Trinayani Today Episode తిలోత్తమ కుడి చేతికి అమ్మవారి పాట పాడుతూ కంకణం కట్టమని లలితాదేవి నయనికి చెప్తుంది. తిలోత్తమ కంగారు పడుతూ కంకణం ఎందుకని ప్రశ్నిస్తుంది. అందరూ కంకణం కట్టుకోమని తిలోత్తమకు చెప్తారు. దాంతో తిలోత్తమ తనకు ఏం వద్దని వెళ్లిపోతాను అని వెళ్తుంటే ఇంట్లో నుంచి వెళ్లి పోతావా అని లలితాదేవి ప్రశ్నిస్తుంది. దాంతో తిలోత్తమ ఆగుతుంది. అందరూ షాక్ అయిపోతారు.
వల్లభ: మమ్మీ నువ్వు వెళ్లకు మమ్మీ. కాదు అని వెళ్తే మళ్లీ ఈ జన్మలో నిన్ను పెద్దమ్మ రానిచ్చేలా లేదు.
సుమన: ఇదెక్కడి అన్యాయం వద్దు అన్నా తప్పేనా.
హాసిని: మిమ్మల్ని ఏమీ ఆ గ్లౌజ్ తీసేయమని చెప్పడం లేదు కదా. చెల్లి పాట పాడుతూ కంకణం కడుతుంది అంతే.
విశాల్: అమ్మ తేలికగా అయ్యే పనిని కూడా అడ్డుకుంటావ్ ఎందుకు. నీ గాయం తగ్గాలి అనే కదా.
తిలోత్తమ: అదే కానీ ఇప్పుడు ఎందుకు అని.
లలితదేవి: ముహూర్త బలం ఉన్నప్పుడే ఇలాంటి పనులు సంపూర్ణం అవ్వాలి. నయని నువ్వు కానివ్వమ్మా.
నయని అమ్మవారి పాట పాడుతూ అమ్మవారికి హారతి ఇచ్చి అందరికీ హారతి ఇస్తుంది. తర్వాత తిలోత్తమ కుడి చేతికి కంకణం కడుతుంది. కంకణం కట్టగానే తిలోత్తమ చేయి వణికిపోతుంది. ఒక్కసారిగా తిలోత్తమ మగ గొంతుతో మాట్లాడుతుంది. అందరూ బిత్తర పోతారు.
దురంధర: అంతే ఈ మాత్రం దానికి బెట్టు చేశావ్ ఏంటి వదినా.
తిలోత్తమ: మగ గొంతుతో.. ఎవడే వదినా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను.
వల్లభ: మమ్మీ నీ గొంతుకి ఏమైంది.
తిలోత్తమ: నా గొంతు నొక్క డానికే మణి కట్టుకి కంకణం కట్టారు రా.. మంట.. మంట.. మంట..
నయని: అమ్మగారు ఇంతకు ముందు గుమ్మడికాయతో దిష్టి తీయాలి అన్నప్పుడు కూడా ఇలాగే అరిచారు.
లలితాదేవి: అమ్మవారి శక్తి ముందు ఎవరి కుయుక్తులు పని చేయవు నయని.
తిలోత్తమ మంట మంట అని అరుస్తుంది. చేయి విపరీతంగా వణుకుతుంది. మగ గొంతుతో తిలోత్తమ మంట మంట అని అరుస్తుంది. ఇక లలితాదేవి నయనితో అమ్మవారి కుంకుమ తిలోత్తమ నుదిటిన పెట్టమని అంటుంది. నయని అలాగే బొట్టు పెడుతుంది. నయని బొట్టు పెట్టగానే మంట మంట అని తిలోత్తమ చేతి గ్లౌజ్ తీసేస్తుంది. దాంతో చేయి పూర్తిగా మాడిపోయి ఉంటుంది. అందరూ భయంతో ఆశ్చర్యంతో చూస్తారు. తిలోత్తమ లలితాదేవిని చూసి ఏడుస్తుంది.
తిలోత్తమ: ఏం చెప్పను అక్క సర్పదీవిలో కరడి అనే విగ్రహం మీద ఉండే జ్యోతిని వెలిగించేటప్పుడు అంటుకు పోయి ఇలా కాలిపోయింది. చేయిని ఇలా చూస్తే కేళి చేస్తారని గ్లౌజ్ పెట్టుకొని మ్యానేజ్ చేస్తున్నాను. అమ్మవారి శక్తితో మీరు అందరూ చూసేలా చేశారు. నన్ను అవమానించారు. అవమానించారు అక్క.. అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.
విశాల్: ఈ విషయం ముందే చెప్తే ఇలా చేసేవారు కాదు కదా.
లలితాదేవి: ఏం జరిగినా గమనిస్తూ ఉండాలి. తిలోత్తమను ఎవరూ ఓదార్చకండి కాసేపు అలా వదిలేయండి.
సుమన గది ముందు చీర పడేసి ఉంటే విక్రాంత్ తీసుకొని వచ్చి నీ పని వాడిని అనుకున్నావా ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే తీయడానికి అనుకొని సుమనను తిడతాడు. అందరూ మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు అని కిందకి రమ్మని పిలుస్తాడు. గదిలో తిలోత్తమ చేతికి కూల్ స్ప్రే వేసుకొని ఉంటుంది. వల్లభ తిలోత్తమ దగ్గరకు వస్తాడు.
