చావ్ పిన్ని. 
పారిజాతం: నీకు కాస్త కనువిప్పు కలిగిద్దామని. 
కాంచన: రిసెప్షన్‌లో నువ్వు నిన్న చేసింది చాలు ఇక్కడ ఎవర్ని ఏం అంటే ఊరుకోను.
పారిజాతం: విన్నావా దీప నిన్ను ఏమైనా అంటే మీ అత్త ఊరుకోదట. నా మనవరాలు ఉండాల్సిన ఇంట్లో నువ్వు నీ అత్త  చేరి మా వాళ్లతో మమల్నే గెంటించేస్తున్నావ్. బంగారం లాంటి మేనకోడలిని పెట్టుకొని ఈ రెండో పెళ్లి దాన్ని ఎలా కోడల్ని చేసుకున్నావ్. నీ మేనకోడలిని ఈ వంట మనిషి కొడితే ఎలా చూస్తూ ఉన్నావ్ కాంచన. ఈ దీపకి అంటే కృతజ్ఞత లేదు. నీ కొడుకుకి నీ కుటుంబానికి మీ అన్నయ్య ఎంత సాయం ఉన్నాడో అది కూడా మర్చిపోయావా. నువ్వు కూడా అవకాశ వాదిగా మారిపోయావా. 
కాంచన: పిన్ని..
పారిజాతం: ఈ పెళ్లే ఓ దరిద్రం అనుకుంటే మళ్లీ పది మందికి చెప్పడానికి రిసెప్షన్ ఇంకా దరిద్రం. నీ భర్తని సవతిని పిలవడం ఇంకా దరిద్రం. నీకు కాలుతో పాటు బుర్ర కూడా పనిచేయడం మానేసినట్లుంది.
కార్తీక్: పారు. ఇంకొక్క మాట నీ నోటి నుంచి మా అమ్మ గురించి వస్తే వయసులో పెద్ద దానివి అని కూడా చూడను. 
పారిజాతం: నీ పెళ్లాన్ని సమర్ధించుకోవడానికి ఎన్ని అయినా చెప్తావ్.
కార్తీక్: సమర్దించుకోవడానికి నేనేం తప్పు చేయలేదు. ఏడేళ్ల కొడుకు ఉన్న నిన్ను తాత పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు నేను ఆరేళ్ల కూతురున్న దీప మెడలో తాళి కట్టడం తప్పు ఎలా అవుతుంది. నీకు రెండో జీవితం ఉన్నప్పుడు దీపకు ఉండొద్దా. 
పారిజాతం: మీ తాత నన్ను దొంగచాటుగా పెళ్లి చేసుకోవడం లేదు. నా మెడలో తాళి చట్టబద్ధంగా పడింది. మరి దీప మెడలో ఎలా పడింది. నా పెళ్లికి సమాజంలో గుర్తింపు ఉంది దీపకి ఉందా. సమాజం మొత్తం నాలాగే ఆలోచిస్తారు.
కార్తీక్: ఎవరు ఏం ప్రశ్నించినా నేను సమాధానం చెప్పుకుంటా నువ్వు బయల్దేరు. 
పారిజాతం: ఏదో ఒక రోజు దీని అసలు రంగు మీకు తెలుస్తుంది అప్పుడు మీరే దాన్ని గెంటేస్తారు.
కాంచన: పిన్ని నువ్వు వెళ్లిపో ఇక్కడ నుంచి. 


అనసూయతో చెప్పి కాంచన పారుని గెంటేయంటే మొగుడిని గెంటేశావ్ నన్ను గెంటేయడం ఒక లెక్కా అని పారిజాతం అంటుంది. ఇక అనసూయ కూడా గెంటేస్తా అంటుంది. కార్తీక్ అందరూ పారిజాతాన్ని గెంటేస్తా అంటాడు. కార్తీక్ దీపలు భార్యభర్తలు కలిసే బతుకుతారని నీ మనవరాలికి చెప్పమని అంటాడు. ఇక దీప శౌర్యని డ్రాప్ చేస్తానని అంటుంది. ఇక శౌర్య కార్తీక్‌కి ముద్దు పెడుతుంది. దీప ఆటోలో తీసుకెళ్తే లేటు అవుతుందని నేనే తీసుకెళ్తానని తీసుకెళ్తాడు. మరోవైపు దీప జ్యోత్స్నని కలుస్తుంది.


జ్యోత్స్న:  నా మెడలో కట్టుకోవడానికి తాళి కావాలి దీప. డబ్బు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు. అందుకే నిన్ను పిలిచాను. నాకు నీ మెడలో తాళి కావాలి. ఎంతకి ఇస్తావ్. ఏంటి ఆ కోపం ఫ్రీగా ఏం కాదు. ఇది మా కంపెనీ బ్లాంక్ చెక్ ఇందులో మా డాడీ సంతకం కూడా ఉంది. పెళ్లికి నచ్చిన కారు కొనుక్కోమంటే పెళ్లి జరగలేదు కదా అందుకే నేను వాడుకోలేదు. నీ లాంటి వాళ్లు డబ్బు కోసమే మా బావని ట్రాప్ చేస్తారు.. నువ్వేం కష్టపడొద్దు నీకు ఎంత కావాలో నేను అంత ఇస్తా. నీ మెడలో తాళి నాకు ఇచ్చేయ్. నువ్వు వెళ్లిపో నేను శౌర్యకి తల్లిని అవుతా. శౌర్యకి తండ్రి మారినట్లు తల్లి కూడా మారొచ్చు కదా. నువ్వు నా బావని నాకు ఇస్తే నేను నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా. నువ్వు మళ్లీ జీవితంలో కనిపించొద్దు. ఈ డీల్ నీకు ఓకేనా.
దీప: ఓకే జ్యోత్స్న. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న విద్యాదేవి.. మహాలక్ష్మీ అంతు చూడటానికి చేతులు కలిపిన అత్తాకోడళ్లు!