Trinayani Today Episode  : గాయత్రీ దేవి లేదు అని పునర్జన్మలోనూ చనిపోయిందని సుమన అంటుంది. విక్రాంత్ తనని తిట్టి వారం రోజుల్లో పాపగా ఉన్న గాయత్రీ దేవి జాడ కనిపెడతా అంటాడు. దీంతో సుమన వారం కాదు నెల రోజుల టైం తీసుకోండి ఈ లోపు కనిపెడితే నేను నా ముఖం కూడా మీకు చూపించనని అంటుంది.  


మరో వైపు పెద్దబొట్టమ్మ విశాల్ ఇంటి గేటు దగ్గర ఉండటం అటుగా వెళ్తున్న పోలీస్ చూస్తాడు. ఎవరీవిడ విశాల్ గారి ఇంటి దగ్గర ఉంది అని అనుకుంటాడు. ఎవరు కావాలని పోలీసు పెద్దబొట్టమ్మను అడిగితే పెద్దబొట్టమ్మ కంగారు పడి అందరి పేర్లు చెప్తుంది. దీంతో పోలీసుకు అనుమానం వస్తుంది. పెద్దబొట్టమ్మ ఇంట్లోకి పారిపోతుంది. మరోవైపు సుమన మీద నుంచి ఇదంతా చూస్తుంది. పెద్దబొట్టమ్మ వాలకం మీద పోలీసన్నకి అనుమానం వచ్చిందని అనుకుంటుంది.


సుమన: ఇంటికి వచ్చింది ముసలిది. రావే నువ్వు చెప్తా. నా బిడ్డ కోసం నువ్వు వస్తావు అని నాకు తెలుసు. ఈ రోజు నేను ఉలూచి పాపని చూడనిస్తానా. 


పోలీస్: గార్డెన్‌లోకి వెళ్లిందా ఇంట్లోకి వెళ్లిందా.


సుమన: ఏదో ఒక దొంగతనం చేసి దాన్ని ఇరికించేస్తే అలా చేస్తే జైలుకెళ్లి పాముగా మారిపోయి వెళ్లిపోతుంది. దీని కంటే దాని కళ్లలో కారం కొట్టి ఒకరోజు అంతా అల్లాడిస్తా.


మరోవైపు దురంధర ఉలూచిని ఆడిస్తుంటుంది. పగలు ఆడించగలం కానీ రాత్రీ నిన్ను ఆడించడం కష్టం అని అనుకుంటుంది. ఇక హాసిని అక్కడికి వస్తుంది. పెద్ద బొట్టమ్మ దూరం నుంచి చూసి వాళ్లిద్దరిని తప్పించి చూడాలి అనుకుంటుంది. ఇంతలో వల్లభ, తిలోత్తమలు అక్కడికి వస్తారు.


హాసిని: గాయత్రీ అత్తయ్య ఆనవాళ్లు అని తను ఎక్కడో ఉంది అని అనుకోకండి తను ఇక్కడే ఉంది. 


విశాల్: ఏమంటున్నావ్ వదినా.


హాసిని: అంటే తన నీడ ఇక్కడే ఉంది అంటే తాను ఇక్కడే ఉంది అని అర్థం కదా విశాల్.


నయని: గత జన్మలో అమ్మగారి పార్థివ దేహాన్ని ఇక్కడే కాల్చినందుకు ఆ జ్ఞాపకాలు నీడలా వెంటాడొచ్చు అక్క.


విక్రాంత్: వదిన చిన్న పిల్ల రూపం నీడలా గోడ మీద పడటం మనం చూశాం కదా. 


నయని: పోలీస్ రావడంతో.. పోలీసన్న నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి. 


తిలోత్తమ: ఎలా ఉన్నావ్ అనకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతావ్ ఏంటి నయని.


సుమన: నువ్వు ఇక్కడే నక్కి ఉన్నావ్ అని అర్థమైంది పెద్దబొట్టమ్మ నువ్వు బయటకు వస్తే నీ కళ్లల్లో కారం కొడతా.


విశాల్: ఇన్‌స్పెక్టర్ గారు నయని కంగారులో అర్థం ఉంది. మీరు ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్‌లో పడతారు అని తాను అలా అడిగింది.


పోలీస్: ఇంట్లోకి దూరిన దొంగ మర్యాదగా బయటకు రావాలి.  


విశాల్: ఎక్కడి నుంచి రావాలి ఎవరు ఆ దొంగ.


సుమన: నక్కి ఉన్న దొంగ వస్తుంది. చూడండి.


విశాల్: పెద్ద బొట్టమ్మ. తను మాకు తెలిసిన ఆవిడే మీరు పొరపడ్డారు. 


వల్లభ: చుట్టం అన్నట్లు చెప్తారు ఏంటి తనో పాము.


పోలీస్: పాము..


దురంధర: చిత్ర విచిత్రంగా ఉంది కదా. ఇది నాగయ్య భార్య నాగులమ్మ అలియాస్ పెద్దబొట్టమ్మ.


విక్రాంత్: పోలీస్‌ని కంగారు పెట్టకండి. తను ఈ బిడ్డ ఉలూచి కోసం వచ్చింది. సార్ ఉలూచికి నేను తండ్రి కాదు. తల్లి సుమన మాత్రేమే కాదు ఈవిడ కూడా.


ఇక పెద్దబొట్టమ్మ ఉలూచిని పాము బిడ్డగా నిరూపిస్తాను అని అంటుంది. సుమన, తిలోత్తమలు కంగారు పడతారు. ఉలూచి తన బిడ్డ అని ఎత్తుకోనివ్వండి అని పెద్దబొట్టమ్మ ముందుకు రావడంతో సుమన తన వెంట తెచ్చుకున్న కారం విసిరేస్తుంది. దీంతో పెద్ద బొట్టమ్మ అల్లాడి పోతుంది. పాముగా మారి సుమనను కాటేస్తానని మొత్తం వెతుకుతుంది. ఇక నయని పోలీస్‌కు ప్రమాదం ఉందని ఆయన్ను వెళ్లిపోమని అంటుంది. తెగ కంగారు పడుతుంది. ఇక సుమన గుడ్డి పాము అని వెటకారం చేస్తుంది. 


సుమన పోలీస్‌ వెనక దాక్కుంటుంది. నయని పోలీస్‌ను వెళ్లిపోమని కంగారు పెడుతుంది. ఇంతలో సుమన పోలీస్‌ను తోసేయడంతో పెద్దబొట్టమ్మ పాము పోలీస్‌ను కాటేస్తుంది. అందరూ కంగారు పడతారు. నయని ఏడుస్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తామంటే లాభం లేదు అని నయని అంటుంది. పెద్దబొట్టమ్మ వచ్చి విషం తీస్తే తప్ప పోలీస్ బతకడని నయని అంటుంది. 
పాము బయటకు వెళ్లిందని విశాల్ అంటే నేను తీసుకొస్తాను అని ఉలూచిని తీసుకొని నయని బయటకు వస్తుంది. పెద్దబొట్టమ్మను చూసి సుమన మీద కోపంతో పోలీస్‌ను కాటేశావని.. విషం తీయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘క‌థ న‌డ‌క‌కైనా.. న‌ది న‌డ‌క‌కైనా మ‌లుపులే అందం’ - ఆకట్టుకుంటున్న 'కృష్ణమ్మ' ట్రైలర్‌