Trinayani Today Episode: రమణమ్మ అందరి కోసం కాఫీ కలిపి తీసుకొస్తుంది. తిలోత్తమకు విషం కలిపిన కాఫీ కప్పు ఇస్తుంది. ఇక తిలోత్తమ కూడా రమణమ్మ మీద అనుమానంతో విషం కలిపిన జ్యూస్ రమణమ్మకు ఇస్తుంది. అయితే అది పెద్దబొట్టమ్మ తీసుకొని తాగేస్తుంది. దీంతో తిలోత్తమ, వల్లభలు పాము విషం తాగినా ఏం కాదు అని తమ ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీలవుతారు. ఇక పెద్దబొట్టమ్మను సుమన మేడ మీద నుంచి నిల్చొని గమనిస్తూ ఉంటుంది.


సుమన: నువ్వు నిజంగానే గుడ్డిదానివా లేక అలా నటిస్తున్నావా తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చి నిల్చొన్నా. అని చేతిలో ఉలూచి పాప బెడ్‌ని కిందకి విసిరేస్తుంది. దాంతో పెద్ద బొట్టమ్మ సుమన ఉలూచిని కింద పడేసిందేమో అని హడావుడిగా వెళ్లి పట్టుకుంటుంది. అయితే అందులో ఉలూచి పాప ఉండదు. అందరూ ఉలూచి పాపనే పడేసిందని సుమనకు చీవాట్లు పెడతారు. అయితే నిజం బయట పెట్టడానికి ఇలా చేశాను అని సుమన అంటుంది.


విక్రాంత్: ఏంటి ఆ నిజం.


సుమన: పెద్ద బొట్టమ్మకు బ్రహ్మాండంగా కళ్లు కనిపిస్తున్నా గుడ్డిదానిలా నాటకం ఆడుతూ ఇంట్లోకి వచ్చిందని. 


తిలోత్తమ: నాటకాలు ఆడింది పెద్దబొట్టమ్మ మాత్రమే కాదు సుమన ఈ రమణమ్మ కూడా.


హాసిని: రమణమ్మా.. రంగమ్మా..


తిలోత్తమ: రెండు పేర్లు తనవే.. ఉలూచి కోసం పెద్ద బొట్టమ్మ వస్తే..


రమణమ్మ: నిన్ను చంపడం కోసం నేను వచ్చాను తిలోత్తమ అని తన వెంట తెచ్చుకున్న చాకుతో తిలోత్తమ మీదకు దాడికి వెళ్తుంది. అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. విశాల్ ఆమె చేతిలో చాకు తీసుకుంటాడు.


విశాల్: రమణమ్మ తిలోత్తమ అమ్మ ప్రాణం తీసే హక్కు నీకు లేదు. నా మాట విన్నందుకు నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది వెళ్లిపో. 


తిలోత్తమ: నన్ను చంపడానికి వచ్చిన దాన్ని వదిలేస్తున్నావ్ ఏంటి విశాల్.


విశాల్: ఆ ప్రశ్న అడిగే అధికారం నీకు కూడా లేదు అమ్మ. ఇంత కంటే ఎక్కువ అడిగితే ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.


నయని: పెద్దబొట్టమ్మ బాబుగారు చెప్పాక ఇంకా ఇక్కడ ఉండకండి వెళ్లిపోండి. విశాల్‌తో ఒంటరిగా.. బాబుగారు రమణమ్మ తిలోత్తమ అత్తయ్యకి పొడవబోతే ఎందుకు అడ్డుకున్నారు. పెంచిన అమ్మ మీద ఈగ కూడా వాలనివ్వరు అన్నమాట. మరి ఎందుకు కన్న తల్లిని చంపిన వారిని వదిలేశారు. 


విశాల్: నయని మా అమ్మని చంపేశారు అని నువ్వు ఎలా చెప్తున్నావు.


నయని: ఎలా అంటే ఆరోగ్యంగా ఉన్న అమ్మగారు పని మీద లక్ష్మీపురం వెళ్లి సాయంత్రానికి శవమై తిరిగి వచ్చారు అంటే శత్రువులు హత్య చేసుంటారు అని ఎవరైనా నమ్ముతారు. గాయత్రీ అమ్మగారి విషయాన్ని మీరు తేలికగా తీసుకున్నా నేను మాత్రం చాలా సిరీయస్‌గానే తీసుకున్నా బాబుగారు. టైం వస్తే మాత్రం నేను చేయాల్సింది చేస్తా. ఎందుకు రమణమ్మని అడ్డుకున్నారు. ఎందుకు ఆమెను వెళ్లిపోమన్నారు.


