Trinayani Today November 11th Episode : తిలోత్తమ, వల్లభ ఇద్దరూ పెట్టె దగ్గరకు వస్తారు. తాళపత్రలు చదవాలని బూతద్దం పట్టుకొని వచ్చి చదవడానికి ప్రయత్నిస్తారు. అయితే గాయత్రి పాప వారిని చూసి కర్టెన్ లాగితే అది తిలోత్తమకు తగిలి కుయ్యో మెర్యో అంటుంది. దీంతో ఇంటి సభ్యులంతా అక్కడికి వస్తారు. గరువుగారు కూడా వస్తారు. ఎద్దులయ్య, డమ్మక్కలకు ఎవరి వల్ల జరిగింది గాయత్రీ వల్లేనా అని అడుగుతారు. అవునని వారు చెప్తారు. ఇక ఆ పాప కర్టెన్ లాగడం వల్లే ఇదంతా జరిగిందని వల్లభ చెప్తే తిలోత్తమ పాపను తిడుతుంది. విశాల్ ఆమెకు అడ్డుపడతాడు. చిన్న పిల్లమీద అంత అక్కసు ఎందుకని మండిపడతాడు. అయితే తిలోత్తమ తాళపత్రాలు చదవాలని ప్రయత్నించిందని అందరూ చివాట్లు పెడతారు.
గురువుగారు: తిలోత్తమ మానవులు ఆ రాతలు చదవలేరని చెప్పాను కదా
తిలోత్తమ: మనుషులు రాయకపోతే ఇంకెవరు రాస్తారు గురువుగారు
పావనామూర్తి: చిన్నోడా ఆ తాళపత్రాలు భద్రంగా ఈ పెట్టెలో పెట్టేయ్
ఎద్దులయ్య: సమస్య జటిలం కాకుండానే పక్కదారి పట్టింది అని అనడంతో అక్కడితో ఆ సీన్ ముగుస్తుంది. తర్వాత గురువుగారు నయనితో ఒంటరిగా మాట్లాడుతారు.
గురువుగారు: అడగాలని ఆగిపోయావేందుకు నయని
నయని: విశాలాక్షి శ్రీశైలం వెళ్లేముందు నువ్వు ఎవరో తెలుసుకో అమ్మా అని నన్ను సందిగ్ధంలో పడేసింది. నాగులాపురం నుంచి తీసుకొచ్చిన పెట్టెలో నేను ఎవరని నా భవిష్యత్ ఏంటని రాసుందని మీరు అంటున్నారు. చూస్తే ఏమీ కనబడటం లేదు.
గురువుగారు: నుదిటి రాత కనపడదు నయని
నయని: తాళపత్రాల్లో ఉండేది చేతిరాతే కదా స్వామి
గురువుగారు: రాసింది ఎవరో కాదు నీ భర్తను కన్న తల్లి
నయని: అమ్మగారు నా జాతకం రాసిందా
గరువుగారు: ఇక్కడే సరిగ్గా అర్ధం చేసుకోవాల్సింది జాతకం వేరు భవిష్యత్ వేరు
నయని: అమ్మగారికి కూడా ముందే ఏం జరగనుందో తెలిస్తుందా స్వామి
గురువుగారు: గాయత్రీదేవి కూడా విశాలాక్షి అమ్మవారి మీద అపారమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండేది. తను చేసిన పూజల వల్ల చేసుకున్న పుణ్యాల వల్ల ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. ఒక కోరిక కోరుకో అని అమ్మవారు గాయత్రీ దేవి చెప్పగా తన కొడుకు కోసం కాకుండా తన కొడుకును పసిబిడ్డలా చూసుకొనే తన కోడలు రావాలని.. తన భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పమని అడిగింది. భర్త ఎంత సంపాదించిన ఎంత కీర్తి గడించినా భార్య గుణవంతురాలై ఉండాలి. లేదంటే అష్టఐశ్వర్యాలు ఉన్నా ఆ ఇంటికి అనర్ధమే. అందుకే నువ్వు ఇంకా మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నీ ఈ జన్మ ఎలా ఉంటుందో అని తాళపత్రాల్లో లిఖించారు.
నయని: అంటే మా తాతయ్య నా జాతకం రాస్తే.. నేను పుట్టక ముందే నా జాతకం విశాలాక్షి అమ్మవారు చెప్తే గాయత్రీ దేవి గారు రాశారా స్వామి. మరి ఎందుకు అమ్మగారు నాతో ఒక్క మాట చెప్పలేదు. చెప్పకూడదూ అనా..
గురువుగారు: చెప్పదు. చెప్పలేదు.. నయని నీకు రానున్న ఆపద కనిపిస్తుంది. దాన్ని పక్కదోవ పట్టించి ఆపదను తప్పిస్తావు అన్న వరం పొందావు. అయితే నీ భవిష్యత్ ఏంటి అని విశాలాక్షి అమ్మవారు చెప్పారు కానీ ఓ షరతు పెట్టారు. రాస్తున్నంత వరకు భావోగ్వేగానికి గురైన గాయత్రీ దేవి రాసిన తర్వాత వాటిని మరచి పోతుందని.. చదవాలి అన్నా అవి కనిపించవవు. మనుషులెవ్వరూ వాటిని చదవ లేరు. చదవాలి అని ప్రయత్నిస్తే వారికి గాయాలు తప్పవు అని స్వామీజీ చెప్పారు. ఇంకా నయని ఏదో అడగబోతుంటే శుభం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక తిలోత్తమ, వల్లభ ఆ ఘటన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గాయత్రీ పాప వల్లే జరిగిందని వల్లభ అంటే తిలోత్తమ వాటిని కొట్టి వేస్తోంది. ఇక నయని ఒంటరిగా ఓ చోట ఉంటే విశాల్ తన దగ్గరకు వస్తాడు. పిల్లల్ని ఎందుకు హాసిని వదిన దగ్గర ఉంచమన్నావ్ అని నయనినీ అడుగుతాడు. అందుకు నయని అందర్ని వదిలేయొచ్చు కానీ గాయత్రీ పాపని మాత్రం ఎవరో ఒకరు కనిపెడుతూనే ఉండాలి. తన వల్ల తిలోత్తమ అత్తయ్యకి ఈ పరిస్థితి అని నయని సీరియస్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.