Trinayani Today Episode సుమన గాయత్రీ పాపని ఎత్తుకొని వచ్చి తిలోత్తమ, వల్లభలకు ఇస్తానని చెప్తుంది. మరోవైపు విశాల్, విక్రాంత్‌లు ఫైల్‌లు ముందు వేసుకొని ఆఫీస్ పనులు చూస్తారు. ఇక నయని కూడా అక్కడికి వస్తుంది. తిలోత్తమ, వల్లభలకు ఓ బాస్కెట్‌లో గాయత్రీ పాపని పెట్టి ఇస్తుంది సుమన.
డమ్మక్క: ఎక్కడికి వెళ్తున్నారు.తిలోత్తమ: బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అగడకూడదు అని తెలీదా..నయని: వెళ్లిరండి అత్తయ్య కానీ ఆ బాస్కెట్ ఎక్కడికి పట్టుకెళ్తున్నారు. తిలోత్తమ: బ్యాంకుకు వెళ్తున్నాం. హాసిని: బట్టల షాపుకి కూడా ఇలాంటి బుట్టలు పట్టుకొని వెళ్లరు మీరు ఇలాంటి బుట్టలు పట్టుకొని వెళ్తే నవ్వరా.. వల్లభ: మమ్మీ హాసినికి మ్యాటర్ తెలీదు.సుమన: బావగారు అత్తయ్య గారిని చెప్పనివ్వండి మీరు మాట్లాడి ఇబ్బంది పాలవకండి.విక్రాంత్: ముగ్గురు ఒక మాట మీద భలే ఉంటారే..డమ్మక్క: మాట మార్చకముందే ఆ బుట్టలో ఏముందో తెలుసుకోండి పుత్రా..వల్లభ: ఏయ్ నీకు అవసరమా..విశాల్: ఇలా అన్నావు అంటే ఏదో ఉండే ఉంటుంది. తిలోత్తమ: క్యాష్ ఉంది విశాల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి.నయని: బ్యాగ్‌లోనో.. బ్రీఫ్ కేస్‌లో తీసుకెళ్లొచ్చు కదా.. ఇంతలో పావనా మూర్తి టిఫిన్ చేసి తన చేయి కడగమని తన భార్య ధురందరని అంటే ఆ నీరు తీసుకొని విశాల్ నేను కడుగుతాను అని పావనాకి సైగ చేసి వద్దు వద్దు అంటూ పావనా చుట్టూ తిరిగేలా చూస్తాడు. విశాల్ పావనాను వెంటపడినట్లు తిరిగి నీరు వల్లభ చేతిలో ఉన్న బాస్కెట్‌లో వేసేస్తాడు. అందరూ నోట్లు తడిసిపోయాయి అనుకుంటారు.
వల్లభ: మమ్మీ వేడి నీరు పడినా లేవలేదు ఏంటి. సుమన: బావగారు ఏం మాట్లాడుతున్నారు.తిలోత్తమ: వీడు మూర్ఖుడు ముందు వెనక ఆలోచించడు.పావనా: లేవలేదు అంటున్నారు బుట్టలోనుంచి పాము వస్తుందా ఏంటి..సుమన: మనసులో.. గాయత్రీ వేడినీరు పడినా కిసుక్మనకుండా ఎలా ఉంది. నయని: అత్తయ్య నీరు పడ్డాయి కదా నోట్లు తడిచిపోయేలా ఉన్నాయి ఆరబెట్టి తీసుకెళ్లండి.తిలోత్తమ: పర్వాలేదు లే నయని. ఇంతలో హాసిని గాయత్రీ పాపని ఎత్తుకొని వస్తుంది. అది చూసి తిలోత్తమ, వల్లభ, సుమనలు షాక్ అయిపోతారు. వల్లభ: అరే గాయత్రీ అక్కడుంది ఏంటి మమ్మీ..హాసిని: ఇంకెక్కడుండాలి రాజా బుట్టలోనా..విశాల్: అమ్మా టైం లేదని హడావుడిగా బయల్దేరిన మీరు ఇక్కడే ఉండి. ఈలోపు టిఫిన్ చేసేవాళ్లు కదా..డమ్మక్క: మింగుడు పడనప్పుడు ముద్ద దిగదు విశాల్ బాబు.విక్రాంత్: ఏదైనా సమస్యా.. సుమన: బాస్కెట్‌లో పట్టుకెళ్లేది డబ్బా ఇంకేమైనానా ఒకసారి చూడండి బావగారు.తిలోత్తమ: రేయ్ కారులో చూద్దాం పదరా..వల్లభ: హేయ్ ఆగు మమ్మీ. టెన్షన్‌తో మైండ్ పనిచేయడం లేదు. ఇప్పుడే చూద్దాం. తిలోత్తమ: రేయ్ అది కాదురా..వల్లభ: ఆగు మమ్మీ.. బాస్కెట్ ఓపెన్ చేస్తే అందులో రాళ్లు ఉంటాయి.. మళ్లీ ముగ్గురు షాక్ అవుతారు. విశాల్: అన్నయ్య ఏంటి ఈ పిచ్చి పని అమ్మ డబ్బు పెట్టమంటే రాళ్లు పెట్టావేంటి. సుమన.. బాస్కెట్‌లో గాయత్రీ పాపని పెట్టడం చూసిని హాసిని బయట సౌండ్ చేసి పాప ప్లేస్‌లో రాళ్లు పెట్టేస్తుంది.
ఇక తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. జరిగిన విషయం ఇద్దరూ అఖండ స్వామికి చెప్తారు. మరో అవకాశం ఇవ్వమని తిలోత్తమ అఖండ స్వామిని అడుగుతుంది. దీంతో అఖండ స్వామి మీ వల్ల అవ్వదని నేరుగా తానే రంగంలోకి దిగుతాను అని అంటారు. రేపు మీ ఇంటికి వస్తాను అక్కడ పరీక్షిస్తాను అని అంటారు అఖండ. మరోవైపు సుమన దగ్గరకు హాసిని వచ్చి గాయత్రీ పాపని బుట్టలో పెట్టి అత్తయ్య వాళ్లకి ఇవ్వాలి అనుకున్నావని చివాట్లు పెడుతుంది. దీంతో సుమన అది మా అక్క కన్న బిడ్డ కాదు కదా గాయత్రీ గురించి అంత సీరియస్‌గా తీసుకోవాలా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.