విశాల్: రమణమ్మ తిలోత్తమ అమ్మని ఎందుకు పొడవాలి అనుకుంది శత్రుత్వం ఏంటి అనేది ఎవరికీ సరిగ్గా తెలీదు. అలాంటప్పుడు కళ్ల ముందు దారుణం జరుగుతుంటే ఆపాలి అని ఆపాను. రమణమ్మకు వెళ్లకపోతే తిలోత్తమ అమ్మ ఏం చేస్తుందా అని భయంతో వెళ్లిపోమని చెప్పా. ఇక రమణమ్మ భర్త ఎప్పుడో మిస్ అయ్యాడు. చనిపోయాడు అనుకుంటే రమణమ్మ కాలికి మెట్టెలు పెట్టుకుంది, బొట్టుపెట్టుకుంది. అంటే రమణమ్మ కూడా ఏదో విషయాన్ని దాచి పెట్టింది నయని.  అందుకే తను వెళ్లిపోవాలని వెళ్లిపోయాక ఫాలో చేయొచ్చని అలా చేశాను.


నయని: అర్థమైంది బాబుగారు. 


రాత్రి సుమన హాయిగా పడుకొని ఉంటే విక్రాంత్ కోపంగా దుప్పటి లాగేస్తాడు. ఉలూచి గార్డెన్‌లో ఉందని తీసుకురమ్మని అంటాడు. పాము పిల్ల ఎక్కడున్నా పర్లేదు అని సుమన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది. ఇక సుమన రమణమ్మ తిలోత్తమను హత్య చేయాలి అని చూసినా రమణమ్మని ఏమీ అనలేదు అని విక్రాంత్‌ మీద అరుస్తుంది. దాంతో విక్రాంత్ తిలోత్తమ మూగ జీవి అయిన గుర్రాన్నే చంపింది. నువ్వు నేను ఒక లెక్క కాదు అని అంటాడు. గుడ్డిగా నమ్మితే అడ్రస్ లేకుండా పోతావ్ అని అంటాడు. ఇక సుమన తనలో తాను నా కంటూ టైం వస్తే తిలోత్తమ అత్తయ్యను కూడా ఒక జ్ఞాపకంగా మిగులుస్తాను అని అనుకుంటుంది. 


ఉదయం ఇంటికి గురువుగారు వస్తారు. అయితే తిలోత్తమ తానే తనకు సమస్య వచ్చి గురువుగారిని పిలిచాను అని అంటుంది. ఇక నయనితో నేను మృత్యు కోరల్లో చిక్కుకుంటాను అని తెలిసి కూడా సైలెంట్‌గా ఉన్నావ్ కదా నయని అని అడుగుతుంది.


విశాల్: అమ్మా నయని మీద నింద వేస్తున్నావ్ ఏంటి. 


వల్లభ: నిన్న మా అమ్మని ఆ రమణమ్మ చంపేబోయింది. ఒక్క నిమిషం లేట్ అయింటే మా అమ్మని పొడిచేది కదా.


నయని: బాబు గారు ఆపారు కదా.


సుమన: బాబు గారు హీరో అని మాకు తెలుసక్క. కానీ అత్తయ్యకు విలన్ మాత్రం నువ్వే. 


నయని: చెల్లి రెచ్చగొట్టేలా మాట్లాడకు.


తిలోత్తమ: తను అన్నది కరెక్టే. నా చావుని కోరుకున్నావ్ కాబట్టి నాకు హాని ఉందని చెప్పలేదు. 


సుమన: మా అక్క మా అత్తయ్యని మీకు ప్రాణాపాయం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తే సరిపోయేది కదా.


నయని: నాకు తెలిస్తే నేనే చెప్పేదాన్ని కదా.


తిలోత్తమ: గురువుగారు నా జాతకం చూసి చెప్పండి. నాకు మృత్యువు దరిదాపుల్లో ఉందేమో చెప్పండి. అందరిని ఆదుకునే నయని నా వరకు వచ్చే సరికి ఏం చెప్పకపోతే అనవసరంగా బలైపోతాను.


హాసిని: గురువుగారు మా అత్తయ్య ఎప్పుడు చనిపోతుందో చెప్పండి.


తిలోత్తమ: ఏంటి ఆ ప్రశ్న.. గురువుగారు నాకు మృత్యువు పొంచి ఉందేమో చెప్పండి.


సుమన: స్వామి మీరు చెప్తే కానీ అత్తయ్యకు ఉపశమనం ఉండదు. 


గురువుగారు నాగులాపురం నుంచి తీసుకొచ్చిన పెట్టి తీసుకురమ్మని చెప్తారు. విశాల్ తీసుకొస్తాడు. ఇక గురువుగారు గాయత్రీ పాపను ఆ పెట్టే మీద కూర్చొపెట్టమని అంటారు. ఇక పాపని కూర్చొపెట్టి తన చేతికి గవ్వలు ఇచ్చి వాటి నుంచి వచ్చిన అంకె తాళపత్రం తీసి చదివితే తిలోత్తమకు గండం ఉందో లేదో తెలుస్తుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప