Trinayani Serial November 14th Episode : సుమన తాను తెచ్చిన ఇనుప పెట్టెను లక్ష్మీ దేవి దగ్గర పెట్టి తెరుస్తుంది. ఆ పెట్టె నిండుగా డబ్బును చూసి అందరూ షాక్ అవుతారు. ఇంత డబ్బు ఎక్కడిది అంటూ అందరూ ప్రశ్నిస్తారు. 


నయని: ఈరోజు నీకు ఇంత సొమ్ము ఎలా వచ్చింది అని అడుగుతున్నామ్ సుమన.


సుమన: 3 కోట్లు పెట్టి కొన్న నగలను ఇప్పటికే అమ్మవారి దగ్గర పెట్టాను. మిగతా 7 కోట్లను అకౌంట్ నుంచి డ్రా చేశాను. 


లలితా దేవి: అంత డబ్బు డ్రా చేసి ఏం చేద్దామని


సుమన: ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు పెద్దత్తయ్య గారు మీలా చీపురు, ఉప్పు తెచ్చి ధన త్రయోదశిని మమ అనిపించడం నాకు ఇష్టం లేదు. 


లలితా దేవి: నీ ఆస్తి బలుపు ఎంతో చూపిద్దామని ఇలా చేశావ్ అని అర్థమవుతుంది. 


గురువు గారు: సుమన రంగు పేపర్లతో ఎప్పుడూ ఆటలాడుకోవద్దు అది ఎన్నటికి మంచిది కాదు. 


సుమన: ఇవి కలర్ పేపర్స్ కాదు గురువుగారు. పాపం పూజలు చేసుకునే మీకు ఈ విషయం తెలీయదు అనుకుంటా..


నయని: సుమన పెద్దా చిన్నా అనే తేడా లేకుండా మాట్లాడితే పళ్లు రాలతాయి. 


లలితా దేవి: నయని పండగ పూట చేయి చేసుకోకు


తిలోత్తమ: పెద్దక్కయ్య చెప్పినట్లు పూజ మాత్రమే చేద్దాం 


విశాల్: ఏదేమైనా ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదు సుమన


ఇక అందరూ సుమన చేసిన పనికి తిడతారు. గర్వంతో ఇలా చేయడం సరికాదు అంటారు. ఇంతలో విశాల్ అమ్మవారికి హారతి ఇవ్వమంటాడు. ఇక సుమన అయితే ఎక్కువ డబ్బు అమ్మవారి దగ్గర తానే పెట్టాను కాబట్టి తానే హారతి ఇస్తా అంటుంది. సుమన హారతి ఇస్తున్నప్పుడు నిప్పు పడి పెట్టెలోని డబ్బు అంతా కాలి బూడిద అయిపోతుంది. సుమన షాక్ అయి నా డబ్బు నా డబ్బు అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఇంట్లో వాళ్లు తనని వద్దని అడ్డుకుంటారు. లలితాదేవి, గురువుగారు బుద్ధి చెప్తారు. సుమన తన రూమ్‌లో కూర్చొని ఏడుస్తుంది. విక్రాంత్ వచ్చి సెటైర్లు వేస్తాడు.  


మరోవైపు వల్లభ కాలిపోయిన డబ్బు  బూడిదను తన తల్లి తిలోత్తమ  దగ్గరకు తీసుకొస్తాడు. అయితే దాన్ని చూడగానే తనకు ఓ కొత్త ఆలోచన వచ్చిందని తిలోత్తమ చెప్తుంది. సుమన 7 కోట్ల రూపాయలు పోయాయని.. తన దగ్గరకు ఇప్పుడు వెళ్లి మొసలి కన్నీళ్లు కారిస్తే మిగతా 3 కోట్లతో కొన్న నగలు ఇచ్చేస్తుందని చెప్తుంది. ఏదొకటి చేసి నయని అడ్డు తొలగించుకుంటే సుమన, హాసని తన గుప్పెట్లో ఉంటారని చెప్తుంది. 


సుమన ఓ మూల కూర్చొని ఏడుస్తుంటే మిగతా ఇంటి సభ్యులంతా పూజకు ఏర్పాటు చేస్తారు. ఇక హాసిని తిలోత్తమ మీద సెటైర్లు వేస్తే వల్లభ పెద్దత్తయ్య ఉందని ఇది ఇలా చేస్తుంది అంటాడు.  


లలితాదేవి: ఏంట్రా నేను ఉన్నంత వరకేనా మీ భయం. మా చెల్లి గాయత్రి దేవి బతికి ఉన్నంత వరకు మీ అమ్మతో సహా అందరూ భయపడుతూనే ఉండేవాళ్లు


తిలోత్తమ: కాలధర్మం చేశాక ఇంటి బాధ్యతలు తీసుకోవాలని కదా పెద్దక్కయ్య 


గురువుగారు: కాలధర్మం అంటే కనీసం 60 ఏళ్లు అయినా బతకాలి కదా తిలోత్తమ 30 ఏళ్లు అయినా బతకనివ్వలేదు 


హాసిని:  ఎవరూ మా అత్తయ్య బతకనివ్వలేదా.. క్షమించండి.. సవతి పోరు కదా అని అలా అనేశాను అపార్థం చేసుకోకండి. 


విశాల్: మనసులో.. మా అమ్మను చంపిన రాక్షసి నన్ను పెంచి పెద్ద చేసింది. తిట్టిందో కొట్టిందో కానీ ఇంటికి యజమానురాలు అయింది. మా అమ్మ స్థానంలో కూర్చొన్న ఈమెను నేను క్షమిస్తాను ఏమో కాని మా అమ్మ మాత్రం క్షమించదు. 


డమ్మక్క: అందరూ మాట్లాడుతున్నారు కానీ సుమన మాత్రం ఏం అనడం లేదు  


లలితాదేవి: డబ్బు కాలితే కాలింది కానీ మనసు మాత్రం కాల్చుకోకూడదు సుమన


సుమన: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను పెద్దత్తయ్య గారు కానీ నాదో ధర్మ సందేశం.. హారతి పళ్లెంలో నుంచి వెలిగే కర్పూరం జారిపడి ఏడు కోట్లు కాలిపోయాయి. ప్రత్యక్ష సాక్ష్యం మీరందరూ ఇప్పుడేమో ఎందుకు ఇన్ని దీపాలు వెలిగిస్తున్నారు ఎందుకుని ప్రశ్నిస్తుంది. ఇంతలో వల్లభ గట్టిగా నవ్వుతాడు. దానికి లలితా దేవి సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.