Trinayani Today Episode నయని ఎంత జాగ్రత్త పడినప్పటికీ నయని కారణంగానే లలితాదేవి బొటనవేలు తెగుతుంది. విశాల్ వాళ్లు కట్టుకడతారు. హాస్పిటల్‌కి వెళ్దామని అంటే పర్లేదు వద్దు అని అంటుంది. ఇక తన వల్లే ఇలా జరిగింది అని నయని ఏడుస్తుంది. ఇక లలితాదేవిని విశాల్ రెస్ తీసుకోవడానికి తన గదికి తీసుకెళ్తాడు. మరొవైపు వల్లభ తన రుమాలులో లలితాదేవి బొటనువేలికి వచ్చిన రక్తాన్ని తుడిచి అఖండ స్వామి దగ్గరకు తిలోత్తమతో కలిసి పరుగులు తీస్తాడు.
తిలోత్తమ: లలిత అక్క చేతికి గాయం అయ్యేలా రకరకాలుగా ప్రయత్నించి చివరకు రక్తం మరకలు సాధించాం స్వామి.అఖండ: ఏం సాధించారు. వల్లభ: అదేంటి మమ్మీ అలా అంటారు స్వామి రుమాలు పట్టుకొని వచ్చాం కదా.అఖండ: జెండా పట్టుకొని పరుగుపెట్టిన చిన్న పిల్లాడిలా ఈ రక్తపు మరకల్ని ఇక్కడికి తీసుకొస్తే ఫలితం ఏముంటుంది వల్లభ. తిలోత్తమ: మీకు చూపిద్దామని స్వామి.అఖండ: నేను దీన్ని చూడాలి అనుకోలేదు. మీరే గాయత్రీ దేవి జాడ చూడాలి అనుకున్నారు. ఈ రక్తపు మరకలు ఇక్కడి నుంచే కదలాలి. లలితా దేవి, గాయత్రీ దేవి అక్కాచెల్లెలు. ఇద్దరిరీ ఒకటే రక్తం. తిలోత్తమ: తండ్రులు వేరు స్వామి.వల్లభ: తల్లులు కూడా వేరే.. వాళ్లమ్మ వీళ్లమ్మ అక్కాచెల్లెలు. అఖండ: ఏ విధంగా చూసినా రక్తసంబంధం ఉంది. గాయత్రీ పాపకు ఈ వస్త్రం మీరు కప్పితే గాయత్రీ దేవి జాడ తెలుస్తుంది. అమ్మ వారి పేరుకు ఉన్న పవర్ అలాంటిది. తిలోత్తమ: రక్తమున్న గుడ్డ నా బిడ్డ మీద కప్పుతారా అని నయని సీరియస్ అవుతుంది. పొరపాటున జరిగినట్లు ఉండాలి కానీ మనం చేసినట్లు తెలీకూడదు. అఖండ: ఇదే మీకు సదావకాశం. నామకరణం జరిగేటప్పుడు పిల్లని ఓ చోట కూర్చొపెడతారు. ఆ పాపను అక్కడ నుంచి కదలనివ్వరు. టైం చూసి మీరు ఆ పాప మీద ఈ క్లాత్ పడేలా చేయండి. నీ కొడుకుకు అర్థమయ్యేలోపు అమావాస్య వస్తుంది తిలోత్తమ. తనలో తాను.. రేపు గనక ఆ వస్త్రం గాయత్రీ పాప మీద పడితే తర్వాత జరిగే ప్రళయం ఎవరూ ఆపలేరు.
పావనా, దురంధర, డమ్మక్కలు గాయత్రీ పాపని హాల్‌లో ఆడిపిస్తుంటాడు. ఇంతలో ఉలూచి పాముగా మారి గాయత్రీ పాపతో దాగుడు మూతలు ఆడుతుంది. పావనా మిగతా వాళ్లు క్లాప్స్ కొట్టి ప్రోత్సహిస్తారు. హాల్‌లోకి అందరూ వస్తే ఆ విషయం చెప్తారు.