తిలోత్తమ: ఈ చేతికి జీవం అయితే లేదు కానీ దీంతో చాలా పనులు చేసేయొచ్చు. ఈ కాలిన చేయి లేకపోతే మీ అమ్మ ఈ స్థితిలో ఉండేది కాదు. ప్రతీ నెల పౌర్ణమి నాడు రూపం మార్చుకోవాలి అన్నా, వ్యాపారంలో రూపు రేఖలు మార్చేయాలి అన్నా దీని వల్లే సాధ్యం అవుతుంది.
వల్లభ: అదెలా మమ్మీ. మ్యాజిక్ చేస్తావా ఏంటి. అయినా ఇంట్లో వాళ్లు రకరకాలుగా అనుకుంటున్నారు. నీ చేతి గురించి..
తిలోత్తమ: ఏమై ఉంటుందా అనే ప్రశ్నలు వాళ్ల మెదడులు వేధిస్తుంటాయి. ఒక్క నయనికి తప్పు. నయనికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ నా అనుమానం ఏంటి అంటే హర్ష అనే కుర్రాడి ఆత్మ ఇంటికి వచ్చింది అంటే నయనితో మాట్లాడే ఉంటాడు.
వల్లభ: అయితే నువ్వే చంపేశావ్ అని చెప్పుంటాడా.
తిలోత్తమ: చెప్పుంటే నన్ను నిలదీసేవాడు. వాడు అసలు నయనిని కలవడానికి వచ్చుండదు. నన్ను ఇక్కడ చూసి ఉంటాడు. ఎప్పుడు అయితే నయని కూడా ఆత్మని చూడగలుగుతుందని తెలుసుకున్నాడో అప్పుడు తనతో జరిగిన విషయం చెప్పాలి అనుకొని ఉంటాడు. అదృష్టవసాత్తు పూర్తి వివరాలు చెప్పలేదు అనుకుంటా.
వల్లభ: ఇప్పుడు ఈ చేయి ఇలా ఉంది అని అందరికీ తెలిసిపోయింది కదా మరి గ్లౌజ్ వేసుకోవా.
తిలోత్తమ: కచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఈ చేయి ఎంత భద్రంగా ఉంటే నాకు అంత బలం. నా భవిష్యత్ అయినా నా ప్రాణం అయినా ఇదే అని నా నమ్మకం.
వల్లభ: ఇప్పుడు నువ్వు కనిపిస్తే అసలు ఏం జరిగిందో చెప్పమని కచ్చితంగా అడుగుతారు.
తిలోత్తమ: నువ్వు మ్యానేజ్ చేయాలి వల్లభ.
వల్లభ: నా వల్ల అవుతుందా..
తిలోత్తమ: వెళ్దాం పద.. లలితా అక్క వెళ్లిపోయింది. విశాల్, నయని అడిగిన ప్రశ్నలకు నేను ఏదో ఒక రకంగా మ్యానేజ్ చేస్తాను.
వల్లభ: మమ్మీ మరి ఇప్పుడు గ్లౌజ్ వేసుకుంటే ఆ చేయి విరిగిపోతుంది కదా.
తిలోత్తమ: ఇది విరిగిపోతుంది అంటే మీ అమ్మ చితికి నువ్వు కట్టెలు విరవాలి వల్లభ.
పావనా: అల్లుడు ఇన్నిరోజులు మనం తిలోత్తమ చేతికి ఏమైంది అని ఆలోచించకుండా ఆ చేతిలో ఏముందో అని ఆలోచించాం.
దురంధర: చిన్న గాయం అయింది అని చెప్పింది కానీ సర్పదీవిలో ప్రమాదంలో కాలిపోయింది అని చెప్తే ఎవరు ఏమంటారు.
హాసిని: ఆల్‌మోస్ట్ అవిటితనం వచ్చేసినట్లే కుడి చేతితో తినలేను.. చేతిని వాడలేను అని బాధ, సిగ్గుతో చెప్పలేదు అనుకుంటా.
నయని: అత్తయ్య అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది.
సుమన: నువ్వు ఇలాగే అనుమానిస్తే తను ఇంకో చేయి కూడా కాల్చుకుంటుంది అక్క.
విక్రాంత్: నువ్వు అనుకున్నంత పిచ్చిది కాదు మా అమ్మ. సాధారణంగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. కానీ ఆ చేయి కాలేకే లెక్కించలేని అంత డబ్బు సంపాదించింది అంటారు.
విశాల్: ఇంత షార్ట్ టైంలో అంత రిచ్ అవ్వడం అసాధ్యం. నయని అన్నదే నిజం అనిపిస్తుంది.
తిలోత్తమ: ఎడమ చేతిలో గాయత్రీ పాపని ఎత్తుకున్నాను వదిలేస్తే ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో కుడి చేతిని కాల్చుకోవాల్సి వచ్చింది.
నయని: వదిలేశారు అత్తయ్య తను తప్పిపోయినందుకే మీ కన్నా ముందు రా గలిగింది.
విశాల్: అది సరే కానీ కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదా అమ్మ ఆ జ్యోతి ఎలా వెలిగించావ్.
తిలోత్తమ: ఉలూచి కోరల్లోంచి అగ్గి చిమ్మితే దీపం వెలిగించాను.
విక్రాంత్: వెయిట్ వెయిట్ సుమన నువ్వు పాప పాదాలకు సాక్స్‌లు తీసినప్పుడు తన పాదాలు ఎలా ఉన్నాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.