విశాల్: గాయత్రీ ఉలూచితో ఆడుకుంటుందా..సుమన: ఆడకూడదు అంటారా బావగారు.విక్రాంత్: రాత్రి పూట ఉలూచి పాము పిల్లలా మారుంటుంది కదా ఎలా ఆడుకుంటుంది అని..వల్లభ: ఆ గాయత్రీ పాప పొరపాటున ఉలూచి తోక తొక్కిందే అనుకో కాటేస్తుంది కదా..నయని: పాము పిల్ల అని అనుకోకండి.. మా ఇద్దరి కంటే అక్కాచెల్లెలు అయిన ఉలూచి పాప, గాయత్రీ పాప ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తిలోత్తమ: ఉంటే మంచిదే నయని కానీ ఇది ఆట హడావుడిగా అవుట్ చేస్తాను అని ఉలూచి తోకకు బదులు గాయత్రీ తల తొక్కిందే అనుకో ప్రాణాలు పోతాయి.సుమన: అవును తొక్కినా తొక్కేస్తుంది. ఉలూచి వచ్చేయ్ నువ్వు..దురంధర: పిల్లుల ఆడుకుంటున్నారు లేవే.సుమన: నువ్వు బాగానే చెప్తున్నావ్ పిన్ని. ఏమైనా జరిగితే నీలా పిల్లలు లేని దానిలా నేను ఉండాలి అనేనా నీ ఉద్దేశం.విక్రాంత్: అత్తయ్య చెప్పింది ఏంటి నువ్వు చెప్పేది ఏంటే..విశాల్: ఎన్ని సార్లు చెప్పినా తనకు అర్థం కాదు.సుమన: ఉలూచి బయటకు రా..హాసిని: ఎందుకు అలా అరుస్తున్నావ్ చిట్టీ గాయత్రీ ఎక్కడుంటే తను కూడా అక్కడే ఉంటుంది కదా. నయని: గాయత్రీ ఏంటమ్మా సోఫా కింద చూస్తున్నావ్..వల్లభ: మమ్మీ సోఫా కింద చూస్తుంది అంట.తిలోత్తమ: నువ్వు నోర్ ముయ్‌రా..హాసిని: సోఫా కిందకి చూడకూడదా ఏంటి రాజా.సుమన: మనసులో.. ఉదయం నేను దాచి పెట్టిన చాకు చూస్తారా.. పూజల దండ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడెలా. కరెక్ట్‌గా వాటి దగ్గరే ఉలూచి ఉంటుంది.డమ్మక్క: సోఫా కింద ఉలూచి మాత్రమే ఉంది అంటారా..విశాల్: ఉలూచి రా మీ అమ్మ పిలుస్తుంది.సుమన: ఉండనివ్వండి బావగారు పిల్లులు ఆడుకుంటున్నారు కదా. హాసిని: ఇందాకే కదా నా బిడ్డ నా బిడ్డ అని అరిచావ్..తిలోత్తమ: పిల్లులు కదా ఆడుకుంటారులే..విక్రాంత్: నిమిషానికి ఒక మాట మార్చుతారు ఏంటి బ్రో.సుమన: వెళ్లండి అక్క వెళ్లి పడుకోండి.నయని: నీ కంగారు చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది చెల్లి. సోఫా కిందకు వెళ్లిన ఉలూచి బయటకు రావలి అయినా రావడం లేదు అంటే ఒకసారి చూడాలి కదా.
ఇక హాసిని కిందక చూస్తాను అంటే వల్లభ హాసినిని పట్టుకుంటాడు. ఇక సుమన నయనిని పట్టుకుంటుంది. ఇక విక్రాంత్ వీళ్లు ఏదో డ్రామా చేస్తున్నారు అని సోఫా జరిపేస్తాడు. అప్పుడు చాకు బాక్స్‌ను అందరూ చూసేస్తారు. నయని బాక్స్ తీసుకుంటుంది. అందులో తిలోత్తమ సుమనకు ఇచ్చిన పూజల బాక్స్ కాళీగా ఉంటుంది. ఇక నయని ఆ చాకుతో సుమన గొంతు దగ్గర పెట్టి చంపేస్తా అంటుంది.
నయని: మా చెల్లిని చంపేసి ఉలూచిని మనమే పెంచుకుందాం బాబుగారు. చెప్పు ఎందుకు ఇంత నాటకం ఆడావ్. తిలోత్తమ: తనేం చేసింది నయని..హాసిని: ఈ డ్రామాకు డైరెక్షన్ మీరేనా అత్తయ్య. ఆ బాక్స్‌లో పూజల దండ ఉండేది కదా. విక్రాంత్: ఓహో అదే దండ సుమన మెడలో వేసిందా మా అమ్మ.పావనా: హా.. దండ తెగడం.. దురంధర: పెద్దొదిన కాలు జారి నయని చేతిలోని చాకు తగిలి గాయం కావడం..విశాల్: మా పెద్దమ్మ మీద నీకు ఎందుకు అంత ద్వేషం సుమన. తిలోత్తమ: వదులు.. నిన్నే నయని వదులు.. అని తిలోత్తమ చాకు తీసుకుంటుంది. అసలు నువ్వు హాల్‌లోకి ఎందుకు చాక్ తెచ్చావు. ఆపిల్స్‌ను కిచెన్‌లోకి తీసుకెళ్లి కట్ చేయొచ్చు కదా.. సుమన: నేను చేయని తప్పునకు బాధ్యురాలిని చేయాలి అని చూస్తుంది మా అక్క.నయని: నువ్వు వేషాలు వేయకు చెప్తున్నా..విశాల్: నయని ప్లీజ్ పెద్దమ్మకు తెలిస్తే బాధ పడతారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్.తిలోత్తమ: పదరా అన్నింటికీ మనల్నే అంటారు వీళ్లు.
ఇక విక్రాంత్ సుమనను తిడతాడు. ఇక నయని అక్కడికి వచ్చి నువ్వు తప్పు చేశావ్ అని అంటుంది. తను ఇంటి గడప కూడా దాటలేదు అని సుమన అంటుంది. ఇక నయని సుమనను తిడుతుంది. లలితమ్మ నీకు ఏం అన్యాయం చేసింది ఇంత దారుణం ఒడిగట్టావ్ అని తిడుతుంది. ఇక సుమన నయని మీద రివర్స్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.